30
May, 2026

A News 365Times Venture

30
Saturday
May, 2026

A News 365Times Venture

Vinay Narwal: ముస్లింలపై నేవీ ఆఫీసర్ భార్య హిమాన్షి కీలక వ్యాఖ్యలు

Date:

పహల్గామ్ ఉగ్రదాడిలో భర్తను కోల్పోయిన నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ భార్య హిమాన్షి కీలక వ్యాఖ్యలు చేశారు. వినయ్ నర్వాల్ గౌరవార్థం నేషనల్ ఇంటిగ్రేటెడ్ ఫోరమ్ ఆఫ్ ఆర్టిస్ట్స్ అండ్ యాక్టివిస్ట్స్ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమానికి హిమాన్షి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ముస్లింలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ముస్లింల పట్ల ఎలాంటి ద్వేషం లేదని ఆమె పేర్కొన్నారు. తనకు కాశ్మీరీల పట్ల గానీ.. ముస్లింల పట్ల గానీ ఎలాంటి ద్వేషం లేదని.. తాము శాంతిని మాత్రమే కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. మత ఘర్షణలకు ముగింపు పలకాలని విజ్ఞప్తి చేస్తూ.. న్యాయం కోసం గట్టిగా డిమాండ్ చేశారు. ప్రస్తుతం దేశ ప్రజలంతా కోపంగా ఉన్నారని.. అయినా కూడా కాశ్మీరీలకు.. ముస్లింలకు వ్యతిరేకంగా ప్రజలు వెళ్లాలని తాను కోరుకోవడం లేదని.. కేవలం శాంతిని మాత్రమే కోరుకుంటున్నట్లు ఆమె స్పష్టం చేశారు. తన భర్త వినయ్ నర్వాల్ కూడా ఇదే కోరుకుంటారని ఆమె వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: Pahalgam Terror Attack: భారత్‌లోనే పహల్గామ్ ఉగ్రవాదులు! ఎక్కడున్నారంటే..! ఎన్ఐఏ అంచనా ఇదే!

గురుగ్రామ్‌కు చెందిన హిమాన్షి పీహెచ్‌డీ స్కాలర్. ఏప్రిల్ 16న నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్‌ను వివాహం చేసుకుంది. అనంతరం ఏప్రిల్ 19న గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. అటు తర్వాత హనీమూన్ కోసమని విదేశాలకు వెళ్లాలని అనుకున్నారు. కానీ ప్లాన్ కుదరకపోవడంతో పహల్గామ్ టూర్ ప్లాన్ చేసుకున్నారు. ఏప్రిల్ 22న భర్తతో కలిసి సరాదాగా గడుపుతున్న సమయంలో ఒక్కసారి ముష్కరులు తుపాకులతో విరుచుకుపడ్డారు. అంతే ఒక్కసారిగా తూటాలకు వినయ్ నర్వాల్ నేలకొరిగారు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. భర్త మృతదేహం దగ్గరే హిమాన్షి కుప్పకూలిపోయింది. తీవ్రంగా కన్నీటి పర్యాంతం అయింది. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీని మరోసారి హడలెత్తించిన భారీ వర్షం.. దుమ్ము తుఫాన్.. ఫ్లైట్స్‌కు అంతరాయం

ఇక వినయ్ నర్వాల్‌కు హర్యానాలో సైనిక లాంఛనలతో అంత్యక్రియలు జరిగాయి. ముఖ్యమంత్రి సైనీతో పాటు కేంద్రమంత్రి ఖట్టర్, పలువురు నేతలు కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఇక ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ముఖ్యమంత్రి రేఖా గుప్తా నివాళులర్పించారు. అనంతరం హిమాన్షిని ఓదార్చారు. ఇక భర్త శవపేటికను కౌగిలించుకుని హిమాన్షి సెల్యూట్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

 


Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ನಾನು ಸಚಿವ ಸ್ಥಾನದ ಆಕಾಂಕ್ಷಿಯಲ್ಲ: ಡಿಕೆಶಿ ಪದಗ್ರಹಣಕ್ಕೆ ಹೋಗಲು ತಯಾರಿ- ಶಾಸಕ ಸಿ.ಪಿಯೋಗೇಶ್ವರ್

ರಾಮನಗರ,ಮೇ,30,2026 (www.justkannada.in):  ರಾಜ್ಯದ ಮುಖ್ಯಮಂತ್ರಿಯಾಗಿ ಡಿಕೆ ಶಿವಕುಮಾರ್  ಅಧಿಕಾರ ವಹಿಸಿಕೊಳ್ಳುವ...

മറ്റുള്ളവരുടെ ബ്രാന്‍ഡ് മൂല്യം വിറ്റ് കാശാക്കാന്‍ ഗൂഗിളിന് അവകാശമില്ല; ഹിന്‍ഡ് വെയര്‍ കേസില്‍ 30 ലക്ഷം രൂപ പിഴയിട്ട് ദല്‍ഹി ഹൈക്കോടതി

ന്യൂദല്‍ഹി: ബ്രാന്‍ഡ് നെയിമുകള്‍ പരസ്യ കീവേഡായി ലേലം വിളിക്കുന്നതിനെതിരെ ഗൂഗിളിന് പിഴ...

'சீருடையும், ஐ.டியும் போதும்' புதிய பஸ் பாஸ் வரும் வரை அரசு பள்ளி, கல்லூரி மாணவர்களுக்கு சலுகை!

'புதிய பயண அட்டை' வழங்கப்படுவதற்கு முன்பு, அரசு பள்ளி மற்றும் கல்லூரி...

Mosquito Repellent Study: షాకింగ్.. స్ప్రే వాసనకు పారిపోవడం కాదు.. ఆకర్షితమవుతున్న దోమలు..!

Mosquito Repellent Study: వేసవి కాలం వచ్చిందంటే దోమల బెడద కూడా...