20
May, 2026

A News 365Times Venture

20
Wednesday
May, 2026

A News 365Times Venture

Naga Chaitanya: ఇదొక పెద్ద జ‌ర్నీ.. “తండేల్” కథ చెప్పేసిన నాగచైతన్య !

Date:

నాగ చైతన్య కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న తండేల్ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమా చైతూ కెరీర్లోనే బిగ్గెస్ట్‌గా హిట్ నిలిచేలా ఉందనేలా ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. ఉత్తరాంధ్ర నేప‌థ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం నాగ చైతన్య చాలా కష్టపడ్డాడు. శ్రీకాకుళం యాస‌ కోసం కొన్నాళ్లు ఆ ప్రాంత వాసుల‌తో జర్నీ కూడా చేశాడు. తండేల్ తెలుగు ట్రైలర్‌ కూడా సినిమా పై మరిన్ని అంచనాలు పెంచేసింది. గతంలో పాన్-ఇండియా హిట్ కార్తికేయ 2 ను అందించిన చందూ మొండేటి దర్శకత్వం వహించారు. చిత్రం యూనిట్ ఇప్పటికే ప్రమోషన్లతో బిజీగా ఉంది. తాజాగా గురువారం ఈ మూవీ త‌మిళ ట్రైల‌ర్‌ను చెన్నైలో విడుద‌ల చేశారు. కోలీవుడ్ స్టార్ కార్తి ముఖ్య అతిథిగా హాజ‌రయ్యారు. ఈ సందర్భంగా యువ సామ్రాట్ నాగ చైత‌న్య మాట్లాడుతూ.. గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌లో చందూ మొండేటి ద‌ర్శక‌త్వంలో ‘తండేల్’ వంటి సినిమాను చేయటం తన అదృష్టంగా భావించాడు.

READ MORE: Kejriwal: రాహుల్‌గాంధీని పెళ్లి చేసుకోలేదు.. కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు

ముఖ్య అథితిగా వచ్చిన కార్తి నాగచైతన్య స్పెష‌ల్ థాంక్స్‌ చెప్పారు. తనకు చెన్నై అంటే ఎప్పుడూ ప్రత్యేక‌మైన అభిమాన‌మన్నారు. అలాగే వెంక‌ట్ ప్రభు, కార్తీక్ సుబ్బరాజ్‌కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమా షూటింగ్ ఎంతో ఎగ్జయిటింగ్‌గా అనిపించిందన్నారు. “శ్రీకాకుళం నుంచి కొంత మంది జాల‌ర్లు గుజరాత్‌కు వెళ్లి. అక్కడి నుంచి అనుకోకుండా పాకిస్థాన్‌లో ఎంట్రీ ఇచ్చి అక్కడ అరెస్ట్ అయ్యి త‌ప్పించుకుని వ‌చ్చారు. ఇదొక పెద్ద జ‌ర్నీ. ఆ క‌థ విన‌గానే చాలా ఎగ్జయిట్ అయ్యాను. నేను శ్రీకాకుళం వెళ్లి అక్కడి వారిని గ‌మ‌నించాను. చిన్న చిన్న విష‌యాల‌ను తెలుసుకుని మ‌రీ న‌టించాను. చందు మొండేటి ఇలాంటి సినిమాను నాపై న‌మ్మకంతో చేసినందుకు నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి సినిమాలు చేసే అవ‌కాశాలు అరుదుగా వ‌స్తుంటాయి. దాంతో మ‌న బెస్ట్ ఎఫ‌ర్ట్ ఇచ్చే చాన్స్ వ‌స్తుంది. ఇలాంటి క‌థ మ‌న ఆడియెన్స్‌కు తెలియాల‌నే ఇన్‌స్పిరేష‌న్‌తో ఈ సినిమాను చేశాం. శ్రీకాక‌కుళంలోని తండేల్స్ నా రియ‌ల్ హీరోస్‌.” అని నాగచైతన్య తన అనుభవాన్ని పంచుకున్నాడు.. చేపల వేటకు వెళ్లి పాకిస్థాన్‌లో చిక్కుకున్న నాగ చైతన్య.. ఎలా తప్పించుకున్నాడు? అనే ప్రశ్నకు దొరకాలంటే సినిమా చూడాల్సిందే..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഇസ്രഈലിനുള്ള യു.എസ് സഹായത്തെ ഭൂരിഭാഗം അമേരിക്കക്കാരും എതിർക്കുന്നു; ന്യൂയോർക് ടൈംസിന്റെ സർവ്വേ റിപ്പോർട്ട്

വാഷിങ്ടൺ: അമേരിക്കയിലെ ഭൂരിഭാഗം മനുഷ്യരും ഇസ്രഈലിന് യു.എസ് ഭരണകൂടം നൽകുന്ന സാമ്പത്തിക,...

Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్‌కు ట్రంప్ తాజా వార్నింగ్

పశ్చిమాసియా యుద్ధం మళ్లీ మొదలు కాబోతుందా? ఇరాన్‌పై మరోసారి అమెరికా, ఇజ్రాయెల్...

ಜೈಲಿನಲ್ಲಿ ನಟ ದರ್ಶನ್ ಭೇಟಿಯಾದ ಪತ್ನಿ ವಿಜಯಲಕ್ಷ್ಮಿ, ಪುತ್ರ ವಿನೀಶ್

ಬೆಂಗಳೂರು,ಮೇ,19,2026 (www.justkannada.in):  ರೇಣುಕಾಸ್ವಾಮಿ ಕೊಲೆ ಪ್ರಕರಣದಲ್ಲಿ  ನ್ಯಾಯಾಂಗ ಬಂಧನದಲ್ಲಿದ್ದು ಜೈಲುವಾಸ...