Jagdeep Dhankhar: భారత్ పాకిస్తాన్‌పై నిర్వహించిన ‘‘ఆపరేషన్ సిందూర్’’ని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ ప్రశంసించారు. పాకిస్తాన్ లోకి దూరి అమెరికన్ దళాలు అల్ ఖైదా చీఫ్ ‘‘ ఒసామా బిన్ లాడెన్’’ని చంపిన ఆపరేషన్‌తో పోల్చారు. పాకిస్తాన్‌లోని 9 ఉగ్రస్థావరాలపై భారత్ చేసిన దాడిని ‘‘ఎప్పుడు జరగని లోతైన సరిహద్దు దాడి’’గా అభివర్ణించారు. ఈ దాడిలో 100 మందికి పైగా ఉగ్రవాదుల్ని భారత్ హతమార్చింది. దీనిని సెప్టెంబర్ 11, 2021లో జరిగిన అమెరికా దాడితో పోల్చారు.
Read Also: India Armenia: ఆర్మేనియాకు భారత “ఆకాష్ మిస్సైల్స్” .. టర్కీ, అజర్‌బైజాన్‌కి మూడింది..
ఒసామా బిన్ లాడెన్ పేరు నేరుగా చెప్పకుండా, మే 2, 2011న, అమెరికాలో సెప్టెంబర్ 11 దాడులకు ప్లాన్ చేసిన ప్రపంచ ఉగ్రవాదిపై అమెరికా దళాలు ఇదే విధంగా వ్యవహరించాయని ఆయన అన్నారు. ‘‘భారత్ దీన్ని చేసింది. ప్రపంచానికి తెలియకుండానే దీన్ని చేసింది’’ అని జగదీప్ ధన్‌కర్ అన్నారు. శాంతి స్పూర్తిని కొనసాగిస్తూనే, ఉగ్రవాదంపై దాడి చేయడమే లక్ష్యంగా కొత్త విధానం నిర్ణయించబడిందని చెప్పారు. మొదటిసారిగా జైషే మహ్మద్, లష్కరే తోయిబా స్థావరాలపై బలమైన దాడులు జరిగాయని అన్నారు. దాడులు అత్యంత ఖచ్చితమైన దాడులని, ఉగ్రవాదులకు మాత్రమే హాని జరిగిందని అన్నారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీహార్ నుండి ప్రపంచ సమాజానికి సందేశం ఇచ్చారని ధంఖర్ అన్నారు. “అవి ఖాళీ మాటలు కావని ప్రపంచం ఇప్పుడు గ్రహించింది” అని ఆయన చెప్పారు.