25
June, 2026

A News 365Times Venture

25
Thursday
June, 2026

A News 365Times Venture

Omkar : ‘డ్యాన్స్ ఐకాన్ 2 – వైల్డ్ ఫైర్’ షో మొదలు పెట్టిన ఓంకార్..

Date:

‘డ్యాన్స్ ఐకాన్’ షో సీజన్ 1 ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుందో చెప్పక్కర్లేదు. ఇక దీనికి కొనసాగింపుగా ‘డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్’ ఫిబ్రవరి 14 నుంచి ఆహా ఓటీటీలో ప్రీమియర్ కు రెడీ అవుతోంది. ఈ షో కు ఓంకార్, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, శేఖర్ మాస్టర్ హోస్ట్‌లు గా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా కంటెస్టెంట్స్ పాల్గొంటున్నారు. హిప్ హాప్, క్లాసికల్, కాంటెంపరరీ స్టైల్ లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఆకట్టుకోనున్నాయి. ఈ నేపథ్యంలో షో గురించి ప్రెస్ మీట్ ను ఈరోజు హైదరాబాద్ లో నిర్వహించారు.

ఇందులో భాగంగా హోస్ట్ ఓంకార్ మాట్లాడుతూ.. ‘డ్యాన్స్ ఐకాన్ 1’ షో ను మీరు ఎంతో సక్సెస్ చేశారు. ఇప్పుడు డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ ను మీ ముందుకు తీసుకొస్తుండటం సంతోషంగా ఉంది. ఫరియా అబ్దుల్లా హోస్ట్ గా చేస్తుండటం హ్యాపీగా ఉంది. శేఖర్ మాస్టర్ సెకండ్ టైమ్ ఈ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ షో మీకు ఓవరాల్ ఎంటర్ టైన్ మెంట్ ఇస్తుంది. మీకు కావాల్సిన ప్రతి ఎలిమెంట్ మా షోలో ఉంటుంది. మొత్తం ఐదుగురు కంటెస్టెంట్స్ మిమ్మల్ని సర్ ప్రైజ్ చేస్తారు. పంచభూతాల్లాంటి వారి పర్ఫార్మెన్స్ మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుంది. ముఖ్యంగా ఇద్దరు పిల్లల పర్ఫార్మెన్స్ టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది. ముగ్గురు హోస్ట్ లతో పాటు మరో నలుగురు మెంటార్స్ ఉంటారు. సింగర్ జాను లైరి, ప్రకృతి, మానస్, దీపిక ఈ నలుగురు మెంటార్స్ ఉంటారు. షోలో ఫస్ట్ రౌండ్ విజేతలను మెంటార్స్ నిర్ణయిస్తే, సెకండ్ రౌండ్ లో ఎవరు విజేతలు అనేది ప్రేక్షకులు తమ ఓటింగ్ ద్వారా డిసైడ్ చేస్తారు. ఇక ‘డ్యాన్స్ ఐకాన్ 2 – వైల్డ్ ఫైర్’ చేసే అవకాశం ఇచ్చిన ఆహాకు థాంక్స్. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న మీడియాకు థ్యాంక్స్. నేను సినిమాకు వర్క్ చేశాను. టీవీకీ వర్క్ చేశాను. ఏ ప్లేస్ లో వర్క్ చేసినా ప్రొడక్షన్ వ్యాల్యూస్ మాత్రం టాప్ క్వాలిటీలో ఉండేలా చూసుకుంటా’ అని తెలిపారు ఓంకార్.

ఇక ఓంకార్ తో పాటుగా ఫరియా అబ్దుల్లా, శేఖర్ మాస్టర్ , యష్ మాస్టర్,మానస్, సింగర్ జాను లైరి, మెంటార్ ప్రకృతి,మెంటార్ ప్రకృతి కూడా మాట్లాడుతూ ఈ షో గురించి పలు విషయాలను పంచుకున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Water Bottle Cleaning: మీరు నీళ్లు తాగే బాటిల్ శుభ్రంగా ఉందా.? బ్యాక్టీరియా, దుర్వాసన రాకుండా ఇలా చేసేయండి.!

Water Bottle Cleaning: మనం ప్రతిరోజూ ఉపయోగించే ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌ను...

ದೇವನಹಳ್ಳಿ ಭೂಸ್ವಾಧೀನ: ಎಕರೆಗೆ ₹2.70 ಕೋಟಿ ಪರಿಹಾರಕ್ಕೆ ಶಿಫಾರಸು

ಬೆಂಗಳೂರುಜೂನ್,24,2026 (www.justkannada.in): ದೇವನಹಳ್ಳಿ ತಾಲ್ಲೂಕು ಚನ್ನರಾಯಪಟ್ಟಣ ಹೋಬಳಿಯ ಗೋಕರೆಬಚ್ಚೇನಹಳ್ಳಿ ಮತ್ತು ಹ್ಯಾಡಾಳ...

പാശ്ചാത്യ ലോകം റഷ്യയുമായി യുദ്ധത്തിന് ശ്രമിക്കുന്നു; രാജ്യം തയ്യാറായിരിക്കണമെന്ന് പുട്ടിന്‍

മോസ്‌കോ: റഷ്യക്കെതിരെ പാശ്ചാത്യ രാജ്യങ്ങള്‍ സൈനിക ഏറ്റുമുട്ടലിനൊരുങ്ങുകയാണെന്ന് റഷ്യന്‍ പ്രസിഡന്റ് വ്‌ളാദിമിര്‍...

`அன்பில் மகேஸ் செய்திருப்பது அநாகரிகம்; விளைவுகளை சந்திக்க நேரிடும்'- அமைச்சர் விஸ்வநாதன் எச்சரிக்கை

மதுரை மேலூரில் மாணவர்கள் கலந்துகொண்ட மாரத்தான் நிகழ்வில் தமிழ்நாட்டின் உயர் கல்வித்துறை...