19
September, 2026

A News 365Times Venture

19
Saturday
September, 2026

A News 365Times Venture

The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..

Date:

నాచురల్ స్టార్ నాని హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’. చెన్నైలో జరిగిన ప్రెస్ మీట్‌లో నాని ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సెన్సార్ పనులు ఇంకా పూర్తి కాలేదని చెప్పుకొచ్చాడు. అయితే సినిమాలోని బోల్డ్ కంటెంట్, రా అండ్ రస్టిక్ అప్రోచ్ కారణంగా దీనికి ‘ఏ’ (A) సర్టిఫికేట్ వచ్చే అవకాశం ఉందన్నాడు. ఈ రకమైన సర్టిఫికేట్ వల్ల హింసను ఇష్టపడని ప్రేక్షకులను కోల్పోతామన్నారు.

అయినప్పటికీ.. ఒక నటుడిగా ప్రతీ జోనర్‌ను అందరికోసం మాత్రమే కాకుండా, అన్ని రకాల ప్రయోగాత్మక జోనర్లను అన్వేషించాల్సిన బాధ్యత తమపై ఉంటుందని స్పష్టం చేశారు. ఈ చిత్రంలో నాని చేసే పాత్ర చాలా తీవ్రంగా ఉంటుందని, కథ డిమాండ్ చేసే హై పర్ఫార్మెన్స్ కేవలం ఈ తరహా జోనర్‌లోనే సాధ్యపడుతుందని తెలిపారు. అయితే ఈ చిత్రంలో ‘హిట్ 3’ తరహాలో భయంకరమైన హింసకు తావు లేకుండా, సాధారణ కమర్షియల్ చిత్రాల లాగా ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు.

ఈ సినిమాకు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందిస్తుండటం విశేషం. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచగా, అనిరుధ్ అందించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಗಣೇಶ ವಿಸರ್ಜನೆ ವೇಳೆ ಅವಘಡ: ಇಬ್ಬರು ಬಾಲಕರು ಸಾವು

ರಾಯಚೂರು,ಸೆಪ್ಟಂಬರ್,19,2026 (www.justkannada.in):  ಗಣೇಶ ವಿಸರ್ಜನೆ ವೇಳೆ ಟ್ರ್ಯಾಕ್ಟರ್ ನಿಂದ ಬಿದ್ದು...

'நான் அதிபரானப் பின் வரலாற்றிலேயே முதன்முறையாக!'-தன்னை தானே பாராட்டிக்கொள்ளும் ட்ரம்ப்-ன் 25 Points

2025-ஆம் ஆண்டு ஜனவரி மாதம் இரண்டாவது முறையாக அமெரிக்க அதிபர் பொறுப்பை...

Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం

కొద్దిరోజులుగా సౌదీ లక్ష్యంగా హౌతీలు దాడులు చేస్తున్నారు. దీంతో చమురు సరఫరాకు...