29
September, 2026

A News 365Times Venture

29
Tuesday
September, 2026

A News 365Times Venture

JD Vance: అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణస్వీకారం

Date:

అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణస్వీకారం చేశారు. డొనాల్డ్ ట్రంప్ కంటే ముందుగా జేడీ వాన్స్ ప్రమాణం చేశారు. జేడీ వాన్స్ చేత అమెరికా ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ప్రమాణం చేయించారు. క్యాపిటల్ రోటుండాలో జేడీ వాన్స్ ప్రమాణం చేశారు. ఈ ప్రమాణస్వీకారానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అతిరథ మహారథులంతా హాజరయ్యారు. వేదిక పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వాషింగ్టన్‌లో విపరీతమైన చలి కారణంగా ప్రమాణస్వీకార వేడుకను ఆరుబయట కాకుండా క్యాపిటల్‌ భవనంలో నిర్వహించారు. రొనాల్డ్‌ రీగన్‌ 1985లో అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పుడు సైతం ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. దాదాపు 40 ఏళ్ల తర్వాత ఇప్పుడు రెండోసారి అలా జరుగుతోంది.

 

ఈ కార్యక్రమానికి అమెరికా మాజీ అధ్యక్షులు బిల్‌ క్లింటన్‌, జార్జి బుష్‌, బరాక్‌ ఒబామా, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్‌ మిలి, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌ హాజరయ్యారు. రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ దంపతులు, టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ చీఫ్‌ ఎలాన్‌ మస్క్‌, అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌, మెటా సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌, యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌, టిక్‌టాక్‌ సీఈవో షోజీ చ్యూ, గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ తదితరులు హాజరయ్యారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಪ್ರೀತಿಗೆ ನಿರಾಕರಣೆ: ಪೆಟ್ರೋಲ್ ಸುರಿದು, ಯುವತಿ ತಬ್ಬಿಕೊಂಡು ಬೆಂಕಿ ಹಚ್ಚಿಕೊಂಡ ಯುವಕ

ಮೈಸೂರು, ಸೆಪ್ಟಂಬರ್,29, 2026 (www.justkannada.in):  ಪ್ರೀತಿಸುವಂತೆ ನಿರಂತರವಾಗಿ ದುಂಬಾಲು ಬಿದ್ದಿದ್ದ...

‘വിഷം പഠിപ്പിക്കുന്നു’; സര്‍വകലാശാലാ പാഠ്യപദ്ധതിയിലെ അംബേദ്കര്‍ രചനകളില്‍ പ്രധാനമന്ത്രിയുടെ ഓഫീസിന്റെ പരിശോധന

ന്യൂദല്‍ഹി: രാജ്യത്തെ സര്‍വകലാശാലകളിലെ പാഠ്യപദ്ധതിയില്‍ ഉള്‍പ്പെടുത്തിയിട്ടുള്ള അബേദ്ക്കറിന്റെ രചനകളെക്കുറിച്ച് പ്രധാനമന്ത്രിയുടെ ഓഫീസ്...

மின்சாரத்துறையில் தனியார்: “இதற்கு பெயர்தான் தூய ஆட்சியா? வெட்கக்கேடு! " – சீமான் காட்டம்

வீடுகளில் மின் பயன்பாட்டைக் கணக்கெடுக்கும் பணியில் தனியார் ஒப்பந்த நிறுவனங்களின் மூலம்...

Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..

ఢిల్లీలో శీతాకాలంలో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు, పరిశుభ్రమైన గాలిని అందించేందుకు ఢిల్లీ...