27
August, 2026

A News 365Times Venture

27
Thursday
August, 2026

A News 365Times Venture

Rajasthan: భార్య తప్పుడు కట్నం ఆరోపణలు.. అత్తింటి ముందే ‘‘టీ’’ స్టాల్ పెట్టి భర్త నిరసన ..

Date:

Rajasthan: ఈ మధ్య కాలంలో కొందరు మహిళలు భర్తలపై అక్రమ గృహహింస కేసుల పెట్టి వేధిస్తున్నారు. దీంతో పలువురు మగాళ్లు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ కేసు ఇందుకు మంచి ఉదాహరణ. ఇదిలా ఉంటే, రాజస్థాన్‌కి చెందిన కృష్ణ కుమార్ ధాకడ్ కూడా తన భార్య నుంచి ఇలాంటి వేధింపులను ఎదుర్కొంటున్నాడు. తప్పుడు కేసులో విసిగిపోయిన క‌ృష్ణ వినూత్నంగా తన నిరసన తెలుపుతున్నాడు.

ఏకంగా అత్తమామల ఇంటి ముందు టీ స్టాన్ ఏర్పాటు చేసుకుని నిరసన తెలుపుతున్నారు. వచ్చి వెళ్లే వారికి ‘‘టీ’’ ఇచ్చి తన ఆవేదన వెల్లడిస్తున్నాడు. టీ స్టాల్ పేరును కూడా క్రియేటివ్‌గా సెట్ చేశాడు. “498A T CAF” అని టీ స్టాల్‌కి పేరు పెట్టాడు. 498 ఏ వరకట్న వేధింపుల కేసును సూచిస్తుంది. తన చేతికి ‘‘సంకెళ్లు’’ వేసుకుని టీ అందిస్తున్నాడు. తాను మూడేళ్లుగా పడుతున్న బాధ, అవమానానికి ఇది చిహ్నమని చెబుతున్నాడు.

తన టీ స్టాల్ చుట్టూ పోస్టర్లు ఏర్పాటు చేసి, తన బాధను అందులో వ్యక్తపరిచాడు. పోస్టర్లలో “జబ్ తక్ నహీ మిల్తా న్యాయ్, తబ్ తక్ ఉబల్తి రహేగి చాయ్” (నాకు న్యాయం జరిగే వరకు, టీ మరుగుతూనే ఉంటుంది) మరియు “ఆవో చాయ్ పర్ కరేన్ చర్చా, 125 మే కిత్నా దేనా పడేగా ఖర్చా” వంటి నినాదాలు ఉన్నాయి. ఇవి అతడిపై ఉన్న IPC సెక్షన్లు 498A, 125 లను సూచిస్తాయి.

Read Also: Israel-Iran War: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు

ధకాద్ 2018లో మీనాక్షి మాలావ్‌ను వివాహం చేసుకున్నాడు. కలిసి, వారు తేనెటీగల పెంపకం వ్యాపారాన్ని ప్రారంభించారు, స్థానిక మహిళలకు అధికారం కల్పించారు. దీంతో వీరు గుర్తింపు పొందారు. మాజీ మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ 2021లో వీరి తేనె వ్యాపార సంస్థను ప్రారంభించారు. అయితే, 2022లో కృష్ణ భార్య ఎలాంటి సమాచారం లేకుండా తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. కృష్ణపై IPC సెక్షన్ 498A (కట్నం వేధింపులు), సెక్షన్ 125 (భరణం) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది.

“ఒక తప్పుడు కేసు కారణంగా అంతా నాశనమైంది. గత మూడు సంవత్సరాలుగా, నేను న్యాయం కోసం కోర్టుకు తిరుగుతున్నాను. నాకు నాపై ఆధారపడిన వృద్ధ తల్లి ఉంది. నేను టిన్ షెడ్ కింద నివసిస్తున్నాను, నాకు ఏమీ మిగిలి లేదు. చాలాసార్లు నా జీవితాన్ని ముగించాలని అనుకున్నాను, కానీ నా తల్లికి ఏకైక మద్దతు నేనే అని నాకు గుర్తుకు వస్తుంది’’ అని తన బాధను చెబుతున్నాడు. నాపై తప్పుడు కేసు పెట్టిన ప్రాంతంలోనే టీ అమ్ముతున్నానని, ఈ న్యాయ పోరాటంలో నిష్పాక్షికంగా పోరాడాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.

అయితే, కృష్ణ భార్య మీనాక్షీ మలావ్ మాట్లాడుతూ.. ‘‘అతను భూమి కొనేందుకు నా తండ్రిని డబ్బులు అడిగాడు. మేము నిరాకరించినప్పుడు నన్ను కొట్టాడు. ఆ తర్వాత నేను నా తల్లిదండ్రుల ఇంటికి వచ్చాను. నేను విడాకులకు సిద్ధంగా ఉన్నాను. కానీ ముందుగా నా పేరు మీద తీసుకున్న అప్పులు అన్ని తిరిగి చెల్లించాలి’’ అని చెప్పింది. ఇప్పుడు వీరిద్దరి కథ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

നേപ്പാള്‍ പ്രളയം: കേരളത്തില്‍ നിന്നുള്ളവര്‍ക്കായി ഹെല്‍പ്‌ഡെസ്‌ക് തുടങ്ങി

തിരുവനന്തപുരം: നേപ്പാളിലുണ്ടായ മിന്നല്‍ പ്രളയവുമായി ബന്ധപ്പെട്ട് കേരളീയര്‍ക്ക് അടിയന്തിര സഹായവും സേവനങ്ങളും...

"சட்டமன்றத்தில் லாவணி கச்சேரி நடந்துக்கொண்டிருக்கிறது" – தவெக, திமுக-வை தாக்கும் பெ.சண்முகம்

மார்க்ஸிஸ்ட் கம்யூனிஸ்ட் மாநிலச் செயலாளர் பெ.சண்முகம் செய்தியாளர்களைச் சந்தித்து பேசியிருக்கிறார். அப்போது,...

Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్‌లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!

కర్ణాటకలో ఓ న్యాయమూర్తికి షాకింగ్ ఘటన ఎదురైంది. ఆస్పత్రిలోని ఓ గదిలో...

ಮೈಸೂರು ದಸರಾ 2026: ಗಜಪಯಣಕ್ಕೆ ಅದ್ದೂರಿ ಚಾಲನೆ

ಮೈಸೂರು,ಆಗಸ್ಟ್, 26,2026 (www.justkannada.in): ವಿಶ್ವವಿಖ್ಯಾತ ಮೈಸೂರು ದಸರಾ ಮಹೋತ್ಸವದ ಪೂರ್ವಭಾವಿ...