IND vs ENG: బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న రెండవ టెస్టులో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శనతో ఇంగ్లాండ్‌ను 407 పరుగులకే కట్టడి చేశారు. భారత స్టార్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ 6 వికెట్లు తీసి ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ ను దెబ్బతీశాడు. దీంతో భారత్‌కు 180 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 151 ఓవర్లలో 587 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 269 పరుగులతో రాణించగా, జడేజా (89), జైస్వాల్ (87), వాషింగ్టన్ (42) లతో భారీ స్కోరుకు తోడ్పాటు అందించారు.
Read Also:Stock Market: ఎంత మోసం.. దలాల్ స్ట్రీట్ లొసుగులను వాడుకొని కోట్లు కొల్లగొట్టిన అమెరికా సంస్థ..!
ఇక ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే తడబడింది. మొదటి 5 వికెట్లు 84 పరుగులకే కోల్పోయిన అనంతరం, హ్యారీ బ్రూక్ (158), జేమీ స్మిత్ (184) భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. వీరిద్దరూ 300కి పైగా భారీ పార్టనర్షిప్ స్కోరు చేసి ఇంగ్లాండ్‌ను గౌరవప్రదమైన స్థితికి చేర్చారు. అయితే బ్రూక్ ఔటైన తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్, చివరకు 89.3 ఓవర్లలో 407 పరుగులకు ఆలౌట్ అయింది.
Read Also:IND vs ENG: సెంచరీలతో చెలరేగిన బ్రూక్, స్మిత్.. తేలిపోయిన భారత బౌలర్లు..!
భారత బౌలింగ్‌లో సిరాజ్ విజృంభించాడు. అతను 19.3 ఓవర్లలో 70 పరుగులిచ్చి 6 వికెట్లు తీయగా, అకాష్ దీప్ 4 వికెట్లు తీసి సిరాజ్‌కు అద్భుతంగా సహకరించాడు. మిగిలిన బౌలర్లు వికెట్లు తీసేందుకు ఇబ్బంది పడ్డారు. ఇక భారత్ రెండో ఇన్నింగ్స్ లో 200–250 పరుగులు చేస్తే, ఇంగ్లాండ్‌కు 400కి పైగా లక్ష్యంగా ఉండే అవకాశం ఉంది. స్పిన్నర్లకు నాలుగో, ఐదో రోజుల్లో సహాయం దక్కే అవకాశం ఉండటంతో.. భారత్ విజయం వైపు అడుగులు వేయవచ్చు.