13
June, 2026

A News 365Times Venture

13
Saturday
June, 2026

A News 365Times Venture

Nikhila Vimal: టాలీవుడ్ బై చెప్తే మాలీవుడ్ గుండెల్లో పెట్టేసుకుంది!

Date:

కేరళ హీరోయిన్లకు తెలుగులో ఉండే క్రేజే వేరు. అందుకే అక్కడ ఒకటి రెండు చిత్రాలతో క్లిక్ కాగానే.. టాలీవుడ్‌లోకి పట్టుకొచ్చేస్తుంటారు దర్శక నిర్మాతలు. అలా వచ్చిన మరో మళయాళీ సోయగం నిఖిలా విమల్. అల్లరి నరేష్ మేడమీద అబ్బాయితో టాలీవుడ్ తెరంగేట్రమిచ్చిన నిక్కీ.. మోహన్ బాబు గాయత్రిలోనూ నటించింది. ఈ రెండు ఆమెకు క్రేజ్ తెచ్చిపెట్టలేదు సరికదా.. ఆఫర్లను అందించలేకపోయాయి. టాలీవుడ్ ఆదరించకపోయే సరికి సొంత గూటికి చేరిపోయింది నిఖిలా విమల్. పరుగెత్తి పాలు తాగడం ఎందుకు.. నిల్చుని నీళ్లు తాగుదాం అని డిసైడయ్యి మాలీవుడ్ పై ఫోకస్ చేసింది. మల్లూవుడ్ ‌ వరుస ఆఫర్లతో.. బ్యాక్ టు బ్యాక్ హిట్లతో స్టార్ డమ్ తెచ్చుకుంది. అటు తమిళంలోనూ మంచి ఆఫర్లు కొల్లగొడుతూ సక్సెస్ అందుకుంది. ఈ అమ్మడు నటిస్తే.. సినిమా హిట్టే అనే టాక్ ఉంది. ద ప్రీస్ట్, తంబి, జో అండ్ జో, పోర్ తొజిల్, గురువాయిర్ అంబలనడయిల్, నునాకుజి, వాజై చిత్రాలే బెస్ట్ ఎగ్జాంపుల్స్.

Bollywood Heroines: వరుసగా మదర్ హుడ్ లోకి అడుగు పెడుతున్న బాలీవుడ్ హీరోయిన్లు

బ్యాక్ టు బ్యాక్ హిట్స్ నిఖిలా విమల్‌ను మాలీవుడ్‌, కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా మార్చేశాయి. దీంతో ఛాన్సులు కూడా వెల్లువలా వచ్చిపడుతున్నాయి. కానీ సెలక్టివ్‌గా సినిమాలు చేస్తూ సక్సెస్ రేష్యోను కాపాడుకునేందుకు ట్రై చేస్తోంది ఈ బ్యూటీ. ప్రజెంట్ మేడమ్ చేతిలో పలు ప్రాజెక్టులున్నాయి. పెన్ను కేస్, నివిన్ పాలీ తారం చిత్రాల్లో నటిస్తోంది. అలాగే ఆర్యతో బైలింగ్వల్ మూవీతో పాటు అనాలి అనే వెబ్ సిరీస్‌లోనూ యాక్ట్ చేస్తోంది నిక్కీ. ఇలా తమిళ, మలయాళంలో బిజీగా ఉన్న బ్యూటీ మళ్లీ టాలీవుడ్ ప్రేక్షకులను ఎప్పుడు పలకరిస్తుందో..? వేచి చూడాలి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

അഭിഭാഷകന്റെ പരാതി; യൂട്യൂബര്‍ തൊപ്പിക്കും സംഘത്തിനുമെതിരെ അന്വേഷണത്തിന് ഉത്തരവിട്ട് ഡി.ജി.പി

കൊച്ചി: യൂട്യൂബര്‍ തൊപ്പി എന്ന നിഹാദിനും സംഘത്തിനുമെതിരെ താന്‍ നല്‍കിയ പരാതിയില്‍...

தர்மஸ்தலா கோயில் விவகாரம்: `இரண்டு நாள்களில் நானே நேரில் சொல்கிறேன்' – நடிகர் பிரகாஷ் ராஜ் விளக்கம்!

கர்நாடகா தட்சிண கன்னடா மாவட்டத்தில் உள்ளது தர்மஸ்தலா மஞ்சுநாத சுவாமி கோயில்....

Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్‌గా మారిన తండ్రి

టూర్‌కు వెళ్దాం అంటే ఆ పిల్లలు సంతోషంతో తండ్రి వెంట వెళ్లారు....

ಬಿಡದಿ ಟೌನ್​ ಶಿಪ್​​​ ಗೆ​ ಅಂತಿಮ ಅಧಿಸೂಚನೆ ಪ್ರಕಟಿಸಿದ ಸರ್ಕಾರ

ಬೆಂಗಳೂರು, ಜೂನ್, 12,2026 (www.justkannada.in): ರಾಜ್ಯ ಸರ್ಕಾರವು  ಬಿಡದಿ ಟೌನ್...