26
October, 2026

A News 365Times Venture

26
Monday
October, 2026

A News 365Times Venture

PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!

Date:

PAK vs ENG: లాహోర్ వేదికగా జరిగిన వన్డే ట్రై-సిరీస్ మ్యాచ్‌లో పాకిస్తాన్ థ్రిల్లింగ్ విజయాన్ని అందుకుంది. పరాజయం ఖాయమనుకున్న దశలో ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ (96 బంతుల్లో 113 నాటౌట్) వీరోచిత పోరాటంతో జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. ఇంగ్లాండ్ నిర్దేశించిన 242 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ మరో 17 బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆఖరి వికెట్‌కు హారిస్ రవూఫ్‌తో కలిసి పాక్‌కు 1 వికెట్ తేడాతో చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 46.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ బెన్ డకెట్ (105 బంతుల్లో 111 పరుగులు, 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో రాణించాడు. మిడిలార్డర్‌లో సామ్ కరన్ (42), ఆఖర్లో గస్ అట్కిన్సన్ (36 నాటౌట్) విలువైన పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ ఓ మాదిరి స్కోర్ చేయగలిగింది. పాకిస్తాన్ బౌలర్లలో కెప్టెన్ షాహీన్ షా అఫ్రిది 4 వికెట్లు.. రజావుల్లా, అరాఫత్ మిన్హాస్ చెరో రెండు వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు.

242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌కు ఆదిలోనే తీవ్ర షాక్ ఎదురైంది. ఫఖర్ జమాన్ (10), సైమ్ అయూబ్ (6), బాబర్ ఆజమ్ (10) స్వల్ప స్కోర్లకే వెనుదిరగడంతో జట్టు 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత సాద్ బేగ్ (32), సల్మాన్ అఘా (26) కాసేపు నిలిచినా.. ఇంగ్లాండ్ బౌలర్ జేమీ ఓవర్టన్ 3 వికెట్లు, లియామ్ డాసన్, గస్ అట్కిన్సన్ ధాటికి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. చివరకు 33.5 ఓవర్లలో 154 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి ఘోర పరాజయం అంచున నిలిచింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా వెరవని షాదాబ్ ఖాన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 13 ఫోర్లు, 5 భారీ సిక్సర్ల సాయంతో 96 బంతుల్లోనే 113 పరుగులు చేసి మ్యాచ్‌ను ఒంటిచేత్తో మలుపు తిప్పాడు. పదో వికెట్‌కు టెయిలెండర్ హారిస్ రవూఫ్ (7 నాటౌట్) అందించిన సహకారంతో ఏకంగా 89 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పి పాక్‌ను విజయతీరాలకు చేర్చాడు. దీంతో దాదాపు చేజారిపోయిందనుకున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ అనూహ్య విజయాన్ని నమోదు చేసుకుంది.

ఇంగ్లాండ్ బౌలర్లలో జేమీ ఓవర్టన్ 3 వికెట్లు.. లియామ్ డాసన్, గస్ అట్కిన్సన్ 2 వికెట్లు తీసుకోగా, విల్ జాక్స్, హెన్రీ క్రోకోంబ్ లు తలో వికెట్ సాధించారు. ఇక ఇంగ్లాండ్ విషయానికి వస్తే.. గత మ్యాచ్ లో శ్రీలంకపై 400+ పరుగులు చేసినా కూడా ఓడిపోయింది. ఇప్పుడు పాకిస్థాన్ ను కూడా అదుపుచేయలేక మరో ఓటమిని తన ఖాతాలో వేసుకుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ബ്രസീല്‍ ചുവന്ന് തന്നെ, ലുല തുടരും: നാലാം തവണയും പ്രസിഡന്റ് സ്ഥാനത്തേക്ക്

റിയോ ഡി ജറീറോ: ബ്രസീല്‍ പ്രസിഡന്റ് തെരഞ്ഞെടുപ്പില്‍ ചരിത്ര വിജയം സ്വന്തമാക്കി...

റാസ്‌കലുകള്‍ക്ക് മാത്രമാണ് മതം വേണ്ടത്: പ്രധാനമന്ത്രിയുടെ എ.ഐ സംഭാഷണത്തിന് പിന്നാലെ സ്വാമി ചിന്മയാനന്ദയുടെ പഴയ വീഡിയോ വൈറലാകുന്നു

ന്യൂദല്‍ഹി: ന്യൂദല്‍ഹിയില്‍ ചിന്മയ അമൃത് മഹോത്സവത്തില്‍ പങ്കെടുത്ത പ്രധാനമന്ത്രി നരേന്ദ്ര മോദി...

"குழந்தைகளை வைத்து, ஓட்டு வாங்கி ஆட்சிக்கு வந்த விஜய் மாமா எங்கே போனார்?" – கனிமொழி கேள்வி

தமிழ்நாட்டில் கடந்த சில நாள்களாக குழந்தைகளுக்கு எதிரான குற்றங்கள் அதிகரிப்பதைச் சுட்டிக்காட்டி...