19
November, 2026

A News 365Times Venture

19
Thursday
November, 2026

A News 365Times Venture

Fire Accident: చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో అగ్నిప్రమాదం.. తగలబడిన బోగీలు..

Date:

హైదరాబాద్‌లోని చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్టేషన్ పరిధిలో నిలిపి ఉంచిన ఒక ఖాళీ రైలు బోగీలో ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బోగీ నుంచి దట్టమైన పొగలు, పెద్దఎత్తున మంటలు ఎగిసిపడటంతో పరిసర ప్రాంతాల ప్రజలు, ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.

అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో ఆ ఖాళీ బోగీలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆధునికీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో, ప్రత్యామ్నాయంగా పలు కీలక రైళ్లను చర్లపల్లి టెర్మినల్ నుంచి నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టేషన్ పరిసర ప్రాంతాలు ఎప్పుడూ రద్దీగా ఉంటున్నాయి.

అలాంటి కీలక ప్రాంతంలో నిలిపి ఉంచిన బోగీలో మంటలు చెలరేగడం తీవ్ర కలకలం రేపింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనకు అసలు కారణాలు ఏమిటనే కోణంలో రైల్వే భద్రతా అధికారులు, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బోగీ కాలిపోవడానికి దారితీసిన పరిస్థితులపై సాంకేతిక నిపుణుల బృందం కూడా ఆరా తీస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన భద్రతా చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

IPL 2027: పూర్తయిన రిటెన్షన్ ప్రక్రియ.. ఎవరి పర్సులో ఎంత..? టాప్‌లో LSG..

ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు అన్ని ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల...

സൗദി അറേബ്യയിലേക്കുള്ള വിമാന സര്‍വീസുകള്‍ റദ്ദാക്കി ഇന്‍ഡിഗോ; യാത്രക്കാരുടെയും ജീവനക്കാരുടെയും സുരക്ഷയ്ക്ക് മുന്‍ഗണന

ന്യൂദല്‍ഹി: സുരക്ഷാ സാഹചര്യം കണക്കിലെടുത്ത് സൗദി അറേബ്യയിലെ നാല് പ്രധാന നഗരങ്ങളിലേക്കുള്ള...

திருப்பரங்குன்றம்: அதிரடி வாதங்களும் ஆட்சியர் தரப்பின் தடுமாற்றமும்! – நீதிமன்றத்தில் என்ன நடந்தது?

மதுரை திருப்பரங்குன்றம் மலை உச்சியில் கார்த்திகை தீபம் ஏற்றுவது தொடர்பான வழக்கு...

OTR: కౌశిక్‌పై ఫిర్యాదు.. మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలన్న స్పీకర్!

OTR: తెలంగాణ అసెంబ్లీలో ఎథిక్స్ కమిటీ ఏమైంది..? మొదట్లో వరుస సమావేశాలు...