23
September, 2026

A News 365Times Venture

23
Wednesday
September, 2026

A News 365Times Venture

CM Revanth Reddy : క్యాన్స‌ర్ బాధిత కుటుంబానికి అండ‌గా సీఎం రేవంత్ రెడ్డి

Date:

CM Revanth Reddy : క్యాన్స‌ర్ బారిన ప‌డిన వ్య‌క్తి చికిత్స‌కు అవ‌స‌ర‌మైన ఆర్థిక స‌హాయం అందించి బాధిత‌ కుటుంబానికి ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అండ‌గా నిలిచారు. సిద్దిపేటకు చెందిన సిరిసిల్ల సాయిచ‌ర‌ణ్ (35) అక్యుర్డ్ మైలాయిడ్ లుకేమియా (బ్ల‌డ్ క్యాన్స‌ర్‌) బారిన ప‌డ్డారు. ఆయ‌న‌కు భార్య లక్ష్మిప్ర‌స‌న్న‌, కుమార్తెలు ల‌క్ష్మి సుస‌జ్ఞ (6), స్మ‌య (2 నెల‌లు), త‌ల్లిదండ్రులు రాము, సునీత ఉన్నారు. ఇంటికి ఆధార‌మైన సాయిచ‌ర‌ణ్ క్యాన్స‌ర్ బారిన‌ప‌డ‌డంతో అత‌ని చికిత్సకు కుటుంబ స‌భ్యులు సిద్దిపేట మండ‌లం ఎన్సాన్‌ప‌ల్లిలోని త‌మ ఇంటిని విక్రయించారు. అయిన‌ప్ప‌టికీ చికిత్స‌కు అవ‌స‌ర‌మైనంత డ‌బ్బులు స‌రిపోక‌పోవ‌డంతో వారు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డిని గ‌తంలో క‌లిసి త‌మ ఇబ్బందుల‌ను ఆయ‌న దృష్టికి తీసుకువ‌చ్చారు. చ‌లించిన ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి సాయిచ‌ర‌ణ్ చికిత్స‌కు రూ.5 ల‌క్ష‌లు మంజూరు చేశారు.

Congress : కాంగ్రెస్ లో మహిళలకు అన్యాయం.. గాంధీ భవన్ ఎదుట మహిళా నేతల ఆందోళన

దాంతో హైద‌రాబాద్ బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ ఆసుప‌త్రిలో సాయిచ‌ర‌ణ్‌కు స్టెమ్‌సెల్ ట్రాన్స్‌ప్లాంటేష‌న్ పూర్త‌యింది. చికిత్స‌కు అద‌నంగా వ్య‌య‌మైన మ‌రో రూ.7 ల‌క్ష‌ల‌ను సీఎంఆర్ఎఫ్ ద్వారా అందించాల‌ని ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆదేశించ‌డంతో ఆ మొత్తాన్ని అధికారులు అంద‌జేశారు. చికిత్స చేయించుకున్న సాయిచ‌ర‌ణ్ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి బుధ‌వారం సాయంత్రం రాష్ట్ర స‌చివాల‌యానికి వ‌చ్చి ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డిని క‌లిసి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ధైర్యంగా ఉండాల‌ని సీఎం సాయిచ‌ర‌ణ్‌కు సూచించారు.

IPL 2025: ఢిల్లీకి ఆస్ట్రేలియా స్ట్రోక్.. తప్పుకున్న స్టార్ ఆటగాడు

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

"கம்யூனிஸ்ட்களின் வரலாற்றை ஆதவ் அர்ஜுனா படித்து முதல்வருக்கும் சொல்ல வேண்டும்" – வீரபாண்டியன் பதிலடி

"கம்யூனிஸ்ட் வரலாற்றை ஆதவ் அர்ஜுனா படித்து முதல்வருக்கும் சொல்ல வேண்டும்" என்று...

Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!

Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్ల...

മാധ്യമ ബഹിഷ്‌കരണത്തിന് പിന്നാലെ ട്രംപ് ടി.വി; വൈറ്റ് ഹൗസില്‍ നിന്ന് 24 മണിക്കൂര്‍ യൂട്യൂബ് ചാനല്‍

വാഷിങ്ടണ്‍: പ്രമുഖ അമേരിക്കന്‍ മാധ്യമസ്ഥാപനങ്ങള്‍ പ്രസിഡന്റ് ഡൊണാള്‍ഡ് ട്രംപിന്റെ പരിപാടികളുടെ ടെലിവിഷന്‍...

மதுரை பள்ளி மாணவன் உயிரிழப்பு விவகாரம்: 16 நாள்களுக்குப் பிறகு உடலைப் பெற்றுக்கொண்ட உறவினர்கள்!

மதுரை ஆனையூர் கூடல்புதூர் வானவில் தெரு பகுதியைச் சேர்ந்தவர் 11-ம் வகுப்பு...