11
November, 2026

A News 365Times Venture

11
Wednesday
November, 2026

A News 365Times Venture

AP Cabinet Meeting: మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్? రేపటి కేబినెట్ భేటీపై ఉత్కంఠ

Date:

AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రేపు అనగా నవంబర్ 10వ తేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఉదయం 10:30 గంటలకు సచివాలయంలో ఈ భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎస్‌ఐపీబీ (SIPB) ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే విశాఖపట్నంలో నిర్వహించనున్న పార్టనర్‌షిప్ సమ్మిట్‌పై మంత్రివర్గ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించనున్నారు. ఈ సదస్సును విజయవంతం చేసేందుకు మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. సదస్సు నిర్వహణ, పెట్టుబడుల ఆకర్షణ, వివిధ శాఖల సమన్వయంపై మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు.

మరోవైపు.. కేబినెట్ అజెండాలోని అంశాలపై చర్చ పూర్తయిన తర్వాత రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల పరిస్థితులపై ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణ, పార్టీ విజయావకాశాలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై మంత్రులతో చంద్రబాబు సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. కొంతమంది మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి క్లాస్ తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు సమర్థంగా పనిచేస్తున్న కొందరు మంత్రులను చంద్రబాబు అభినందించే అవకాశం కూడా ఉందని సమాచారం. దీంతో రేపటి కేబినెట్ సమావేశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మరి కేబినెట్‌ భేటీలో ఎలాంటి చర్చ జరుగుతుంది.. ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది..

 

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

സമ്പുഷ്ടീകരിച്ച യുറേനിയം മാറ്റില്ല; ആണവ പദ്ധതിയുമായി ബന്ധപ്പെട്ട ചര്‍ച്ചകളില്‍ വിട്ടുവീഴ്ച്ചയില്ലെന്ന് ഇറാന്‍

ടെഹ്റാന്‍: രാജ്യത്തുള്ള സമ്പുഷ്ടീകരിച്ച യുറേനിയം വിദേശത്തേക്ക് മാറ്റണമെന്ന നിര്‍ദേശം തള്ളി ഇറാന്‍....

'அட்டாக் பரந்தாமன்' லைப்ரரி மேட்டரை விட்றாதீங்க! – தவெக செய்தித் தொடர்பாளர்களுக்கு புது அசைன்மெண்ட்!

சென்னை தி.நகரில் உள்ள அமைச்சர் ஆதவ் அர்ஜூனாவின் 'வாய்ஸ் ஆப் காமன்'...

ഇസ്രഈലിന്റെ നിയന്ത്രണങ്ങള്‍: ഗസയില്‍ അഞ്ച് ലക്ഷം കുട്ടികള്‍ സുരക്ഷിതമായ പാര്‍പ്പിടമില്ലാതെ കഴിയുന്നു: സേവ് ദി ചില്‍ഡ്രന്‍

ഗസ സിറ്റി: ഗസയില്‍ അഞ്ച് ലക്ഷത്തിലധികം കുട്ടികള്‍ സുരക്ഷിതമായ പാര്‍പ്പിടമില്ലാതെ കഴിയുകയാണെന്ന്...