15
November, 2026

A News 365Times Venture

15
Sunday
November, 2026

A News 365Times Venture

Koti Deepotsavam 2026 Day-1 : కన్నుల పండువగా ముక్తీశ్వర స్వామి కల్యాణం.. కోటి దీపోత్సవంలో తొలి రోజు ప్రత్యేకతలు

Date:

కార్తీక మాసపు పవిత్రతను నలుదిశలా చాటుతూ ఎన్టీవీ, భక్తి టీవీ, వనితా టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా నిర్వహించే అతిపెద్ద ఆధ్యాత్మిక మహోత్సవం ‘కోటి దీపోత్సవం-2026’ శనివారం (నవంబర్ 14) నాడు అత్యంత వైభవంగా ప్రారంభమైంది. కార్తీక శుద్ధ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని జరిగిన మొదటి రోజు వేడుకలకు వేలాదిగా భక్తులు తరలిరావడంతో ప్రాంగణమంతా శివనామస్మరణలతో మార్మోగింది. కైలాసాన్ని తలపించే సభావేదికపై సాగిన విశేష పూజలు, కల్యాణోత్సవం, వాహన సేవ భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తాయి.

అష్టోత్తర శత శంఖాభిషేకం.. భక్తులచే కోటి మల్లెల అర్చన

తొలిరోజు వేడుకల్లో భాగంగా వేదికపై కాశీ స్పటికలింగానికి అష్టోత్తర శత శంఖాభిషేకం, కోటి మల్లెల అర్చన అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహించారు. అదే సమయంలో ప్రాంగణానికి విచ్చేసిన భక్తులందరూ స్వయంగా ఆచరించి తరించేలా శివలింగాలకు ‘కోటి మల్లెల అర్చన’ జరిపించారు. మల్లెపూల సుగంధాల మధ్య, వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ భక్తులంతా ఏకకాలంలో చేసిన ఈ విశేష పూజ కనులపండువగా సాగింది.

వైభవోపేతంగా కాళేశ్వరం శ్రీ ముక్తీశ్వర స్వామి కల్యాణం.. హంస వాహన సేవ.!

మొదటి రోజు వేడుకల్లో అత్యంత ప్రధాన ఘట్టమైన ‘కాళేశ్వరం శ్రీ ముక్తీశ్వర స్వామి కల్యాణోత్సవం’ అంగరంగ వైభవంగా జరిగింది. అపమృత్యు దోషాలను హరించే ఆ దివ్య కల్యాణాన్ని కళ్లారా వీక్షించి భక్తులు తరించారు. కల్యాణోత్సవం అనంతరం స్వామివారికి అత్యంత విశిష్టమైన ‘హంస వాహన సేవ’ నిర్వహించారు. హంస వాహనంపై కొలువుదీరిన ఉత్సవమూర్తులను దర్శించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు.

పీఠాధిపతుల అనుగ్రహ భాషణం.. ప్రవచనామృతం

ఈ మహా యజ్ఞానికి పుష్పగిరి మహాసంస్థానం పీఠాధిపతి పూజ్యశ్రీ విద్యాశంకరభారతి మహాస్వామీజీ విచ్చేసి భక్తులకు తమ దివ్య అనుగ్రహ భాషణాన్ని అందించారు. అలాగే ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ నోరి నారాయణ మూర్తి గారి ప్రవచనామృతం భక్తులకు జ్ఞానబోధ చేస్తూ ఆకట్టుకుంది. అనంతరం లక్షలాది దీపపు కాంతుల నడుమ సాగిన మహా నీరాజనం, స్వర్ణలింగోద్భవం, సప్త హారతులతో కోటి దీపోత్సవం తొలిరోజు వేడుకలు అద్భుతంగా ముగిశాయి.

ఆధ్యాత్మిక శక్తితోనే భారత్ మరింత ఉన్నత స్థితికి: జస్టిస్ సూరేపల్లి నంద

ఈ మహా ఆధ్యాత్మిక వేడుకలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నంద ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మానవ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి ఆధ్యాత్మికత ఎంతగానో దోహదపడుతుందని వివరించిన ఆమె, మన సంస్కృతిలో సత్యానికి ఉన్న ప్రాముఖ్యతను, భారతీయులుగా మనం అనుసరించాల్సిన నైతిక విలువలను గుర్తుచేశారు. మనం చేసే పనిని దైవకార్యంగా భావించాలని, భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన విధంగా అంకితభావంతో, నిష్కామ కర్మతో పనిచేయాలని సూచించారు. వ్యక్తిగత అభివృద్ధితో పాటు సమాజంలో శాంతి, ఐక్యత, తోటివారి పట్ల కరుణ కలిగి ఉండటం కూడా అసలైన ఆధ్యాత్మికతలో భాగమేనని జస్టిస్ నంద పేర్కొన్నారు.  ఇంతటి మహోన్నత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శ్రీ నరేంద్ర చౌదరి గారికి తో పాటు వారి కుటుంబానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ.. ఆధ్యాత్మిక శక్తితోనే భారతదేశం మరింత ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని ఆమె తన ప్రసంగాన్ని ముగించారు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

"Online டெண்டர் வேண்டாம் என்பது சட்டவிரோதம்"- ஊழியர் சங்கம்; என்ன நடக்கிறது ஊரக வளர்ச்சித் துறையில்?

அரசுப் பணிகளுக்கு டெண்டர் விடும்போது நடக்கும் முறைகேடுகளைத் தடுக்க ஆன் லைனில்...

വായുമലിനീകരണത്തിന് സംസ്ഥാന അതിര്‍ത്തികളില്ല: ഏകോപിതമായി നിയന്ത്രിക്കണമെന്ന് കേന്ദ്ര പരിസ്ഥിതി മന്ത്രി

ന്യൂദല്‍ഹി: വായുമലിനീകരണത്തിന് സംസ്ഥാന അതിര്‍ത്തികളില്ലെന്നും ദല്‍ഹി ദേശീയ തലസ്ഥാന മേഖലയില്‍ (എന്‍.സി.ആര്‍)...

மதுரை நகைக்கடை கொள்ளை வழக்கு: Instagram Influencer-ஆன இளம்பெண் கைது செய்யப்பட காரணம் என்ன?

மதுரை பைபாஸ் சாலையில் உள்ள பிரபல தனிஷ்க் ஜூவல்லர்ஸ் நகைக்கடையில் 15...