24
June, 2026

A News 365Times Venture

24
Wednesday
June, 2026

A News 365Times Venture

Karnataka: విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య

Date:

కర్ణాటకలోని మైసూరులో ఘోర విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధ తట్టుకోలేక ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. నలుగురు ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. మృతులు మైసూర్‌కు చెందిన చేతన్ (45), భార్య రూపాలి (43), కుమారుడు కుషన్ (15), తల్లి ప్రియంవద (65) గా గుర్తించారు. భార్య, కుమారుడు, తల్లికి విషమిచ్చి చంపిన తర్వాత చేతన్ ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. వీళ్లంతా విశ్వేశ్వరయ్య నగర్‌లో నివాసం ఉంటున్నారు. ఆత్మహత్యకు ముందు అమెరికాలో ఉంటున్న సోదరుడికి ఫోన్ చేసి అప్పుల బాధతో చనిపోతున్నట్లుగా కాల్ చేసి కట్ చేశాడు. అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఇది కూడా చదవండి: Amardeep Kumar: రూ.1700 కోట్లతో దుబాయ్కి పారిపోయిన ఫాల్కన్ చైర్మన్

మైసూరు నగర పోలీసు కమిషనర్ సీమా లట్కర్, డీసీపీ ఎస్ జాహ్నవితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ కుటుంబం రెండు ఫ్లాట్లలో ఉంటున్నారని తెలిపారు. నలుగురు రెండు ఫ్లాట్‌లో శవాలుగా ఉన్నట్లు పేర్కొన్నారు. చేతన్ దగ్గర నుంచి సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

మెకానికల్ ఇంజనీర్ చేతన్ పశ్చిమాసియాలో పనిచేసి 2019లో భారతదేశానికి తిరిగి వచ్చాడని పోలీసులు తెలిపారు. ఆదివారం గోరూర్‌లోని ఒక ఆలయాన్ని సందర్శించి తిరిగి వస్తుండగా.. మైసూరులోని భార్య రూపాలి ఇంటికి వెళ్లారు. ఇంటికి తిరిగి వచ్చే ముందు భోజనం చేశారని పోలీసు అధికారి తెలిపారు. విద్యారణ్యపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గత పదేళ్లుగా అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లు ఎప్పుడూ కనిపించలేదని స్థానికులు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: MLC Srinivas Reddy: కోడి పందేలుకు తనకు ఎలాంటి సంబంధం లేదన్న ఎమ్మెల్సీ

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Telangana Govt: పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు.. టీచర్ల సర్దుబాటుపై కలెక్టర్లకు పూర్తి అధికారం!

Telangana Govt: తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధనకు ఎలాంటి ఆటంకం కలగకుండా...

ಸಂಪುಟ ವಿಸ್ತರಣೆ ಕುರಿತು HDK ಹೇಳಿಕೆ ಖಂಡನೀಯ- ಎಚ್.ಎ. ವೆಂಕಟೇಶ್

ಮೈಸೂರು,ಜೂನ್,23,2026 (www.justkannada.in): ರಾಜ್ಯ ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್ಕಾರದ ಸಚಿವ ಸಂಪುಟ ವಿಸ್ತರಣೆ...

അമേരിക്ക-ഇറാന്‍ ചര്‍ച്ചകളില്‍ ഇസ്രഈല്‍ ഭാഗമല്ല; ഹിസ്ബുല്ലയെ പൂര്‍ണമായും തകര്‍ക്കുന്നത് വരെ ആക്രമണമെന്ന് ഇസ്രഈല്‍

  ടെല്‍ അവീവ്: അമേരിക്കയും ഇറാനും തമ്മില്‍ നടത്തുന്ന നയതന്ത്ര ചര്‍ച്ചകളില്‍...

`தமிழ்நாட்டை விட்டு வெளியே சென்ற முதலீடுகள்' பட்டியலிட்ட கீர்த்தனா; ஏன் சென்றன? – TRB ராஜா விளக்கம்

தமிழ்நாடு சட்டமன்றக் கூட்டத்தொடருக்குப் பின், தமிழ்நாடு தொழிற்துறை அமைச்சர் கீர்த்தனா பத்திரிகையாளர்களிடம்...