14
February, 2025

A News 365Times Venture

14
Friday
February, 2025

A News 365Times Venture

Health Tips: మీ స్మార్ట్‌ఫోనే మీ ఫిట్‌నెస్ కోచ్.. ఆశ్చర్యంగా ఉందా? ఇది చదవండి..

Date:

స్మార్ట్‌ఫోన్‌లపై ఆధారపడటం రోజు రోజుకూ పెరుగుతోంది. ఒక అధ్యయనం ప్రకారం.. 2040 నాటికి భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల సంఖ్య 1.55 బిలియన్లకు చేరుకుంటుంది. సాధారణ సంభాషణ నుంచి మెసేజింగ్ తో పాటు సంగీతం నుంచి పుస్తకాల వరకు, సినిమాల నుంచి గేమింగ్ వరకు.. పిల్లల నుంచి పెద్దల వరకు అన్నింటికీ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌ అవసరం. కానీ.. ఇదే ఫోన్‌ను ఆరోగ్యం, ఫిట్‌నెస్ కోసం ఎందుకు ఉపయోగించకూడదు!

అడుగుల లెక్కింపు..
మీ స్మార్ట్‌ఫోన్ సహాయంతో మీరు ప్రతిరోజూ ఎన్ని అడుగులు వేస్తున్నారో సులభంగా గమనించవచ్చు. నిపుణులు, వివిధ పరిశోధనల ప్రకారం.. ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజూ పది వేల అడుగులు నడవాలి. మీ స్మార్ట్‌ఫోన్‌లో అడుగులను లెక్కించే ఆప్షన్ ఉంటుంది. మీ ఫోన్‌లో అలాంటి ఫీచర్ లేకపోతే Google Fitని యాక్టివేట్ చేయండి. ఇది కాకుండా.. MapMyWalk, Fitbit, Nike Run Club మొదలైనవి కూడా స్టెప్స్‌పై నిఘా ఉంచుతాయి.

ఆహారం అంశంలో..
స్మార్ట్‌ఫోన్‌లు ఆహారం, పోషకాహారం, రోజువారీ ఆహారపు అలవాట్లను ట్రాక్ చేయడం చాలా సులభం చేశాయి. మీరు మీ ఫోన్ ద్వారా రోజంతా స్నాక్స్, భోజనం రూపంలో మీరు తినే వాటిపై నిఘా ఉంచవచ్చు. దీని కోసం, మీరు మీ ఫోన్‌లో మంచి పోషకాహారానికి సంబంధించిన యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. మీరు రోజంతా తిన్న అన్ని వస్తువులను ఫోటో తీయాలి. దీని ద్వారా.. మీ ఆహారపు అలవాట్లు, పోషకాహారం గురించి మీ అవగాహన పెరుగుతుంది. మీరు ఫిట్‌గా ఉండటానికి, బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నట్లయితే.. MyFitnessPal, Healthify, Lifesum మొదలైన పోషకాహార సంబంధిత యాప్‌లు ఈ ప్రయోజనకరంగా ఉంటాయి.

కేలరీల గణితం.. 
మీ బరువును పెంచడం లేదా తగ్గించడం లేదా పరిమితిలో ఉంచుకోవడం మీ లక్ష్యం అయితే.. ఇది మీ కోసమే. మీ స్మార్ట్‌ఫోన్‌లో క్యాలరీ లెక్కింపు యాప్‌లను డౌన్‌లోడ్ చేయండి. దీని ద్వారా మీరు ఒక రోజులో ఎన్ని కేలరీలు వినియోగించారో సులభంగా ట్రాక్ చేయవచ్చు. ఈ యాప్‌లు ఒకేసారి ఎంత ఆహారం లేదా కేలరీలు వినియోగించాలి అనే సూచనలను కూడా అందిస్తాయి. కేలరీలను ట్రాక్ చేయడంతో పాటు, ఈ యాప్‌లు శక్తి వినియోగం గురించిన సమాచారాన్ని కూడా అందిస్తాయి. స్మార్ట్‌ఫోన్ సహాయంతో మీరు మీ ఆరోగ్యాన్ని స్థితిని కూడా గమనించవచ్చు. హృదయ స్పందన, నిద్ర విధానాలు, నిద్రించే గంటలు, ఒత్తిడి స్థాయిల గురించి సమాచారాన్ని తెలుసుకోవచ్చరు. మీ ఫిట్‌నెస్ వాచ్‌ని మీ స్మార్ట్‌ఫోన్‌కి కనెక్ట్ చేయడం ద్వారా, మీరు మీ శారీరక ఆరోగ్యం గురించి సవివరమైన సమాచారాన్ని పొందవచ్చు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಹೂಡಿಕೆದಾರರ ಸಮಾವೇಶ: ಉತ್ಸಾಹದಿಂದ ಓಡಾಡಿದ ಎಂ ಬಿ ಪಾಟೀಲ

ಬೆಂಗಳೂರು, Feb.12,2025: ಜಾಗತಿಕ ಹೂಡಿಕೆದಾರರ ಸಮಾವೇಶದಲ್ಲಿ ಬುಧವಾರ ದಿನವಿಡೀ ಬೃಹತ್...

മലയോര ഹൈവേ; 250 കി.മീ പണി പൂര്‍ത്തിയായി, ഒരു വര്‍ഷത്തിനകം 200 കി.മീ കൂടി; ആദ്യ റീച്ചിന്റെ ഉദ്ഘാടനം നാളെ

തിരുവനന്തപുരം: കാസര്‍ഗോഡ് ജില്ലയിലെ നന്ദാരപ്പടവ് മുതല്‍ തിരുവനന്തപുരം ജില്ലയിലെ പാറശ്ശാലവരെ നീളുന്ന...

`மனைவி கணவரை தவிர்த்து வேறொருவர் மீது காதலும், நெருக்கமும் கொண்டிருப்பது தகாத உறவாகாது'- MP ஹைகோர்ட்

மத்தியப் பிரதேசத்தைச் சேர்ந்த ஒருவர் தன்னுடைய மனைவிக்கு வேறு ஒருவருடன் தொடர்பு...

Lalu Prasad Yadav: “మా బావకు కిడ్నాపర్లలో సంబంధం”.. లాలూ బావమరిది సంచలన ఆరోపణ..

Lalu Prasad Yadav: లాలూ ప్రసాద్ యాదవ్‌పై ఆయన బావమరిది,...