17
November, 2026

A News 365Times Venture

17
Tuesday
November, 2026

A News 365Times Venture

CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు రాహుల్ గాంధీ నాయకత్వంలో ఏకమవుదాం

Date:

హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక ‘భారత్ సమ్మిట్’లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. ఒకే ఆలోచనా ధోరణి కలిగిన ప్రపంచ నాయకులు, ప్రభావశీలురను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఈ సమ్మిట్ ఒక గొప్ప వేదికని ఆయన అభివర్ణించారు. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి రోజున ఈ కార్యక్రమం జరగడం ఎంతో ప్రత్యేకమని పేర్కొంటూ, దేశంలో రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం కావడానికి నెహ్రూ దార్శనికత ఎంతో దోహదపడిందని గుర్తుచేసుకున్నారు.

ప్రతినిధుల వీసాల రద్దుపై కేంద్రంపై విమర్శలు

ఈ సదస్సు కోసం 70 దేశాల నుంచి వెయ్యి మందికి పైగా ప్రతినిధులను ఆహ్వానించామని, అయితే కేంద్ర ప్రభుత్వం వారిలో చాలామందికి వీసాలను రద్దు చేసిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్యవాదులు తమను గమనిస్తూనే ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ప్రజాస్వామ్యం వర్సెస్ నియంతృత్వం.. రెండు శక్తుల మధ్య పోరాటం

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రెండు భిన్నమైన శక్తుల మధ్య పోరాటం జరుగుతోందని సీఎం విశ్లేషించారు. ఒక శక్తి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చూస్తుంటే, మరో శక్తి దాన్ని నాశనం చేసి నియంతృత్వాన్ని రుద్దాలని చూస్తోందని మండిపడ్డారు. తాము రాజ్యాంగం, చట్టబద్ధ పాలన, పర్యావరణ పరిరక్షణ, అందరికీ సమాన అవకాశాల కోసం కట్టుబడి ఉంటే.. ప్రత్యర్థులు మాత్రం కేవలం తమ సంపన్న మిత్రులను కాపాడుకోవడానికి, కొద్దిమంది చేతుల్లోనే అధికారాన్ని కేంద్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తాము చర్చలు, సంప్రదింపులను కోరుకుంటుంటే, వారు ఒకే వ్యక్తి నుంచి ఆదేశాలు రావాలని కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. గొప్ప లక్ష్యం కోసం పోరాడుతున్న తమను ఏ శక్తీ ఆపలేదని స్పష్టం చేశారు.

రాహుల్ గాంధీ నాయకత్వంలో సామాజిక న్యాయం కోసం పోరాటం

ప్రపంచీకరణ, కోవిడ్ తర్వాత అన్ని దేశాల్లోనూ ప్రాథమిక హక్కులపై దాడులు, విద్య, ఉపాధి, వైద్యం, ద్రవ్యోల్బణం వంటి ఒకే రకమైన సమస్యలు ఎదురవుతున్నాయని సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వాలు సంపన్నుల కోసం కాకుండా సామాన్య ప్రజల కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. దేశంలో ప్రతి పౌరుడి ఓటు హక్కు కోసం, దళితులు, మైనారిటీలు, ఓబీసీల సామాజిక న్యాయం కోసం రాహుల్ గాంధీ అలుపెరగని పోరాటం చేస్తున్నారని కొనియాడారు. ఆయన నాయకత్వంలో దేశాన్ని కాపాడుకునేందుకు అందరం చేతులు కలపాలని, 70 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు ఈ ప్రజాస్వామ్య సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

பெண்களைப் பாதுகாக்க வேண்டியவர்களே பாலியல் தொல்லை தந்தால்?

கல்வி, வேலைவாய்ப்பு, பொருளாதாரப் பங்களிப்பு என பெண்கள் இன்று பல்வேறு துறைகளிலும்...

CM Chandrababu: కేంద్ర బృందంతో సీఎం చంద్రబాబు వర్చువల్ భేటీ.. తక్షణ సాయానికి విజ్ఞప్తి..

మురసు తుఫాన్ నష్టాన్ని అంచనా వేయడానికి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించిన కేంద్ర బృందం...

അജിത് പവാറിന്റെ മരണം; വിമാനം ഓപ്പറേറ്റ് ചെയ്ത കമ്പനിയുടെ ഉടമയെ ഫട്‌നാവിസ് സംരക്ഷിക്കുന്നു: രോഹിത് പവാര്‍

മുംബൈ: മഹാരാഷ്ട്ര മുന്‍ ഉപമുഖ്യമന്ത്രി അജിത് പവാര്‍ അപകടത്തില്‍ മരിക്കാനിടയായ വിമാനം...

சாட்ஜிபிடி மூலம் புத்தகங்கள்; ஒரே நாளில் ISBN பெற்ற நூல்கள், அதே நாளில் ஒப்புதல்! – FIR முழு விவரம்!

தமிழ்நாடு பொது நூலக இயக்ககம் மற்றும் கோவை பெரியார் அறிவுலகம் உள்ளிட்ட...