12
November, 2026

A News 365Times Venture

12
Thursday
November, 2026

A News 365Times Venture

Under -19 Asia Cup: ఆసియా కప్ 2026.. సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా..

Date:

ఏసీసీ మెన్స్ అండర్-19 ఆసియా కప్ 2026 టోర్నమెంట్‌లో భాగంగా యూఏఈతో జరిగిన కీలక మ్యాచ్‌లో భారత్ అండర్-19 జట్టు అద్భుత విజయం సాధించింది. ఆర్యవీర్ సెహ్వాగ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగడంతో, భారత్ 70 పరుగుల తేడాతో యూఏఈని ఓడించి సెమీఫైనల్స్‌లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 309 పరుగుల స్కోర్ సాధించింది.

ఇన్నింగ్స్ ప్రారంభంలో కెప్టెన్ లక్ష్య రాజేష్ రాయ్‌చందాని 17 పరుగులు చేసి ఔట్ అయినప్పటికీ, ఆర్యవీర్ సెహ్వాగ్ క్రీజులో నిలదొక్కుకుని అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి తోడుగా వి.కె. వినీత్ అద్భుతంగా రాణించాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు ఏకంగా 193 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు బలమైన ఆధిక్యాన్ని అందించారు. ఆర్యవీర్ సెహ్వాగ్ కేవలం 160 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. అతని ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, 7 భారీ సిక్సర్లు ఉన్నాయి. అలాగే వినీత్ 67 పరుగులు చేసి మంచి సహకారం అందించాడు. వీరిద్దరినీ యూఏఈ బౌలర్ నశీమ్ ఖాన్ పెవిలియన్‌కు చేర్చాడు. చివర్లో యశ్‌వర్ధన్ చౌహాన్ 17 పరుగులు, అన్వయ్ ద్రావిడ్ 12 పరుగులు చేయడంతో భారత్ 309 పరుగుల స్కోర్ సాధించింది.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 239 పరుగులకు కుప్పకూలింది. యూఏఈ బ్యాటర్లలో అహ్మద్ ఖుదాదాద్ 74 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. నూర్‌ఉల్లా అయోబీ 39 పరుగులు, యాపిన్ రాయ్ 29 పరుగులు, కెప్టెన్ అయాన్ మిస్బా 27 పరుగులు చేసినప్పటికీ, భారత బౌలర్ల దాటికి లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. భారత బౌలర్లలో ఇషాన్ సూద్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు పడగొట్టాడు. మిగతా బౌలర్లు కూడా రాణించడంతో యూఏఈ ఇన్నింగ్స్ ముగిసింది. ఈ విజయంతో భారత్ ఆసియా కప్ సెమీఫైనల్‌లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

സര്‍വകലാശാലകളെ കാവിവത്കരിക്കാന്‍ ബി.ജെ.പി ഗവര്‍ണറെ ഉപയോഗിക്കുന്നു; ആര്‍.എസ്.എസിന് സര്‍ക്കാര്‍ കൂട്ടെന്ന് പി.എസ്. സഞ്ജീവ്

തിരുവനന്തപുരം: കേരളത്തിലെ സര്‍വകലാശാലകളെ കാവിവത്കരിക്കാന്‍ ബി.ജെ.പി ഗവര്‍ണറെ ഉപയോഗിക്കുകയാണെന്ന് എസ്.എഫ്.ഐ സംസ്ഥാന...

"என்றைக்காவது ஒருநாள் தமிழகத்தில் காமராஜர் ஆட்சியைக் கொண்டு வரணும்" – திருநாவுக்கரசர் நம்பிக்கை

புதுக்கோட்டையில் கட்சி நிகழ்ச்சி ஒன்றில் கலந்துகொண்டு பேசிய காங்கிரஸ் மூத்த தலைவர்...

Team India Squad: నవంబర్ 30 నుంచి ఇంగ్లాండ్‌తో సమరం.. జట్టు ప్రకటన..

ఇంగ్లాండ్ ‘ఏ’ మహిళా జట్టుతో జరగనున్న సిరీస్ కోసం భారత సెలక్టర్లు...

ഹെഗ്സെത്തിന്റെ ഇംപീച്ച്മെന്റ് നീക്കം അട്ടിമറിച്ചത് 11 ഡെമോക്രാറ്റുകള്‍; പണം വാങ്ങി മുങ്ങിയതോ?

തെരഞ്ഞെടുപ്പ് ഫണ്ടിങ്ങും അമേരിക്കന്‍ രാഷ്ട്രീയത്തിലെ ലോബിയിങ് സ്വാധീനവും വീണ്ടും ചര്‍ച്ചയാകുമ്പോള്‍, ഹെഗ്സെത്തിന്റെ...