19
March, 2025

A News 365Times Venture

19
Wednesday
March, 2025

A News 365Times Venture

Vivekanandan Viral: ‘వివేకానందన్ వైరల్’ అంటూ వస్తున్న దసరా విలన్ . . ఆహా ఓటీటీలోకి కొత్త సినిమా !

Date:

దసరా సినిమాలో విలన్ గా నటించిన షైన్ టామ్ చాకోకి మలయాళంలో మంచి క్రేజ్ ఉంది. చాలా సింపుల్‌గా కనిపిస్తూనే పవర్ ఫుల్ విలనిజం పండించడం ఆయన నైజం. అలాంటి ఆయన డిఫరెంట్ కంటెంట్‌తో కూడిన ‘వివేకానందన్ విరలను’ అనే సినిమా చేశారు. గత ఏడాది జనవరి 19న విడుదలైన ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అలాంటి ఈ సినిమాను ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల కోసం అచ్చ తెలుగు ఓటీటీ ‘ఆహా’ స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అయింది. తన సబ్‌స్క్రైబర్ల కోసం ప్రతి శుక్రవారం కొత్త సినిమాలను అందించే ఆహా ఓటీటీ ఈ శుక్రవారం ‘వివేకానందన్ వైరల్’ పేరుతో సరికొత్త రొమాంటిక్ కామెడీ డ్రామాను అందించబోతోంది.

Allu Aravind: తండేల్ టికెట్ రేట్ల పెంపుపై అరవింద్ కీలక వ్యాఖ్యలు

ఈ సినిమాలో షైన్ టామ్ చాకో సరసన ఐదుగురు హీరోయిన్స్ కనిపిస్తారు. శ్వాసిక విజయ్, గ్రేస్ ఆంటోని, మెరీనా మైఖేల్, రమ్య సురేశ్, మంజు పిళ్లై ముఖ్యమైన పాత్రలను పోషించారు. కామెడీ డ్రామా జోనర్లో రూపొందిన ఈ సినిమాకి సీనియర్ దర్శకుడు కమల్ దర్శకత్వం వహించారు. ‘వివేకానందన్ వైరల్’ కథ విషయానికి వస్తే.. ఇద్దరు భార్యలను చేసుకొని, వాళ్లను వేధిస్తూ తిరిగే ఓ భర్త.. అతనికి బుద్ది చెప్పేందుకు వాళ్లు చేసే ప్రయత్నం చుట్టూ తిరిగే కథ ఇది. వివేకానందన్ మంచి విలాస పురుషుడు .. ఆపై శృంగార పురుషుడు. ఆయన భార్య సితార ఓ పల్లెటూళ్లో ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉంటుంది. తన జాబ్ సిటీలో కావడం.. భార్య ఇంట్లో లేకపోవడంతో వివేకానందన్ వివాహేతర సంబంధాలు కొనసాగిస్తూ ఉంటాడు. అతని నిజస్వరూపం తెలుసుకున్న వాళ్లంతా కలిసి ఏం చేశారు? వివేకానందన్ ఎలాంటి చిక్కుల్లో పడతాడు? అనేది అసలు కథ. ‘వివేకానందన్ వైరల్’ సినిమాను భవానీ మీడియా ద్వారా ఆహా ఓటీటీ ఫిబ్రవరి 7 నుంచి స్ట్రీమింగ్ చేస్తోంది. షైన్ టామ్ చాకో 100వ చిత్రంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది .

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

നിയമവിരുദ്ധമായി പ്രവര്‍ത്തിക്കുന്നെന്ന് ആരോപിച്ച് ഉത്തരാഖണ്ഡിലെ 84 മദ്രസകള്‍ അടച്ചുപൂട്ടി ബി.ജെ.പി സര്‍ക്കാര്‍

ഡെറാഡൂണ്‍: നിയമവിരുദ്ധമായി പ്രവര്‍ത്തിക്കുന്നുവെന്ന് ആരോപിച്ച് ഉത്തരാഖണ്ഡിലെ 84 മദ്രസകള്‍ അടച്ചുപൂട്ടി ബി.ജെ.പി...

`ஊதியம் கிடையாது' – போராட்டம் அறிவித்த அரசு ஊழியர்களுக்கு, தமிழ்நாடு அரசு எச்சரிக்கை

பழைய ஓய்வூதிய திட்டத்தை மீண்டும் அமல்படுத்த வேண்டும், பகுதி நேர ஆசிரியர்கள்...

Atreyapuram Pootharekulu: ఆత్రేయపురం కల్తీ నెయ్యి ఘటన.. ల్యాబ్ పరిశీలనలో వెలుగులోకి కీలక వాస్తవాలు!

అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలోని కొన్ని పూతరేకుల దుకాణాల్లో వాడింది కల్తీ...

ತಲೆಯಲ್ಲಿ ಕೂದಲಿಲ್ಲ ಎಂದು ಪತ್ನಿಯಿಂದ ನಿಂದನೆ: ಪತಿ ಆತ್ಮಹತ್ಯೆಗೆ ಶರಣು

ಚಾಮರಾಜನಗರ,ಮಾರ್ಚ್,17,2025 (www.justkannada.in): ತಲೆಯಲ್ಲಿ ಕೂದಲಿಲ್ಲ ಎಂದು ಪತ್ನಿ  ನಿಂದಿಸಿದ್ದಕ್ಕೆ  ಪತಿ...