21
September, 2026

A News 365Times Venture

21
Monday
September, 2026

A News 365Times Venture

CM Revanth Reddy: “తెలంగాణ రైజింగ్‌ను ఎవరూ ఆపలేరు”.. HCL టెక్ క్యాంపస్ ప్రారంభించిన సీఎం..

Date:

హైదరాబాద్ లో హెచ్ సీఎల్ కేఆర్ సీ క్యాంపస్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతిరోజూ తాము బహుళజాతి సంస్థలతో కొత్త అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడమో.. పెద్ద సంస్థలు తెలంగాణకు రావడమో.. గత సంవత్సరం సంతకం చేసిన ఎంఓయూల కొత్త సౌకర్యాలను ప్రారంభించడమో జరుగుతోందని తెలిపారు. గురువారం HCL టెక్ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. కేవలం ఏడాది కాలంలోనే తెలంగాణకు దేశవిదేశాల నుంచి అత్యధిక పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. ఉద్యోగ కల్పనలో నెంబర్ వన్ గా నిలిచామని తెలిపారు. మన దగ్గర అత్యధిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అత్యల్ప ద్రవ్యోల్బణం ఉన్నాయని సీఎం వెల్లడించారు. తెలంగాణను వన్ ట్రిలియన్ డాలర్ల జీడీపీ రాష్ట్రంగా మారుస్తానని, తాను ముందు చెప్పినప్పుడు… అది సాధ్యం కాదని కొందరు అన్నారన్నారు. రెండుసార్లు దావోస్ పర్యటనల్లో రూ.41,000 కోట్లు, రూ.1.78 లక్షల కోట్ల ఎంవోయూలపై సంతకాలు చేసుకున్న తరువాత ఇప్పుడు అది సాధ్యమని నమ్ముతున్నారని తెలిపారు.

READ MORE: Posani KrishnaMurali Arrest: పోసాని అరెస్టును ఖండించిన వైఎస్ జగన్!

తెలంగాణ రైజింగ్‌ను ఎవరూ ఆపలేరని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. “మా పోటీ ముంబై, ఢిల్లీ, బెంగళూరు లేదా చెన్నైతో కాదని నేను చెప్పినప్పుడు… కొంతమంది అది పెద్ద కలనే అవుతుందన్నారు. మనం ఈవీ అడాప్షన్ లో హైదరాబాద్ ను నంబర్ వన్ గా చేశాక… రాష్ట్రాన్ని డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, స్కిల్స్, మ్యానుఫ్యాక్చరింగ్, అగ్రి ప్రాసెసింగ్ కు హబ్ గా మారుస్తున్నాం.. ఇప్పుడు హైదరాబాద్ రైజింగ్ ఆగదు అని ప్రజలు అంటున్నారు. నేను మొదట హైదరాబాద్ రైజింగ్ అని చెప్పినప్పుడు కొందరికి అనుమానం వచ్చింది. ఇప్పుడు ప్రపంచం మొత్తం అంగీకరిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద లైఫ్ సైన్సెస్ కంపెనీల్లో ఒకటైన ఆమ్జెన్ ను కొద్దిరోజుల క్రితం ప్రారంభించుకున్నాం. మేం ప్రపంచంలోని అత్యుత్తమ సమావేశాలలో ఒకటైన బయో ఏషియాను నిర్వహించాం.. ఇవాళ హెచ్ సీ ఎల్ లో ఉన్నాం. గ్లోబల్ కంపెనీగా హెచ్ సీ ఎల్ టెక్ భారతదేశానికి గర్వకారణంగా నిలిచింది. ఇది 60 దేశాలలో ఆపరేట్ చేస్తోంది మరియు 2.2 లక్షల మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉంది. డిజిటల్, ఇంజినీరింగ్, క్లౌడ్, ఏఐ రంగాల్లో వరల్డ్ క్లాస్ ఆఫరింగ్స్ క్రియేట్ చేస్తున్నారు. 2007లో హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి అంచెలంచెలుగా HCL పెద్ద స్థాయికి ఎదిగింది. ఇవాళ 3.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దాదాపు 5 వేల మందితో కేఆర్ సీలో ప్రపంచస్థాయి సదుపాయంతో హెచ్ సీఎల్ టెక్ హైదరాబాద్ లో గొప్ప పనులు చేస్తుంది.” అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

READ MORE: Pune Rape Case: నిందితుడి ఫొటో విడుదల.. ఆచూకీ చెబితే రివార్డు!

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

പാര്‍ട്ടിയുടെ പേര് റീല്‍സ് വെട്രി കഴകം എന്നാക്കണം; വിജയ് ഇപ്പോള്‍ ജനങ്ങള്‍ക്ക് മുന്നിലാണ് അഭിനയിക്കുന്നത്: എം.കെ സ്റ്റാലിന്‍

ചെന്നൈ: തമിഴ്‌നാട് മുഖ്യമന്ത്രി വിജയ്‌ക്കെതിരെ രൂക്ഷ വിമര്‍ശനവുമായി ഡി.എം.കെ നേതാവ് എം.കെ...

Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!

హైదరాబాద్‌లోని మూసాపేట ఆంజనేయ నగర్‌లో ఆదివారం ఉదయం తీవ్ర ఉత్కంఠ రేపిన...

യു.പിയില്‍ ബി.ജെ.പി ഭരണത്തില്‍ തകര്‍ത്തത് 151 അബേദ്ക്കര്‍ പ്രതിമകള്‍: അഖിലേഷ് യാദവ്

ലഖ്‌നൗ: ബി.ജെ.പി ഭരണകാലത്ത് ഉത്തര്‍പ്രദേശില്‍ ഡോ. ബി.ആര്‍ അംബേദ്‌റുടെ 151 പ്രതിമകള്‍...