14
September, 2026

A News 365Times Venture

14
Monday
September, 2026

A News 365Times Venture

PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్‌పింగ్‌కు తేల్చి చెప్పిన మోడీ..

Date:

PM Modi: గల్వాన్ ఘర్షణ తర్వాత తొలిసారి బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ భారతదేశానికి వచ్చారు. బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ, జిన్‌పింగ్ మధ్య ద్వైపాక్షిక సమావేశాలు జరిగాయి. ఈ సమావేశంలో భారత్-చైనా సంబంధాల అభివృద్ధికి సరిహద్దుల్లో శాంతి, ప్రశాంతత అత్యంత కీలకమని మోడీ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఒప్పందాలను, అవగాహనను ఇరు పక్షాలు పాటించాలని సూచించారు. ద్వైపాక్షిక సంబంధాలు , పెట్టుబడులు, వాణిజ్యంపై ఇరువురు నేతలు చర్చించారు.

సమావేశం తర్వాత భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. గతేడాది ఆగస్టులో టియాంజిన్‌లో మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత భారత్-చైనా సంబంధాల్లో చోటుచేసుకున్న పురోగతిని ఇరువురు నేతలు సమీక్షించారని చెప్పారు. పరస్పర గౌరవం. పరస్పర సున్నితత్వం, పరస్పర ప్రయోజనం అనే మూడు అంశాల ఆధారంగా ద్వైపాక్షిక సహకారాన్ని కొనసాగించాలని ఇరువురు నేతలు పునరుద్ఘాటించినట్లు ఆయన వెల్లడించారు.

ఇదే సమయంలో, భారత్-చైనా మధ్య విభేదాలు వివాదాలుగా మారకుండా చూడాల్సిన బాధ్యత ఉందని మోడీ జిన్‌పింగ్‌కు స్పష్టం చేశారు. సరిహద్దుల్లో శాంతి, ప్రశాంతత కొనసాగించడం ద్వైపాక్షిక సంబంధాల నిరంతర అభివృద్ధికి ప్రాథమిక ఆధారం అని ప్రధాని చెప్పినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. మరోవైపు, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సానుకూల వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాలు ఒకరి బలాల నుంచి మరొకరు నేర్చుకుని, సహకరించుకోవాలని అన్నారు.

ఇదిలా ఉంటే, సాధారణ సంబంధాల నుంచి సరిహద్దు వివాదాన్ని వేరుగా చూడాలని చైనా వైఖరి. అయితే, భారత్ మాత్రం సరిహద్దుల్లో శాంతి, ప్రశాంత లేకుండా ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతి సాధ్యం కాదని చెబుతోంది. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యీ మధ్య ప్రత్యేక ప్రతినిదుల స్థాయి చర్చలు జరిగాయి. ఎల్ఏసీ వెంబడి శాంతి కొనసాగించాల్సిన అవసరాన్ని భారత్ నొక్కి చెప్పింది. 2003లో ఏర్పాటైన ఈ వ్యవస్థ ద్వారా 3,488 కిలోమీటర్ల సరిహద్దు వివాదానికి పరిష్కారం కనుగొనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

അടിസ്ഥാന സൗകര്യങ്ങളോ അംഗീകാരമോ ഇല്ലെന്നാരോപണം: ബംഗാളില്‍ 252 മദ്രസകള്‍ അടച്ച് പൂട്ടാന്‍ ഉത്തരവിട്ട് സര്‍ക്കാര്‍

കൊല്‍ക്കത്ത: പശ്ചിമ ബംഗാളില്‍ 252 മദ്രസകള്‍ പൂട്ടാന്‍ ഉത്തരവിട്ട് സംസ്ഥാന സര്‍ക്കാര്‍....

’தொழில்துறை அமைச்சரை கூட அழைக்காமல் முதலமைச்சர் இங்கிலாந்து சென்றது ஏன்?’ – பெ.சண்முகம் கேள்வி!

கோவை பீளமேடு பகுதியில் மார்க்சிஸ்ட் கம்யூனிஸ்ட் கட்சி அலுவலகத்தை, அக்கட்சியின் மாநிலச்...

Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో...

വ്യാജ ഡേറ്റിങ് ആപ്പ് മുതല്‍ സര്‍വൈലന്‍സും ജൈവായുധങ്ങളും വരെ; എ.ഐ ഭീഷണികളുടെ വിശകലനത്തി‍ല്‍ ആന്ത്രോപിക് പറയുന്നത്

തട്ടിപ്പിന് മുതല്‍ ആയുധ നിര്‍മാണത്തിന് വരെ എ.ഐ പ്ലാറ്റ്‌ഫോമുകള്‍ ദുരുപയോഗം ചെയ്യപ്പെടുന്നത്...