30
October, 2026

A News 365Times Venture

30
Friday
October, 2026

A News 365Times Venture

MEA: పశ్చిమాసియా ఘర్షణల్లో 22 మంది భారతీయులు మృతి..

Date:

MEA: పశ్చిమాసియాలో జరుగుతున్న అమెరికా-ఇరాన్, సౌదీ అరేబియా-హౌతీల ఘర్షణల్లో ఇప్పటి వరకు 22 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) వెల్లడించింది. మృతుల్లో 14 మంది నావికులు ఉన్నారని తెలిపింది. మిడిల్ ఈస్ట్‌లో ఘర్షణలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గల్ఫ్ ప్రాంతంలో భారతీయుల భద్రత, సంక్షేమం కోసం వారితో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పింది.

విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పశ్చిమాసియా ఘర్షణల్లో 14 మంది నావికులతో సహా 22 మందిని భారతీయులను కోల్పోయామని అన్నారు. సౌదీ అరేబియాలో ముగ్గురు భారతీయులు చనిపోయినట్లు జైస్వాల్ వెల్లడించారు.

ఫిబ్రవరి నుంచి మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులు చేసిన తర్వాత ఈ ఘర్షణలు ప్రారంభయ్యాయి. ఈ యుద్ధం ఒక్క ఇరాన్‌కు మాత్రమే కాకుండా ఇతర దేశాలకు వ్యాపించింది. తనపై దాడులకు ప్రతిగా సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రైయిన్, కువైట్, ఖతార్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడి చేస్తూ వస్తోంది. ఇక హార్ముజ్ జలసంధిలో ప్రయాణించే నౌకలపై ఇటు అమెరికా, అటు ఇరాన్ కూడా దాడులు చేశాయి. ఇదిలా ఉంటే, ఇప్పుడు సౌదీ అరేబియా, యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల మధ్య ఘర్షణ తీవ్రం అవుతోంది. హౌతీలు సౌదీ ఆయిల్ రిఫైనరీలు, ఎయిర్ పోర్టులపై దాడులు చేస్తున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

വാരണാസിയിലെ തോല്‍വിയെക്കുറിച്ച് മോദി മിണ്ടാത്തതെന്ത്? ബി.ജെ.പിയെ പരിഹസിച്ച് ജോണ്‍ ബ്രിട്ടാസ്

തിരുവനന്തപുരം: ബാലറ്റ് പേപ്പറില്‍ നടന്ന എം.എല്‍.സി. തെരഞ്ഞെടുപ്പിലെ വിജയത്തില്‍ ഊറ്റംകൊള്ളുന്ന പ്രധാനമന്ത്രി...

`மின்வெட்டால் மீனாட்சி அம்மனிடம் நிம்மதியாக பிரார்த்தனைகூட செய்ய முடியாது'- எடப்பாடி பழனிசாமி வேதனை

முத்துராமலிங்க தேவரின் குருபூஜையை முன்னிட்டு மதுரைக்கு வந்திருந்த முன்னாள் முதல்வர் எடப்பாடி...

ഇസ്രഈല്‍ തെരഞ്ഞെടുപ്പ് ഫലസ്തീന്‍ പൗരന്മാര്‍ ‘മോഷ്ടിച്ചു’ എന്ന് നെതന്യാഹുവിന്റെ ലിക്കുഡ് പാര്‍ട്ടി

ടെല്‍ അവീവ്: ഇസ്രഈല്‍ തെരഞ്ഞെടുപ്പ് ഫലസ്തീന്‍ പൗരന്മാര്‍ ‘മോഷ്ടിച്ചു’ എന്ന ആരോപണവുമായി...

`ரூ.5,000 கோடி நிதி மோசடி செய்த பிரேம் குமாருக்கும் முதல்வருக்கும் என்ன தொடர்பு?' – உதயநிதி கேள்வி!

ரூ.5,000 கோடி நிதி மோசடி செய்த பிரேம் குமாருக்கும் முதல்வருக்கும் என்ன...