Kiren Rijiju: కేంద్రమంత్రి కిరెన్ రిజిజు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై ప్రశంసలు కురిపించారు. ఓవైసీ ముస్లిం-కేంద్రీకృత విధానాలను వ్యతిరేకిస్తున్నప్పటికీ, భారతదేశ జాతీయ ప్రయోజనాల విషయంలో ఆయన చాలా హేతుబద్ధంగా మాట్లాడుతారని రిజిజు అన్నారు. ప్రతిపక్ష నేతలు ఓవైసీని చూసి నేర్చుకోవాలని, ఇప్పుడు ‘‘భారత వ్యతిరేఖ ముఠా ఎవరో అర్థమైంది’’ అని సోషల్ మీడియాలో రిజిజు పోస్ట్ పెట్టారు.
ఇటీవల, ఎలాన్ మస్క్ భారత్లో స్టార్లింక్ అనుమతులపై ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. భారతదేశానికి నిజమైన ప్రధాని ముఖేష్ అంబానీ అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. దీనిపై రాజకీయ దుమారం చెలరేగింది. రాహుల్ గాంధీ మస్క్ పోస్టుకు స్పందిస్తూ.. ‘‘ఎలాన్ భారతదేశానికి స్వాగతం. ఆ రెండో వ్యక్తి గురించి తెలిసే వరకు ఆగు’’ అంటూ వ్యాఖ్యానించారు. గౌతమ్ అదానీ గురించి రాహుల్ పరోక్షంగా ఈ కామెంట్స్ చేసినట్లు అర్థమవుతుంది.
మస్క్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఓవైసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని వ్యతిరేకించడానికీ , భారతదేశ నిర్ణయాలను ప్రశ్నించే హక్కును ఒక విదేశీ వ్యాపారవేత్తకు ఇవ్వడానికీ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఆయన ఎత్తి చూపారు. మస్క్ ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఉన్నారని, ఇకపైన ఉంటారని అన్నారు. అయితే, అంతమాత్రాన ఒక విదేశీ వ్యాపారవేత్త భారత ప్రధానిపై అలాంటి వ్యాఖ్యలు చేయడానికి అనుమతించకూడదని అన్నారు.
कभी-कभी असदुद्दीन ओवैसी भारत के राष्ट्रीय हित से जुड़े मुद्दों पर समझदारी बातें करते हैं, हालाँकि हम उनकी कट्टर मुस्लिम-केंद्रित नीतियों का विरोध करते हैं। अगर विपक्ष के कुछ नेता हमारी बात नहीं सुनना चाहते, तो उन्हें ओवैसी से सीखना चाहिए।
Now it’s clear who’re Anti-India gang https://t.co/pS4PDGbq7D
— Kiren Rijiju (@KirenRijiju) October 17, 2026





