17
November, 2026

A News 365Times Venture

17
Tuesday
November, 2026

A News 365Times Venture

Koti Deepotsavam 2026 Day 3: అంగరంగ వైభవంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం.. మూడో రోజు విశేషాలివే..

Date:

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా కార్తీక మాస శోభతో అశేష భక్తజన సందోహం మధ్య జరుగుతున్న ‘కోటి దీపోత్సవం – 2026’ ఆధ్యాత్మిక మహోత్సవం మూడో రోజు అత్యంత వైభవంగా ముగిసింది. పవిత్రమైన కార్తీక సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలో భాగంగా వేదికపై శివపరివారానికి కోటి పుష్పార్చన అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో తెలంగాణ గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా దంపతులు ప్రత్యేకంగా పాల్గొని గోసేవ నిర్వహించడంతో పాటు, కోటి లింగేశ్వరుడికి పవిత్ర జలంతో అభిషేకం చేశారు.

ఈ మహోత్సవంలో ప్రధాన ఘట్టంగా భావించే కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దివ్య కల్యాణోత్సవం అత్యంత నేత్రపర్వంగా జరిగింది. ఈ కల్యాణ వేడుకలో మాంగల్య గౌరీ పూజ, జీలకర్ర బెల్లం సమర్పణ తదితర వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారి కల్యాణంలో మాంగళ్య ధారణ ఘట్టం కనులపండువగా సాగింది. ఈ పవిత్ర కార్యక్రమంలో శ్రీమతి జస్టిస్ పెరుగు శ్రీసుధ దంపతులు కూడా పాల్గొని ప్రాంగణంలోని మహాశివలింగానికి అభిషేకం చేశారు.

ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అందించిన ప్రవచనామృతం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. దీపం వెలిగిస్తే ఇల్లు వెలిగినట్లే మన జీవితాల్లోనూ వెలుగులు నిండుతాయని, కార్తీకమాసంలో దీపం వెలిగించేది పరబ్రహ్మ అనుగ్రహం కోసమేనని ఆయన వివరించారు. శివకేశవులు వేరు కాదని, భగవంతుడిని భేదాలతో చూడకూడదని తెలిపారు. కలియుగంలో మనిషి ప్రవర్తన, రామాయణ విశేషాలు, పోతన భాగవతం, తిక్కన వర్ణించిన భగవంతుని అపురూప రూపాల గురించి ఆయన సుందరంగా వివరిస్తూ భక్తులను మంత్రముగ్ధులను చేశారు.

అలాగే, శ్రీ వ్రతాధర రామానుజ జీయర్ మఠం వేదపాఠశాల విద్యార్థుల మంగళకరమైన వేదపఠనం, పర్ణిక బృందం అందించిన భక్తి సంగీత గానామృతం ప్రాంగణాన్ని మార్మోగించాయి. ప్రదోషకాల మహాభిషేకం, కర్ణాటకకు చెందిన శ్రీ శివ యోగీశ్వర సాధు సంస్థానం మఠానికి చెందిన డాక్టర్ శ్రీ శివానంద భారతి మహా స్వామీజీ అనుగ్రహ భాషణం ఈ వేడుకలకు మరింత శోభను తెచ్చాయి. కార్తీక సోమవారం నాడు పరమేశ్వరుడికి ఒక్క పుష్పం సమర్పించినా అనంత కోటి పుణ్యఫలం లభిస్తుందని భక్తులు విశ్వసించగా, ఈ మూడో రోజు కార్యక్రమాలు ఆధ్యాత్మిక శోభతో దిగ్విజయంగా ముగిశాయి.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

യാസര്‍ അറഫാത്തിന്റെ ഉപദേഷ്ടാവ്, നെസെറ്റില്‍ ബാങ്ക് വിളിച്ച അറബ് നേതാവ്; ആരാണ് അഹ്മദ് തിബി?

ഇസ്രഈല്‍ പാര്‍ലമെന്റായ നെസെറ്റില്‍ ഡെപ്യൂട്ടി സ്പീക്കറായി തെരഞ്ഞെടുക്കപ്പെട്ടിരിക്കുകയാണ് അഹ്മദ് തിബി. ഫലസ്തീന്‍...

'சூரசம்ஹார விழாவில் ஆகமவிதிகள் மீறப்பட்டனவா?'- சேகர் பாபுவின் குற்றச்சாட்டிற்கு அமைச்சர் ரமேஷ் பதில்

திருச்செந்தூரில் நடைபெற்ற சூரசம்ஹார விழாவின்போது, ஆகம விதிகள் அதிகப்படியாக மீறப்பட்டிருக்கிறது என்றும்...

പൗരന്മാരുടെ സ്വകാര്യത വിറ്റു; വ്യാജ ഇ-ചലാന്‍ തട്ടിപ്പുകള്‍ക്ക് വഴിതുറന്നത് കേന്ദ്രത്തിന്റെ ഡാറ്റാ ഷെയറിങ് നയം

  ന്യൂദല്‍ഹി: ഈയടുത്തായി വാര്‍ത്തകളില്‍ നിറഞ്ഞ ഇ-ചലാന്‍ തട്ടിപ്പില്‍ കേന്ദ്രസര്‍ക്കാരിന്റെ പങ്ക്...

“காவல் நிலையத்தில் ரீல்ஸ் எடுக்க எந்த சட்டம் அனுமதி அளிக்கிறது?" – அதிமுக எம்பி இன்பதுரை கேள்வி

கூட்டுறவுத்துறை அமைச்சர் காந்திராஜ் தனது அரக்கோணம் தொகுதிக்கு உட்பட்ட தக்கோலம்...