18
September, 2026

A News 365Times Venture

18
Friday
September, 2026

A News 365Times Venture

Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..

Date:

Saudi Arabia: సౌదీ అరేబియా జాక్‌పాట్ కొట్టింది. మదీనాలో భారీ స్థాయిలో యురేనియం, రేర్ ఎర్త్ మెటల్స్ నిల్వలను కొనుగోన్నట్లు ఆ దేశ ఇంధన శాఖ మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీబ్ బిన్ సల్మాన్‌ను ఉటంకిస్తూ ఆ దేశ మీడియా నివేదించింది. మదీనాలోని ‘జబల్ సయీద్’ ప్రాజెక్టు వద్ద చేపట్టిన అన్వేషన, భౌగోళిక అధ్యయనాల్లో సుమారు 110 మిలియన్ టన్నుల ఖనిజ నిల్వలు ఉన్నట్లు తేలింది. ఇందుల్లో యురేనియంతో పాటు హెవీ మెటల్స్ ఉన్నట్లు తేలింది.

ఇరాన్ యుద్ధం, సౌదీపై హౌతీల దాడుల నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది. అరబ్ దేశాల్లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన సౌదీ, తన ఇంధన, ఖనిజ వనరుల్ని వైవిధ్యీకరించడంలో పెట్టుబడులు పెడుతోంది. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ నేతృత్వంలోని విజన్ 2030లో భాగంగా చమురు ఆధారిత ఆర్థిక రంగాన్ని విస్తరించాలని అనుకుంటున్నారు.

ఇటీవల సౌదీ-అమెరికా మధ్య పౌర అణు కార్యక్రమ ఒప్పందం కుదిరింది. ఇప్పుడు ఈ యురేనియం నిల్వల్ని కనుగొనడం ఒక ముఖ్యమైన పరిణామం. జూలైలో రెండు దేశాలు ఈ ద్వైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందంలో భాగంగా అమెరికా సౌదీ పౌర అణుశక్తి కార్యక్రమాన్ని అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. ఇదే కాకుండా సౌదీ అరేబియా ‘‘ఎన్‌రిచ్డ్ యురేనియం’’ తయారు చేసుకునే అవకాశాన్ని ఈ ఒప్పందం కల్పిస్తుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಮೈಸೂರು ಲ್ಯಾನ್ಸರ್ಸ್‌ ಪರಾಕ್ರಮದ ಹಿಂದಿನ ಕುಟುಂಬದ ನೆನಪುಗಳು – ಲೇಖಕರ ಮಾತು

  ಮೈಸೂರು ಸಂಸ್ಥಾನದ ಇತಿಹಾಸ, ಅರಮನೆ ಹಾಗೂ ಎರಡು ಮಹಾಯುದ್ಧಗಳೊಂದಿಗೆ ನಿಕಟ...

ഇന്ത്യയൊട്ടാകെ ലഹരി മുക്തമാകണം: രമേശ് ചെന്നിത്തല

തിരുവനന്തപുരം: കേരളത്തില്‍ മാത്രമല്ല ഇന്ത്യയൊട്ടാകെ നടക്കുന്ന ഏറ്റവും വലിയ ലഹരി വേട്ടയാണ്...

"அந்தத் தம்பியின் கண்ணீர் நெஞ்சைக் கனக்கச் செய்கிறது..!"- அயலக மாணவர் விவகாரத்தில் ஸ்டாலின் கண்டனம்

அம்பேத்கர் அயலக உயர்கல்வி திட்டத்தின் கீழ் உதவித்தொகை கிடைக்கவில்லை என மாணவர்...

Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు

మహిళలు ఎల్పీజీ సిలిండర్లను ఎత్తలేరన్న కారణంతో ఉద్యోగం నిరాకరించినందుకు దేశ సర్వోన్నత...