15
August, 2026

A News 365Times Venture

15
Saturday
August, 2026

A News 365Times Venture

Rythu Maha Dharna: నల్లగొండలో ముగిసిన రైతు మహాధర్నా.. భారీగా తరలివచ్చిన జనం

Date:

Rythu Maha Dharna: నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్ వద్ద బిఆర్ఎస్ పార్టీ రైతు మహాధర్నా విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం వరిసాగులో నంబర్ వన్ స్థాయికి చేరుకున్నదంటే అది సీఎం కేసీఆర్ నాయకత్వంలో సాధ్యమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో రైతులు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చిందని, చెప్పిన సమయానికి రైతు భరోసా ఇవ్వడంలో ఆ పార్టీ విఫలమైందని విమర్శించారు. ఇక నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యకు ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీనే అని ఆరోపించారు. వారి పాలనలో రైతుల కష్టాలకు సంబంధించి సరైన చర్యలు తీసుకోలేదని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు భరోసా ఇవ్వదని ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా చెప్పిందని ఆయన గుర్తు చేశారు. నాట్లప్పుడు కాదు.. ఓట్లప్పుడే రైతు భరోసా పడుతుందని కాంగ్రెస్ విధానాన్ని విమర్శించారు.

Also Read: Experium Eco Park: ఎక్స్‌పీరియం పార్క్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

నల్లగొండ జిల్లా అభివృద్ధి గురించి చర్చకు దమ్ముంటే కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్లాక్ టవర్ వద్దకు రావాలని కేటీఆర్ సవాల్ విసిరారు. రైతుల సంక్షేమానికి సంబంధించి ప్రశ్నించాలంటే కాంగ్రెస్ నేతలను నిలదీయాలని నల్లగొండ ప్రజలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ మహాధర్నాకు అనుమతి ఇచ్చినందుకు హైకోర్టుకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఇక భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ పార్టీనే రాష్ట్రాభివృద్ధికి దోహదపడుతుందని, సంక్షేమ పథకాలను కొనసాగిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ ధర్నా రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడం మాత్రమే కాకుండా, రైతుల కోసం తాము ఎంతగానో పనిచేస్తున్నామనే సందేశాన్ని ప్రజలకు అందించడమేనని కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు, సభ విజయవంతమవడంపై నల్లగొండ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

‘കുറ്റവാളിമുക്ത പാർലമെന്റ് സമ്മാനമായി വേണം’; പ്രധാനമന്ത്രിയോട് ആവശ്യപ്പെട്ട് സോനം വാങ്ചുക്

ന്യൂഡൽഹി: ഈ സ്വാതന്ത്ര്യദിനത്തിൽ പ്രധാനമന്ത്രി നരേന്ദ്ര മോദിയോട് ‘കുറ്റവാളിമുക്ത പാർലമെന്റ്’ സമ്മാനമായി...

பள்ளி மாணவர் கொலை: "அரசு கண்டும் காணாமல் வாயை மூடிக் கொண்டு இருப்பது வெட்கக்கேடு" – உதயநிதி கண்டனம்

சென்னை திருவொற்றியூரில் போதைப்பொருள் புழக்கத்தைத் தட்டிக்கேட்டதால், அரசுப் பள்ளியில் +2 படித்து...

ട്രംപ്-മോദി സൗഹൃദം ഇന്ത്യ യു.എസ് ബന്ധം ശക്തമാക്കി; സ്വാതന്ത്ര്യ ദിനത്തിൽ ആശംസകൾ നേർന്ന് യു.എസ് സ്റ്റേറ്റ് സെക്രട്ടറി

വാഷിംഗ്ടൺ: ഇന്ത്യയുടെ 80-ാം സ്വാതന്ത്ര്യദിനത്തിൽ രാജ്യത്തെ ജനങ്ങൾക്ക് ആശംസകൾ നേർന്ന് യു.എസ്...