24
September, 2026

A News 365Times Venture

24
Thursday
September, 2026

A News 365Times Venture

Amit Shah: “చర్చలు జరిపేదే లేదు.. ఆయుధాలు విడిచి లొంగిపోండి..” మావోలకు అమిత్‌షా ఛాన్స్..

Date:

మావోయిస్టులకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే దాదాపు కీలక నేతలు హతమయ్యారు. వారికి కంచుకోట అయిన ఛత్తీస్‌గఢ్‌లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌తో నెత్తురోడుతోంది. ఈ అంశంపై తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులతో ఎలాంటి చర్చలు జరిపేదే లేదని పునరుద్ఘాటించారు. ఆయుధాలు విడిచి జనజీవన స్రవంతిలో కలిసి పోవాలని సూచించారు. వర్షాకాలంలో కూడా నక్సల్స్​ ఏరివేత కొనసాగుతుందని వెల్లడించారు. మార్చి 2026లోగా నక్సలైట్లను నిర్మూలిస్తామని పునరుద్ఘాటించారు. ఆయుధాలు వదలిన
వారిని హృదయపూర్వకంగా స్వాగతిస్తామని వెల్లడించారు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించిన అమిత్‌ షా ఈ వ్యాఖ్యలు చేశారు.

READ MORE: IND vs ENG: 5 వికెట్లతో మెరిసిన బుమ్రా.. భారత్ కు స్వల్ప ఆధిక్యత..!

“విష్ణు దేవ్ సాయి ప్రభుత్వం దూసుకుపోతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొనియాడారు. నక్సల్స్​ ఏరివేతలో అతిపెద్ద విజయం సాధించామని.. అందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారాన్ని ప్రశంసించారు. నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌ను వేగవంతం చేస్తామని తెలిపారు. తాను గత పదకొండు సంవత్సరాలుగా ఛత్తీస్‌గఢ్‌కు వస్తున్నానని వెల్లడించారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత ప్రధాని మోడీదే అని కొనియాడారు. ఈ వేదిక మీదుగా అమిత్ షా నక్సల్స్‌కి మరో ఛాన్స్ ఇచ్చారు. ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలిసి పోవాలని వెల్లడించారు.

READ MORE: AP Deputy CM Pawan: క్రైస్తవులు, ముస్లింలు వాళ్ళ మతాన్ని గౌరవించుకుంటారు.. కానీ హిందువులు మాత్రం..?

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

2500 മുസ്‌ലിം വോട്ടര്‍മാരുടെ പേര് വെട്ടാന്‍ ബി.ജെ.പി എം.എല്‍.എ തെഞ്ഞെടുപ്പ് കമ്മീഷന് കത്തെഴുതിയതായി കോണ്‍ഗ്രസ്

ബെംഗളൂരു: കര്‍ണാടകയിലെ പ്രമുഖ ബി.ജെ.പി എം.എല്‍.എ അഭയ് പാട്ടീല്‍ വോട്ടര്‍പട്ടികയില്‍ നിന്ന്...

"எதற்கெடுத்தாலும் திமுக எங்கள் மீது குற்றம்சுமத்துகிறது!" – அமைச்சர் ரமேஷ் விமர்சனம்

தமிழக இந்து சமய அறநிலையத்துறை அமைச்சர் ரமேஷ், திருச்சியில் செய்தியாளர்களை சந்தித்து...

Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన

టర్కీ బుద్ధి మారలేదు. డీజిల్ కోసం భారత్‌పై ఆధారపడుతున్న టర్కీ.. మళ్లీ...

ഗ്യാനേഷ് കുമാറിനെ മോദിയും അമിത് ഷായും സംരക്ഷിക്കുന്നു; ജനാധിപത്യം തകരുന്നത് നോക്കി നില്‍ക്കില്ല: രാഹുല്‍ ഗാന്ധി

ന്യൂദല്‍ഹി: മുഖ്യ തെരഞ്ഞെടുപ്പ് കമ്മീഷണര്‍ ഗ്യാനേഷ് കുമാര്‍ അടിയന്തരമായി രാജിവെക്കണമെന്ന് ലോക്‌സഭാ...