26
October, 2026

A News 365Times Venture

26
Monday
October, 2026

A News 365Times Venture

Kolhapur Gold Theft: మామ ఇంట్లో బంగారం చోరీ చేసి థార్ కొనుగోలు.. కారు పూజకు మామే చీఫ్ గెస్ట్!

Date:

Kolhapur Gold Theft: మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా ఓ దొంగతనం వైరల్‌గా మారింది. మామ ఇంట్లో దొంగిలించిన నగలుతో కారు కొనుగోలు చేసి, ఆ కారు పూజకు మామనే ఆహ్వానించి షాక్ ఇచ్చాడు ఓ యువకుడు. కొల్హాపూర్ జిల్లా సాత్వే గ్రామంలో సమర్ పోపట్ చవాన్ అనే 19 ఏళ్ల యువకుడు తన మామ ఉమేష్ మారుతి చవాన్ ఇంటి నుంచి 15 తులాల బంగారు ఆభరణాలను దొంగిలించాడు. వాటిని స్థానిక బంగారు ఆభరణాల వ్యాపారి సంగ్రామ్ బాబాసో మోరే సహాయంతో రూ. 10 లక్షలకు విక్రయించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

వచ్చిన డబ్బులో మహీంద్రా థార్ కారును కొనుగోలు చేశాడు. ఈ కారు పూజా కార్యక్రమాన్ని తన మామనే ఆహ్వానించాడు. కొత్త కారు పూజకు వెళ్లిన ఉమేష్, ఆ తర్వాత బంగారు ఆభరణాల కోసం వెతకగా అవి కనిపించలేదు. తన భార్యకు చెందిన నగలు పోయాయని గుర్తించిన ఉమేష్, అమ్మమ్మ ఆభరణాలు మాత్రం అలాగే ఉన్నాయని గుర్తించారు. దీంతో కుటుంబానికి పరిచయం ఉన్న వ్యక్తి ఈ దొంగతనానికి పాల్పడినట్లు అనుమానించాడు.

దీంతో ఉమేష్ కొడోలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు సమయంలో సమర్ ఖరీదైన కారు కొనుగోలు చేయడంతో అనుమానం వ్యక్తమైంది. కొత్తగా ఇంత పెద్ద కారు కొనుగోలు చేయడానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే అనుమానంతో విచారించగా సమర్ నేరాన్ని అంగీకరించాడు. ఈ కేసుతో సమర్ చవాన్‌తో పాటు ఆభరణాల వ్యాపారి సంగ్రామ్ మోరేను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

റാസ്‌കലുകള്‍ക്ക് മാത്രമാണ് മതം വേണ്ടത്: പ്രധാനമന്ത്രിയുടെ എ.ഐ സംഭാഷണത്തിന് പിന്നാലെ സ്വാമി ചിന്മയാനന്ദയുടെ പഴയ വീഡിയോ വൈറലാകുന്നു

ന്യൂദല്‍ഹി: ന്യൂദല്‍ഹിയില്‍ ചിന്മയ അമൃത് മഹോത്സവത്തില്‍ പങ്കെടുത്ത പ്രധാനമന്ത്രി നരേന്ദ്ര മോദി...

"குழந்தைகளை வைத்து, ஓட்டு வாங்கி ஆட்சிக்கு வந்த விஜய் மாமா எங்கே போனார்?" – கனிமொழி கேள்வி

தமிழ்நாட்டில் கடந்த சில நாள்களாக குழந்தைகளுக்கு எதிரான குற்றங்கள் அதிகரிப்பதைச் சுட்டிக்காட்டி...

പുതിയ വഖഫ് ബോര്‍ഡില്‍ അമുസ്‌ലിം അംഗങ്ങള്‍ വേണം: സുരേഷ് ഗോപി ഉള്‍പ്പെടെയുള്ളവരുടെ പേരുകള്‍ നല്‍കി ക്രൈസ്തവസംഘടന

കൊച്ചി: സംസ്ഥാന വഖഫ് ബോര്‍ഡിലേക്ക് അമുസ്‌ലിം അംഗങ്ങളെ നിര്‍ദേശിച്ച് ഹൈക്കോടതിയില്‍ ഹരജി...

ரயில் பயணத்தில் மரணம்; ரயில்வே-யின் அலட்சியத்தால் உயிரிழந்தவருடன் 12 மணி நேரம் பயணித்த பயணிகள்

மேற்கு வங்கத்தைச் சேர்ந்த புற்றுநோயாளி பினோத் பஸ்வான் என்பவர் மும்பையில் உள்ள...