14
March, 2026

A News 365Times Venture

14
Saturday
March, 2026

A News 365Times Venture

Delhi New CM: ఢిల్లీ సీఎం ఎంపికకు ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..!

Date:

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 27 ఏళ్ల తర్వాత కాషాయ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది. అయితే ఫలితాలు వచ్చి 6 రోజులు అవుతున్నా.. ఇప్పటిదాకా ముఖ్యమంత్రి ఎంపిక జరగలేదు. దీంతో ముఖ్యమంత్రి ఎవరవుతారన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. అయితే ప్రధాని మోడీ ప్రస్తుతం భారత్‌లో లేరు. రెండు దేశాల పర్యటన కోసం సోమవారం ఫ్రాన్స్, అమెరికా పర్యటనకు వెళ్లారు. దీంతో ఢిల్లీ సీఎం ఎంపిక వాయిదా పడింది. ప్రస్తుతం మోడీ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన ముగించుకుని ఈ వారమే ఢిల్లీ చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం (ఫిబ్రవరి 16) బీజేపీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహిస్తోంది. దీని కోసం ఇద్దరు బీజేపీ సీనియర్ నాయకులను పంపించనుంది. ఈ సమావేశంలో తదుపరి ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరనేది తేల్చనున్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి పోస్టుతో పాటు రెండు డిప్యూటీ సీఎం పోస్టులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Rangareddy: రంగారెడ్డి జిల్లా కోర్టులో ఉద్రిక్తత.. న్యాయమూర్తిపై చెప్పు విసిరిన ముద్దాయి!

ఇక ముఖ్యమంత్రిగా మహిళలకు ఛాన్స్ ఇవ్వొచ్చన్న వార్తలు కూడా వినిపిస్తు్న్నాయి. అంతేకాకుండా అందులో దళితులకు అవకాశం ఉండొచ్చన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇక కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేష్ వర్మ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారాన్ని దక్కించుకుంది. ఈ నేపథ్యంలో సీఎం ఎంపికపై బీజేపీ హైకమాండ్ తీవ్ర కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బీజేపీ 48, ఆప్ 22 స్థానాలు గెలుచుకుంది. ఇక కేజ్రీవాల్, మనీష్ సిసోడియా లాంటి రాజకీయ ఉద్దండులంతా ఓడిపోయారు. అతిషి మాత్రం కల్కాజీ నియోజకవర్గం నుంచి అతి కష్టం మీద గట్టెక్కింది.

ఇది కూడా చదవండి: Kannappa: ‘కన్నప్ప’ కి ప్రభాస్ పారితోషికం తీసుకోవడం లేదా..!

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಕೃಷ್ಣ ಮೇಲ್ದಂಡೆ ಯೋಜನೆ: ಸರ್ವಪಕ್ಷ ಸಭೆ ಕರೆದಿದ್ದೇವೆ- ಡಿಸಿಎಂ ಡಿಕೆ ಶಿವಕುಮಾರ್

ಬಾಗಲಕೋಟೆ,ಮಾರ್ಚ್,14,2026 (www.justkannada.in) : ಕೃಷ್ಣ ಮೇಲ್ದಂಡೆ ಯೋಜನೆ ಸಂಬಂಧ ನವದೆಹಲಿಯಲ್ಲಿ...

കരുതലിന്റെ കാതല്‍; വയനാട് ടൗണ്‍ഷിപ്പിലെ താമസക്കാര്‍ക്ക് സാധന സാമഗ്രികള്‍ വാങ്ങാന്‍ ഒരു ലക്ഷം വീതം

തിരുവനന്തപുരം: ഒരുക്കിയ വയനാട് ടൗണ്‍ഷിപ്പിലെ താമസക്കാര്‍ക്ക് കൂടുതല്‍ ധനസഹായവുമായി സംസ്ഥാന സര്‍ക്കാര്‍....

"தேர்தலில் போட்டியிடும்படி மோடியின் பிரதிநிதி என்னை சந்தித்தார்" – எம்.பி ஆக ஆசைப்படும் ஐ.எம்.விஜயன்

கேரளாவில் விரைவில் சட்டசபை தேர்தல் நடைபெற உள்ளது. கேரளாவைச் சேர்ந்த இந்தியக்...

War Effect : తెలంగాణలో వార్ ఎఫెక్ట్.. చరిత్ర సృష్టించిన విద్యుత్ శాఖ

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రంగం సరికొత్త చరిత్రను లిఖించింది. రాష్ట్ర చరిత్రలో...