20
November, 2026

A News 365Times Venture

20
Friday
November, 2026

A News 365Times Venture

Uttam Kumar Reddy : నీటి హక్కులపై వెనక్కి తగ్గేది లేదు.. బీఆర్ఎస్‌పై ఉత్తమ్ ఫైర్

Date:

తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణలో ప్రభుత్వం రాజీపడే ప్రసక్తే లేదని, కృష్ణా, గోదావరి జలాల్లో ప్రతి బొట్టు కోసం పోరాడుతున్నామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలు గోబెల్స్ తాతలను మించేలా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు, ఏపీ జలసోషణ, కేసీఆర్ హయాంలోని అవినీతిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పలు కీలక విషయాలను వెల్లడించారు.

ఏపీ ప్రాజెక్టుపై కేంద్రానికి ఫిర్యాదు చేశాం

జల్ జీవన్ మిషన్ కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1.8 టీఎంసీలతో మంచినీటి ప్రాజెక్టు కడుతోందని, ఈ విషయం తెలియగానే తాము వెంటనే ఏపీపై కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నాగార్జున సాగర్ కింద 21 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని, సాగర్‌లో 320 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఏపీలో 1.8 టీఎంసీలు డ్రా చేయడానికి మంచినీటి ప్రాజెక్టు కట్టుకుంటున్న అంశంపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందన్నారు.

సోనియా గాంధీ లేనిదే తెలంగాణ లేదు

సోనియా గాంధీ రాసిన పుస్తకంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాప్తులను మంత్రి తీవ్రంగా ఖండించారు. సోనియా గాంధీ లేకపోతే అసలు తెలంగాణ రాష్ట్రమే వచ్చేది కాదని స్పష్టం చేశారు. పుస్తకంలో ఉందా లేదా అన్నది కాదని, సోనియా గాంధీ గుండెల్లో తెలంగాణ ఉందని.. ఆ విషయాన్ని స్వయంగా కేసీఆరే గతంలో అసెంబ్లీలో స్పష్టం చేశారని గుర్తుచేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసుకుని 60 ఏళ్లు పూర్తయిందని, నెహ్రూ గురించి మాట్లాడే స్థాయి, బ్రతుకు కేటీఆర్‌కు ఉందా అని ఆయన ధ్వజమెత్తారు.

బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టుల పేరుతో తెలంగాణను తాకట్టు పెట్టారు

బీఆర్ఎస్ పాలనలో కమిషన్ల కక్కుర్తి కోసమే ప్రాజెక్టులు నిర్మించి తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారని ఉత్తమ్ ఆరోపించారు. కేసీఆర్ హయాంలో ఒక్క ఎకరాకు కూడా అదనపు ఆయకట్టుకు నీరు ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో కృష్ణా, గోదావరి జలాలను సమర్థంగా వినియోగించి దేశంలోనే అత్యధికంగా వరి పంట పండించి, కొనుగోలు చేశామని తెలిపారు.

నీటి సంరక్షణకు పక్కా ప్రణాళికలు

ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో నీటిని చాలా జాగ్రత్తగా వాడుతున్నామని, ఎక్కడా క్రాప్ హాలీడే ఇవ్వలేదని మంత్రి స్పష్టం చేశారు. మళ్లీ వర్షాలు కురిసే వరకు తాగునీటికి ఎలాంటి సమస్య రాకుండా పకడ్బందీ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. గతంలో కేసీఆర్ గెలుపు కోసం ఆంధ్రప్రదేశ్‌ నుంచి పోలీసులను సాగర్ ప్రాజెక్టుపైకి జగన్ పంపించారని ఆరోపించారు. తెలంగాణకు న్యాయంగా రావాల్సిన జలాల వాటా కోసం సుప్రీంకోర్టులో గట్టిగా పోరాడుతున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి పునరుద్ఘాటించారు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഇസ്രഈല്‍ അനുകൂല നിലപാടുള്ള ഡെമോക്രാറ്റിക് സ്പീക്കര്‍ നോമിനി: ആരാണ് ഹക്കീം ജെഫ്രീസ്?

വാഷിങ്ടണ്‍ : അമേരിക്കന്‍ ജനപ്രതിനിധി സഭയുടെ സ്പീക്കര്‍ സ്ഥാനത്തേക്ക് ഹക്കീം ജഫ്രീസിനെ...

தமிழ்நாடு முதலீட்டு தகவல்கள் கசிவு: 15 பேரை அதிரடி நீக்கம் செய்த அமைச்சர் கீர்த்தனா?

தமிழ்நாடு அரசின் தொழில் முதலீடுகளை ஈர்க்கும் அமைப்பான 'தமிழ்நாடு வழிகாட்டி' (Guidance...

AP Police: ఏపీ పోలీసుల సంచలన ఆపరేషన్.. మారేడుమిల్లి అడవుల్లో మావోయిస్టు డంప్ స్వాధీనం..

ఆంధ్రప్రదేశ్ పోలీసుల సమర్థవంతమైన చర్యలతో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వామపక్ష...

ടൂറിസ്റ്റ് ബസ്സുകള്‍ക്ക് ഇനി ഇഷ്ടമുള്ള നിറം; ബസുകളുടെ ഏകീകൃത വെള്ളനിറം പിന്‍വലിച്ച് ഹൈക്കോടതി

കൊച്ചി: സംസ്ഥാനത്തെ ടൂറിസ്റ്റ് ബസുകള്‍ക്കുള്ള ഏകീകൃത വെള്ളനിറം പിന്‍വലിച്ചു. മുന്‍ ഉത്തരവ്...