Uddhav Sena: బీజేపీ ప్రభుత్వం మరాఠీ ప్రజలపై హిందీ రుద్దుతుందనే కారణంతో 20 ఏళ్ల విభేదాలను పక్కన పెట్టి ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు ఒక్కటయ్యారు. మహారాష్ట్ర ప్రభుత్వం హిందీని మూడో భాషగా వెనక్కి తీసుకోవాలనే నిర్ణయం తర్వాత, ఠాక్రే సోదరులు శనివారం ‘‘వాయిస్ ఆఫ్ మరాఠీ’’ పేరుతో పెద్ద ర్యాలీని నిర్వహించారు. ఇకపై తామిద్దరం కలిసి ఉంటామని చెప్పారు. అయితే, ఈ భాషా ఉద్యమానికి మద్దతుగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నిలిచారు. ఠాక్రేలు కలిపోవడాన్ని స్వాగతించారు. భాషా ఉద్యమం తమిళనాడు సరిహద్దును దాటి మహారాష్ట్రకు చేరిందంటూ వ్యాఖ్యానించారు.
Read Also: Nagpur: గ్యాంగ్ లీడర్ భార్యతో ఎఫైర్.. గ్యాంగ్ మెంబర్‌ని చంపేందుకు రంగంలోకి 40 మంది..
అయితే, స్టాలిన్ వైఖరికి ఉద్ధవ్ ఠాక్రే శివసేన(యూబీటీ) దూరంగా ఉంది. “హిందీ విధించడాన్ని వ్యతిరేకించే వారి వైఖరి అంటే వారు హిందీ మాట్లాడరు మరియు ఎవరినీ హిందీ మాట్లాడనివ్వరు. కానీ మహారాష్ట్రలో అది మా వైఖరి కాదు. మేము హిందీ మాట్లాడుతాము… ప్రాథమిక పాఠశాలల్లో హిందీ కోసం కఠినతను సహించబోమని మా వైఖరి. మా పోరాటం దీనికి మాత్రమే పరిమితం,” అని ఉద్ధవ్ ఠాక్రే ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ‘‘మాకు ఇక్కడ హిందీ సినిమాలు, హిందీ థియేటర్లు, హిందీ మ్యూజిక్ ఉన్నందున మేము ఎవరినీ హిందీలో మాట్లాడకుండా ఆపలేము. మా పోరాటం ప్రాథమిక విద్యలో హిందీ విధించడానికి మాత్రమే వ్యతిరేకం’’ అని ఆయన రౌత్ స్పష్టం చేశారు.