1
November, 2026

A News 365Times Venture

1
Sunday
November, 2026

A News 365Times Venture

Ilhan Omar: సోదరుడితో పెళ్లి ఆరోపణలు.. అమెరికా ఎంపీ ఇల్హాన్ ఒమర్‌పై విచారణ!

Date:

Ilhan Omar: అమెరికా డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఎంపీ ఇల్హాన్ ఒమర్ చిక్కుల్లో పడింది. వివాదాలకు కేరాఫ్‌గా ఉండే ఒమర్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో ఆమెపై వచ్చని నకిలీ వివాహం ఆరోపణలను ఫెడరల్ దర్యాప్తు సంస్థలు మరోసారి దర్యాప్తు చేయబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ వ్యవహారంలో విచారణ జరిగినప్పటికీ, చట్టపరమైన గడువు ముగియడంతో అప్పట్లో తీవ్రమైన క్రిమినల్ అభియోగాలు నమోదు కాలేదు.

సొంత సోదరుడితో వివాహం..?

సోమాలియా మూలాలు ఉన్న ఇల్హాన్ ఒమర్ తన సోదరుడిగా చెప్పబడుతున్న అహ్మద్ నూర్ సయీద్ ఎల్మీని పెళ్లి చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆమె అమెరికా పౌరసత్వం, గ్రీన్ కార్డ్ పొందేందుకు వీలుగా ఈ వివాహం చేసుకున్నారనేది ప్రధాన ఆరోపణ. అయితే, ఈ ఆరోపణల్ని ఒమర్ చాలా సందర్భాల్లో ఖండించారు.

ఈ వివాదంపై 2016లో బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో విచారణ జరిగింది. అప్పటి దర్యాప్తులో అనుమానాస్పద అంశాలు వెలుగులోకి వచ్చినట్లు ఆరోపణలు ఉన్నప్పటికీ, ఐదేళ్ల చట్టపరమైన గడువు ముగియడంతో తీవ్రమైన క్రిమినల్ అభియోగాలు నమోదు చేయలేకపోయారు. ఇప్పుడు ఇదే ఆరోపణలపై, సంబంధిత పత్రాలపై మరోసారి దర్యాప్తు జరుగుతోంది.

ఇల్హాన్ ఒమర్ ఇంట్లో తనిఖీలు..

ఇటీవల హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్ అధికారులు వాషింగ్టన్‌ డీసీలోని ఇల్హాన్ ఒమర్ నివాసంలో తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆమె లేదా ఆమె తండ్రి అమెరికా పౌరసత్వానికి సంబంధించిన పత్రాల్లో తప్పుడు సమాచారం ఇచ్చారా? అనే అంశంపై అధికారులు విచారణ చేస్తున్నారు.

అమెరికా సరిహద్దు వ్యవహారాల అధికారి టామ్ హోమన్ చెబుతున్న దాని ప్రకారం.. ఆరోపణలు నిరూపితమైతే ఇల్హాన్ ఒమర్ పౌరసత్వంపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇల్హాన్ ఒమర్ ఆర్థిక వివరాలు, ఆమె భర్త వ్యాపారాలపై వేర్వేరు విచారణలు జరుగుతున్నాయి. వాషింగ్టన్‌లోని ఉన్నత స్థాయి ఫెడరల్ ప్రాసిక్యూటర్ ఈ అంశాలపై విచారణ జరుగుతున్నట్లు ధ్రువీకరించినట్లు తెలుస్తోంది.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഇന്ത്യയുടെ ‘പ്രോക്‌സി വാര്‍’ അവസാനിപ്പിക്കുക: ഇംഫാലില്‍ വന്‍ മാര്‍ച്ച്

  ഇംഫാല്‍: മണിപ്പൂരില്‍ ഇന്ത്യ ഗവണ്‍മെന്റിന്റെ പ്രോക്‌സി യുദ്ധം അവസാനിപ്പിക്കണമെന്നും കുക്കി-സോ...

చేవెళ్ల ఫామ్‌హౌస్‌లో విద్యార్థుల పార్టీపై పోలీసుల ఆకస్మిక దాడి.. భారీగా మద్యం పట్టివేత!

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలో కలకలం రేగింది. కమ్మెట గ్రామ...

അമേരിക്ക-ഇസ്രഈല്‍ ഭീഷണിക്ക് ഉടന്‍ തിരിച്ചടി; ഇറാന്‍ സായുധസേനയ്ക്ക് ഉത്തരവിട്ട് ഖാംനഇ

ടെഹ്റാന്‍: അമേരിക്കയുടെയും ഇസ്രഈലിന്റെയും ഭാഗത്തുനിന്ന് ഏത് തരത്തിലുള്ള ഭീഷണിയുണ്ടായാലും ഭൂമിശാസ്ത്രപരമായ പരിധികളില്ലാതെ...