26
May, 2026

A News 365Times Venture

26
Tuesday
May, 2026

A News 365Times Venture

CSK vs MI: ముంబై ఇండియన్స్‌కు హ్యాట్రిక్‌ విజయం.. చెన్నైపై 9 వికెట్ల తేడాతో గెలుపు

Date:

CSK vs MI: ఐపీఎల్‌ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ తమ హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదుచేసింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో ముంబై 15.4 ఓవర్లలోనే కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి గెలుపొందింది. ముంబై విజయానికి రోహిత్‌ శర్మ (76 నాటౌట్), సూర్యకుమార్‌ యాదవ్‌ (68 నాటౌట్) అర్ధశతకాలతో అద్భుత ప్రదర్శన చేశారు. వీరి ధాటికి 177 పరుగుల లక్ష్యం అతి సులభంగా చేరువైంది. ఈ విజయంతో ముంబైకి ఇది టోర్నమెంట్‌లో నాలుగో విజయం కాగా, చెన్నైకు ఇది ఆరో పరాజయం కావడం గమనార్హం.

MLA Kamineni Srinivas : కొల్లేరు సరస్సు శాశ్వత పరిష్కారానికి తొలి అడుగు పడింది..

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై జట్టు ప్రారంభంలో తడబడింది. నాలుగో ఓవర్‌లో రచిన్‌ రవీంద్ర (5) తొందరగా వెనుదిరగగా, గాయంతో దూరమైన రుతురాజ్‌ స్థానంలో బరిలోకి దిగిన 17 ఏళ్ల ఆయూష్‌ మాత్రే (32) తన దూకుడుతో ఆకట్టుకున్నాడు. అయితే అతను ఏడో ఓవర్‌లో ఔటయ్యాడు. శివమ్‌ దూబే (50: 30 బంతుల్లో) – జడేజా (53 నాటౌట్) కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ కలిసి బుమ్రా వేసిన ఓవర్లో భారీ షాట్లు బాదారు. చివర్లో ధోనీ (4) కూడా బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు. చెన్నైకు నిలకడనిచ్చిన జడేజా చివరి ఓవర్లో అర్ధశతకం సాధించాడు. బౌలింగ్‌ వైపు ముంబై తరఫున బుమ్రా రెండు వికెట్లు పడగొట్టగా, చాహర్‌, అశ్వనీ కుమార్‌, శాంట్నర్‌ చెరో వికెట్ తీశారు.

MLC Kavitha : విప్లవాల జిల్లా ఖమ్మంలో కామ్రేడ్స్ మౌనం వహిస్తున్నారు

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

30 ദിവസം പരോള്‍; ഗുര്‍മീത് വീണ്ടും പുറത്ത്: 6 വര്‍ഷത്തിനിടെ 16-ാം തവണ

രോഹ്തക്: ബലാത്സംഗക്കേസില്‍ ശിക്ഷിക്കപ്പെട്ട് രോഹ്തക്കിലെ സുനാരിയ ജയിലില്‍ കഴിയുന്ന സ്വയം പ്രഖ്യാപിത...

"பயிர்க்கடன் தள்ளுபடி என்ற பெயரில் SCAM; ஏமாற்றங்களுக்கு தயாரா இருக்கணுமா CM saar?" – உதயநிதி கேள்வி

கூட்டுறவு வங்கிகளின் மூலம் ரூ.50,000/- வரை பயிர்க்கடன் பெற்ற குறு விவசாயிகளுக்கு...

AMAs 2026: అమెరికన్ మ్యూజిక్ అవార్డ్స్‌లో దుమ్మురేపిన BTS.. మూడు అవార్డులతో సెన్సేషన్..!

AMAs 2026 BTS: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను ఉన్న కే-పాప్ సూపర్...

ಸಿಎಂ ,ಡಿಸಿಎಂ ಜೊತೆ ಹೈಕಮಾಂಡ್ ನಾಯಕರ ಮೀಟಿಂಗ್ ಆರಂಭ

ನವದೆಹಲಿ,ಮೇ,26,2026 (www.justkannada.in):  ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಮತ್ತು ಡಿಸಿಎಂ ಡಿಕೆ ಶಿವಕುಮಾರ್...