18
October, 2026

A News 365Times Venture

18
Sunday
October, 2026

A News 365Times Venture

AP Alliance Seat Sharing: టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే?

Date:

AP Alliance Seat Sharing: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి స్థానిక ఎన్నికలకు సంబంధించి సీట్ల సర్దుబాటుపై కసరత్తును పూర్తి చేశారు.. ముఖ్యమంత్రి చంద్రబాబుతో మంత్రి నాదెండ్ల మనోహర్, మంత్రి సత్యకుమార్, ఎంపీ లింగమనేని రమేష్‌ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై చర్చించారు.. స్థానిక ఎన్నికల్లో ఏ పార్టీ ఎక్కడ పోటీ చేయాలనే అంశంపై టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు స్పష్టతకు వచ్చినట్లు సమాచారం. సీట్ల పంపకాలపై కూటమి పార్టీల మధ్య చర్చలు కొలిక్కి రావడంతో, పోటీ చేసే స్థానాల వివరాలను కాసేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇప్పటికే స్థానిక ఎన్నికల్లో మూడు పార్టీలు ఐక్యంగా ముందుకు సాగాలని కూటమి నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సీట్ల సర్దుబాటుతో పాటు అభ్యర్థుల ఎంపికపైనా నేతలు దృష్టి సారించారు. సీట్లకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత, ఆయా స్థానాల్లో కూటమి తరఫున పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు సమాచారం. అయితే ఏ పార్టీకి ఎన్ని స్థానాలు కేటాయించారు? ఏయే స్థానాల్లో ఏ పార్టీ పోటీ చేయనుంది? అనే వివరాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా, ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌లు రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.. రాష్ట్రంలోని ఎన్నికల కోడ్‌ కూడా అమల్లోకి వచ్చిన విషయం విదితమే..

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

திருச்சி: "விலைவாசி உயர்வைக் கட்டுப்படுத்த வேண்டும்!" – தொல்.திருமாவளவன் கோரிக்கை

விடுதலை சிறுத்தைகள் கட்சியின் தலைவரும், சிதம்பரம் நாடாளுமன்ற உறுப்பினருமான தொல்.திருமாவளவன் திருச்சி...

Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?

Story Board: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల సందడి షురూ అయింది....

പയ്യോളിയില്‍ 13കാരിയെ പീഡിപ്പിച്ച കേസിലെ പ്രതിയുടെ ജാമ്യം; പൊലീസ് സ്റ്റേഷനിലേക്ക് മാര്‍ച്ച് നടത്തി ബന്ധുക്കളും നാട്ടുകാരും

കോഴിക്കോട്: പയ്യോളിയില്‍ 13-കാരിയെ ലൈംഗികമായി പീഡിപ്പിച്ച പോക്‌സോ കേസില്‍ ഒന്നാം പ്രതി...