14
February, 2025

A News 365Times Venture

14
Friday
February, 2025

A News 365Times Venture

AP Crime: హత్య కేసులో విస్తుపోయే విషయాలు.. బాత్‌ రూమ్‌లో మహిళ శవం.. బెడ్‌ రూమ్‌లో ప్రియురాలితో రొమాన్స్‌..!

Date:

AP Crime: శ్రీకాకుళం నగర నడిబొడ్డు న్యూకాలనీలో పొందూరు మండలం మొదలవలసకు చెందిన పూజారి కళావతి (54) హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. స్వగ్రామం నుంచి పట్టనానికి తన కొత్త బట్టలు టైలర్ నుంచి తీసుకువస్తానని చెప్పి స్కూటీపై వచ్చిన మహిళ అనుమానాస్పదంగా మృతిచెందింది. కళావతి భర్త పూజారి వెంకటరావు ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు. వీరిని ఇద్దరు మగపిల్లలు , ఒక కుమార్తె ఉన్నారు. ఆమె తరచూ సత్ సంఘం భజనలకు వెళ్లేవారు.. ఇక, ఉదయం కొత్త బట్టల కోసం వెళ్లిన కళావతి తిరిగిరాకపోవడంతో , భజన కార్యక్రమాలకు వెల్లిఉంటుందని కుటుంబసభ్యులు భావించారు. ఫోన్ కూడా చేయకపోవడంతో.. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసి.. ఆమె కోసం వెతకటం ప్రారంభించారు.. సీసీ కెమెరాల ఆధారంగా న్యూకాలనీలో ఒక అపార్ట్ మెంట్ లో విగతజీవిగా ఉన్న కళావతిని గుర్తించారు. ఈ కేసులో కూపీలాగడంతో అక్రమ సంబంధమే కళావతి మృతికి కారణంగా తెలిస్తుంది.

Read Also: Sankranthiki Vastunnam: అల వైకుంఠపురంలో రికార్డు బ్రేక్ చేసిన సంక్రాంతికి వస్తున్నాం

హత్యకు గురైన కళావతికి న్యూకాలనీలో అద్దెకుంటున్న అండులూరి శరత్‌కుమార్‌ (34) అనే యువకుడితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. స్థానిక సరస్వతి థియేటర్‌ పక్కన జనరేటర్‌ మెకానిక్‌ వర్క్స్‌తో పాటు, సెకండ్‌ హ్యాండ్‌ జనరేటర్లు అమ్మడం, అద్దెలకు ఇచ్చే వ్యాపారం నిర్వహిస్తున్నాడు శరత్ కుమార్. అయితే, చెడు సావాసాలు, మద్యంకు బానిసైన శరత్‌కుమార్‌ ను తండ్రి వెంకట్రావు భరించలేక బయటకు నెట్టేశారు. ఏడాదిన్నరగా న్యూకాలనీలోనే శరత్‌కుమార్‌ ఈ ఇంట్లో అద్దెకుంటున్నాడు. మొదలవలస గ్రామానికి చెందిన కళావతితో వివాహేతర సంబంధం ఉందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. శరత్ కుమార్ శనివారం కళావతిని ఫోన్‌ చేసి పిలిపించుకున్నాడని తెలుస్తుంది. గతంలో అనేకమార్లు శరత్‌ రూమ్‌కు కళావతి వచ్చినట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. గత కొంతకాలంగా వ్యాపారం సరిగ్గా నిర్వహించక వ్యసనాలకు బానిసైన శరత్‌ అప్పులపాలైపోయాడు. కనపడినచోటల్లా వడ్డీలకు అప్పులు చేసి షాపు కూడా సరిగ్గా తెరవకుండా విలాసాల్లో తేలియాడేవాడని తెలుస్తుంది. శనివారం కూడా ఫుల్‌గా మద్యం సేవించిన తర్వాత కళావతికి ఫోన్‌ చేసి రప్పించుకొని, తన బాకీలు తీర్చుకోడానికి పనికొస్తుందని ఆమె వద్ద ఉన్న నగలు కాజేయడానికి హత్య చేసినట్లు తెలుస్తుంది. శనివారం రాత్రి కళావతిని హత్య చేసి బాత్రూమ్‌లో పడేసిన తర్వాత శరత్‌ గర్ల్‌ఫ్రెండ్‌కు ఫోన్‌ చేసి బెడ్‌రూమ్‌లో శనివారం ఉదయం 4 వరకు గడిపినట్లు తెలుస్తుంది. ఈ విషయం బెడ్‌రూమ్‌లో ఉన్న మహిళకు తెలుసా? లేదా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: BEL Recruitment 2025: బీటెక్ పాసై ఖాళీగా ఉన్నారా?.. బెల్‌లో ప్రొబేషనరీ ఇంజినీర్ పోస్టులు రెడీ

