14
November, 2026

A News 365Times Venture

14
Saturday
November, 2026

A News 365Times Venture

Rasgulla bomb: రసగుల్లా అని నోట్లో పెట్టుకుని కొరికాడు.. బాంబు పేలి వ్యక్తి మృతి..

Date:

Rasgulla bomb: మధ్యప్రదేశ్‌లోని డొండోరి జిల్లాలో విషాదకర సంఘటన జరిగింది. రసగుల్లా రూపంలో ఉన్న బాంబును కొరకడంతో ఒక వ్యక్తి మరణించాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన 35 ఏళ్ల రాజేంద్ర బరోటియా చికిత్స పొందుతూ మరణించారు. మంగళవారం రాత్రి పదారియా ఛంతా గ్రామంలో ఈ ఘటన జరిగింది. రాజేంద్ర కుటుంబ సభ్యులతో రాత్రి వేళ భోజనం ముగించుకుని, ఇంటి ముందు చలిమంట వద్ద కూర్చున్నాడు. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన రామభగత్ బరోటియా అక్కడికి వచ్చాడు. రాజేంద్రకు పందుల వేటకు ఉపయోగించే బాంబును రసగుల్లా అని నమ్మించి ఇచ్చాడు. దానిని నోట్లో పెట్టుకుని కొరికిన వెంటనే పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి రాజేంద్ర ముఖం ఛిద్రమైంది. తీవ్రగాయాలతో అతను మరణించారు.

ఈ ఘటనపై డిండోరి కోత్వాలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రామభగత్ బరోటియాపై కేసు మర్డర్ కేసు నమోదు చేశారు. బుధవారం రాజేంద్ర మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. సాధారణంగా సాగిన సాయంత్రపు సంభాషణ చివరకు ప్రాణాలు తీసిన ఘటనగా మారడంతో గ్రామస్థులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഫ്രഞ്ച് ഇടതുപക്ഷ നേതാവിന് ഇസ്രഈലിന്റെ പ്രവേശന വിലക്ക്; അപലപിച്ച് ഫ്രഞ്ച് വിദേശകാര്യ മന്ത്രി

പാരീസ്: ഫ്രഞ്ച് ഇടതുപക്ഷ പാര്‍ട്ടിയായ ഫ്രാന്‍സ് അണ്‍ബൗണ്ടിന്റെ നേതാവ് ജീന്‍-ലൂക്ക് മെലന്‍ഷോണിന്...

"ஒரே நாளில் ஆந்திராவில் ரூ.5.35 லட்சம் கோடி மதிப்பிலான MoU; தவறவிட்ட தமிழ்நாடு?" – TRB ராஜா

ஒரே நாளில், ஆந்திரப் பிரதேசத்தின் ரூ.5.35 லட்சம் கோடி முதலீட்டிற்கான புரிந்துணர்வு...

Civils Candidates: సివిల్స్ ఇంటర్వ్యూ అభ్యర్థులకు రూ.లక్ష ప్రోత్సాహకం.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన..

తెలంగాణ యువత సివిల్ సర్వీసెస్‌లో అత్యధిక సంఖ్యలో విజయం సాధించాలనే లక్ష్యంతో...

വായുമലിനീകരണം നമ്മളെ സൂര്യ രശ്മികളില്‍ നിന്ന് രക്ഷിക്കുന്നു: ന്യായീകരണവുമായി ഗോദി മീഡിയ

ന്യൂദല്‍ഹി: ദല്‍ഹിയിലും സമീപ സംസ്ഥാനങ്ങളിലും വായു മലിനീകരണം വര്‍ധിക്കുന്നതിനെ ന്യായീകരിക്കുന്ന ഗോദി...