20
November, 2026

A News 365Times Venture

20
Friday
November, 2026

A News 365Times Venture

RCB: రిటెన్షన్ తర్వాత ఆర్బీసీ పరిస్థితి ఇదీ.. ఎవరున్నారు..? ఎవరు వెళ్లారు..?

Date:

ఐపీఎల్ 2027 సీజన్‌కు సంబంధించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తమ రిటెన్షన్ జాబితాను విడుదల చేసింది. ఈ సారి ఆర్సీబీ మొత్తం 20 మంది కీలక ఆటగాళ్లను అంటిపెట్టుకోగా, పలువురు ఆటగాళ్లను జట్టు నుంచి విడుదల చేసింది. గత సీజన్‌లో ఎలాంటి మ్యాచ్‌లు ఆడకపోయినా పేసర్ యశ్ దయాళ్‌పై ఫ్రాంచైజీ నమ్మకం ఉంచి జట్టులోనే కొనసాగించింది. అలాగే కెప్టెన్ రజత్ పాటిదార్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ జట్టులో ప్రధాన ఆకర్షణగా కొనసాగుతున్నారు.

వికెట్ కీపర్ జితేశ్ శర్మ, సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్, ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా, జోష్ హేజివుడ్, ఫిల్ సాల్ట్ వంటి స్టార్ ఆటగాళ్లపై ఆర్సీబీ మరోసారి భరోసా ఉంచింది. అలాగే ఫినిషర్లుగా డేవిడ్, షెఫర్డ్, దేవదత్త పడిక్కల్, వెంకటేష్ అయ్యర్, నువాన్ తుషారాలను కూడా రిటెన్ చేసుకుంది. కాక్స్, రసిఖ్ సలామ్ దార్, సుయాష్ శర్మ వంటి యువ ఆటగాళ్లతో పాటు వికీ ఓస్వాల్, అభినందన్ సింగ్, కనిష్క్ చౌహాన్ జట్టు బెంచ్ స్ట్రెంత్‌ను బలోపేతం చేయనున్నారు.

మరోవైపు కొద్దిమంది ఆటగాళ్లను ఆర్సీబీ ఈసారి వేలంలోకి వదిలేసింది. గతంలో భారీ ధరలకు అమ్ముడైన విదేశీ ఆల్ రౌండర్ జేకబ్ బెథెల్ రూ. 2.60 కోట్లు, పేసర్ గ్లీసన్ రూ. 1.60 కోట్లు, రూ. 5.20 కోట్లు విలువైన మంగేశ్ యాదవ్‌ను ఫ్రాంచైజీ రిలీజ్ చేసింది. వీరితో పాటు అండర్-19 విజేత విహాద్ మల్హోత్రా, సాత్విక్ దేశ్‌వాల్‌లను కూడా జట్టు నుంచి తొలగించారు. ఈ మార్పులతో ఆర్సీబీ తదుపరి మినీ వేలానికి వ్యూహాత్మకంగా సిద్ధమవుతోంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

தமிழ்நாடு முதலீட்டு தகவல்கள் கசிவு: 15 பேரை அதிரடி நீக்கம் செய்த அமைச்சர் கீர்த்தனா?

தமிழ்நாடு அரசின் தொழில் முதலீடுகளை ஈர்க்கும் அமைப்பான 'தமிழ்நாடு வழிகாட்டி' (Guidance...

AP Police: ఏపీ పోలీసుల సంచలన ఆపరేషన్.. మారేడుమిల్లి అడవుల్లో మావోయిస్టు డంప్ స్వాధీనం..

ఆంధ్రప్రదేశ్ పోలీసుల సమర్థవంతమైన చర్యలతో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వామపక్ష...

ടൂറിസ്റ്റ് ബസ്സുകള്‍ക്ക് ഇനി ഇഷ്ടമുള്ള നിറം; ബസുകളുടെ ഏകീകൃത വെള്ളനിറം പിന്‍വലിച്ച് ഹൈക്കോടതി

കൊച്ചി: സംസ്ഥാനത്തെ ടൂറിസ്റ്റ് ബസുകള്‍ക്കുള്ള ഏകീകൃത വെള്ളനിറം പിന്‍വലിച്ചു. മുന്‍ ഉത്തരവ്...

“`Start, Camera, Action' என்றதும் எல்லாம் மாறிவிடும் என்ற எண்ணத்தை கைவிடுங்கள்"- எடப்பாடி பழனிசாமி

சென்னை மாதவரத்தில் மத்திய வருவாய் புலனாய்வு போலீசார் வாகன தணிக்கையில் ஈடுபட்டிருந்தனர்....