30
September, 2026

A News 365Times Venture

30
Wednesday
September, 2026

A News 365Times Venture

Lays Potato Chips: FDA హెచ్చరిక.. అమెరికాలో భారీగా లేస్ చిప్స్ రీకాల్

Date:

Lays Potato Chips: అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) ఒరేగాన్, వాషింగ్టన్‌లో 6,344 బ్యాగుల లేస్ క్లాసిక్ పొటాటో చిప్స్‌ను క్లాస్ 1 రీకాల్‌గా ప్రకటించింది. డిసెంబర్ 13న ప్రకటించిన ఈ రీకాల్ కాస్త జనవరి 27న FDA అత్యధిక ప్రమాద స్థాయికి (క్లాస్ 1) పెంచబడింది. దీనికి కారణం, ఈ ఉత్పత్తిలో వెల్లడి చేయని పాల (Milk) మిశ్రమం ఉండటం. ఈ మిశ్రమం వల్ల కొంతమంది ప్రజలకు తీవ్ర ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందని పేర్కొంది. FDA ప్రకారం, క్లాస్ 1 రీకాల్ అత్యంత ప్రమాదకరమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే దీనిని తినడం వల్ల “తీవ్రమైన ఆరోగ్య సమస్యలు లేదా మరణం” సంభవించే ప్రమాదం ఉంది.

Also Read: TDP Politburo: నేడు టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. లోకేష్‌ టీమ్‌ రెడీ అవుతుందా..?

ఈ లేస్ చిప్స్‌లో పాల (Milk) మిశ్రమం ఉంటుందని ప్యాకేజింగ్‌పై పేర్కొనలేదు. అయితే, పాలకు అలెర్జీ ఉన్నవారికి ఇది ప్రమాదకరం. పాల అలెర్జీ ఉన్న వారు దద్దుర్లు, కడుపు నొప్పి, తలనొప్పి, గొంతు ఊపిరితిత్తుల్లో వాపు, మతి స్థిమితం కోల్పోవడం వంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని పేర్కొంది. ఫ్రిటో-లేస్ కంపెనీ ఒక వినియోగదారు ఇందుకు సంబంధించి ఫిర్యాదు చేయడంతో.. ఈ రీకాల్‌ను స్వచ్ఛందంగా ప్రారంభించింది.

Also Read: US Airstrike On Syria: సిరియాపై అమెరికా వైమానిక దాడి.. సీనియర్ ఉగ్రవాది హతం

ఈ రీకాల్ లేస్ క్లాసిక్ పొటాటో చిప్స్‌కు మాత్రమే వర్తిస్తుంది. ఇవి ఒరేగాన్, వాషింగ్టన్‌లోని రిటైల్ అలాగే ఆన్‌లైన్ స్టోర్లలో విక్రయించబడ్డాయి. దీనితో మొత్తం 6300 లేస్ పాకెట్స్ ను రీకాల్ చేస్తున్నారు. డిసెంబర్ 16న ఫ్రిటో-లేస్ ప్రకటించిన ప్రకటనలో “ఈ సమస్యకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి అలెర్జిక్ రియాక్షన్‌లు నమోదుకాలేదు. ఇతర లేస్ ఉత్పత్తులు, ఫ్లేవర్లు, పరిమాణాలు లేదా వెరైటీ ప్యాక్స్ రీకాల్ చేయబడలేదు” అని స్పష్టం చేసింది. ఇకపోతే జనవరి నెలలో FDA అనేక ఉత్పత్తులను వెనక్కి తీసుకుంది. వాటిలో 10 ఉత్పత్తుల్లో వెల్లడి చేయని అలెర్జెన్‌లు ఉండటం గమనార్హం.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಪರಿಸರ ಸಂರಕ್ಷಣೆಗೆ ರಾಷ್ಟ್ರೀಯ ಬದ್ಧತೆ ಅಗತ್ಯ: ಭೂಪೇಂದ್ರ ಯಾದವ್

  ನವದೆಹಲಿ, ಸೆ.29, 2026: ಅರಣ್ಯ, ವನ್ಯಜೀವಿ, ಜೀವವೈವಿಧ್ಯ ಮತ್ತು ನೈಸರ್ಗಿಕ...

ഫലസ്തീന്‍ ആക്ഷന്‍ നിരോധനം ഉചിതമായിരുന്നോയെന്ന് പരിശോധിക്കും: യു.കെ വിദേശകാര്യ സെക്രട്ടറി

ലിവര്‍പൂള്‍: ഫലസ്തീന്‍ ആക്ഷന്‍ സംഘടനയെ ഭീകരവാദ സംഘടനയായി പ്രഖ്യാപിച്ച് നിരോധിച്ചത് രാഷ്ട്രീയപരമായി...

சவுக்கு சங்கருக்கு மூன்று ஆண்டு சிறைத் தண்டனை! – விவரம் என்ன?

பிரபல யூடியூபரான சவுக்கு சங்கருக்கு மூன்று ஆண்டு சிறை தண்டனை விதித்து...

TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..

ఉద్యోగం చేస్తున్న డిప్లొమా, బీఎస్సీ (మ్యాథమెటిక్స్) అభ్యర్థుల కోసం లేటరల్ ఎంట్రీ...