ఇదిలా ఉండగా ఆదివారం శరత్‌ బాత్రూమ్‌లో శవాన్ని ఉంచి, తన ఫ్రెండ్‌ నరేంద్ర వద్దకు వెళ్లి గతంలో రూ.40వేలు తీసుకున్న అప్పును తీర్చినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా ఆదివారం సాయంత్రం బైపాస్‌ జంక్షన్‌ వద్ద దాబాకు మిత్రుడు నరేంద్రను తీసుకువెళ్తూ తోవలోనే కళావతిని హత్య చేశానట్లు తెలిపారు. దీన్ని మొదట నమ్మని నరేంద్ర అందుకు సంబంధించిన ఆధారాలు కూడా శరత్‌ చూపించడంతో అక్కడికక్కడే బండి ఆపి.. టూటౌన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్‌కు ఫోన్‌ చేసి శరత్‌ను అప్పగించే ప్రయత్నం చేశారు.. మరోవైపు అప్పటికే ఈ విషయం పోలీసులకు ఉప్పందడంతో శరత్‌ కోసం వెతుకులాట మొదలుపెట్టారు. శనివారం కళావతిని హత్య చేసి, ఆ బాడీని బాత్రూమ్‌లోకి తరలించి మరో అమ్మాయితో శనివారం రాత్రంతా గడిపిన శరత్‌ ఒక్కడే ఈ హత్యకు పాల్పడ్డాడా? లేదంటే ఆయన మిత్రులు ఉన్నారా? అనే కోణంలో కూడా దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు. శరత్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్ లో విచారించగా.. తానొక్కడినే హత్య చేసినట్లు శరత్‌ చెబుతున్నాడని తెలుస్తుంది. అయితే, పోలీసులు మాత్రం నరేంద్ర, ఉమ అనే ఇద్దర్ని కూడా అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. ఇక, బాత్రూమ్‌లో పడివున్న కళావతి మృతదేహం వద్ద క్లూస్‌టీమ్‌ ఆధారాలు సేకరించింది. ఆమె శరత్‌ రూమ్‌లోకి వచ్చేసరికి వంటిపై నగలు ఉన్నాయా లేవా? అన్నది దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజ్‌ ఆధారం ప్రకారం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నగరంలో ఉన్న టైలర్‌ దగ్గర్నుంచి బట్టలు తీసుకోడానికి వెళ్తున్నానని చెప్పిన కళావతి న్యూకాలనీలో ఓ ప్రైవేటు కళాశాల వద్ద తన ద్విచక్ర వాహనాన్ని పార్క్‌ చేసి శరత్‌ గది వైపు మధ్యాహ్నం 2.40 గంటలకు వెళ్లడాన్ని సీసీ కెమెరాల ద్వారా పోలీసులు గుర్తించారు. ఈ కేసు స్థానికంగా సంచలనంగా మారింది..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Kishan Reddy: మాజీ సీఎం కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డిలకు కేంద్రమంత్రి సవాల్!

మాజీ సీఎం కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డిలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి...

ಹೂಡಿಕೆದಾರರ ಸಮಾವೇಶ: ಉತ್ಸಾಹದಿಂದ ಓಡಾಡಿದ ಎಂ ಬಿ ಪಾಟೀಲ

ಬೆಂಗಳೂರು, Feb.12,2025: ಜಾಗತಿಕ ಹೂಡಿಕೆದಾರರ ಸಮಾವೇಶದಲ್ಲಿ ಬುಧವಾರ ದಿನವಿಡೀ ಬೃಹತ್...

മലയോര ഹൈവേ; 250 കി.മീ പണി പൂര്‍ത്തിയായി, ഒരു വര്‍ഷത്തിനകം 200 കി.മീ കൂടി; ആദ്യ റീച്ചിന്റെ ഉദ്ഘാടനം നാളെ

തിരുവനന്തപുരം: കാസര്‍ഗോഡ് ജില്ലയിലെ നന്ദാരപ്പടവ് മുതല്‍ തിരുവനന്തപുരം ജില്ലയിലെ പാറശ്ശാലവരെ നീളുന്ന...

`மனைவி கணவரை தவிர்த்து வேறொருவர் மீது காதலும், நெருக்கமும் கொண்டிருப்பது தகாத உறவாகாது'- MP ஹைகோர்ட்

மத்தியப் பிரதேசத்தைச் சேர்ந்த ஒருவர் தன்னுடைய மனைவிக்கு வேறு ஒருவருடன் தொடர்பு...