12
September, 2026

A News 365Times Venture

12
Saturday
September, 2026

A News 365Times Venture

Number Secrete: మొబైల్ నంబర్‌కు ముందు ‘+91’ ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..

Date:

మనం నిత్య జీవితంలో ఎన్నో విషయాలను చూస్తుంటాం, ఉపయోగిస్తుంటాం కానీ వాటి వెనుక అసలు కారణాలు చాలా మందికి తెలియదు. అలాంటి వాటిలో మన మొబైల్ ఫోన్ నంబర్లకు ముందు ఉండే ‘+91’ కోడ్ కూడా ఒకటి. ప్రతిరోజూ మనం ఎంతోమందికి కాల్ చేసేటప్పుడు, మెసేజ్ చేసేటప్పుడు ఈ నంబర్‌ ఆటోమేటిక్‌గా టైప్ అవుతుంటుంది. అసలు ఈ సంఖ్య ఎందుకు వచ్చింది? దీని వెనుక ఉన్న చారిత్రక, అంతర్జాతీయ నిబంధనలు ఏమిటి? అని ఎప్పుడైనా ఆలోచించామా? చాలామందికి దీని గురించి సరైన అవగాహన ఉండదు. కేవలం ఇదొక కోడ్ అని మాత్రమే భావిస్తుంటాం. కానీ, దీని వెనుక ఒక ఆసక్తికరమైన సైంటిఫిక్, గ్లోబల్ టెలికాం వ్యవస్థ దాగి ఉంది. దాని గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

ప్రపంచవ్యాప్తంగా టెలిఫోన్ నెట్‌వర్క్‌లను నిర్వహించడానికి , అంతర్జాతీయ కాల్స్‌ను సులభతరం చేయడానికి ఐక్యరాజ్యసమితికి చెందిన ‘ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్’ (ITU) కొన్ని నిర్దిష్టమైన ప్రమాణాలను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ప్రపంచ దేశాలన్నింటికీ ప్రత్యేకమైన దేశీయ కోడ్స్ కేటాయిస్తుంది. ఇందులో భాగంగానే భారతదేశానికి 91 అనే కోడ్ కేటాయించబడింది.

ప్రపంచ టెలికాం జోన్లు..
ITU ప్రపంచాన్ని మొత్తం 9 ప్రధాన భౌగోళిక జోన్లుగా విభజించింది. ఇందులో దక్షిణ ఆసియా, మధ్య ఆసియా, పశ్చిమ ఆసియా, మధ్యప్రాచ్య ప్రాంతాలు అన్నీ కూడా ‘జోన్ 9’ పరిధిలోకి వస్తాయి. ఈ జోన్‌లోని దేశాలన్నింటికీ సాధారణంగా ‘9’ తో ప్రారంభమయ్యే కోడ్స్ కేటాయించారు. అందువల్ల జోన్ 9 లో ఉన్న భారతదేశానికి ‘9’ తో పాటు మరో ప్రత్యేక అంకెను జోడించి 91 గా కేటాయించడం జరిగింది. అంతే కాకుండా.. మన పక్కనే ఉన్న శ్రీలంక కోడ్ +94, పాకిస్థాన్ కోడ్ +92, ఆఫ్ఘనిస్థాన్ కోడ్ +93 గా ఇలా కేటాయించారు.

చిన్న కోడ్ కేటాయింపు వెనుక కారణం..
1960వ దశకంలో ఈ కోడ్లను కేటాయించే సమయంలో జనాభా, ఆర్థిక ప్రాముఖ్యత, అంతర్జాతీయ కాల్స్ రాకపోకలను ప్రాతిపదికగా తీసుకున్నారు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగి, వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన దేశాలలో భారత్ ఒకటి కావడంతో, అంతర్జాతీయంగా సులభంగా డయల్ చేయడానికి వీలుగా తక్కువ అంకెలు గల కోడ్‌ను కేటాయించారు.

‘+’ (ప్లస్) ప్రాముఖ్యత ఇది..
నంబర్ ముందు ఉండే ‘ప్లస్’ (+) సింబల్ అనేది ఇంటర్నేషనల్ డైరెక్టింగ్ ప్రిఫిక్స్‌ను సూచిస్తుంది. మనం దేశం వెలుపల నుంచి అంటే ఇంటర్నేషన్ కాల్ చేస్తున్నప్పుడు ఇది గ్లోబల్ నెట్‌వర్క్‌కు సంకేతంగా పనిచేస్తుంది. ఇది భారతదేశంలోని సరైన టెలికాం నెట్‌వర్క్‌కు కాల్‌ను అనుసంధానించడానికి దోహదపడుతుంది. మొత్తంగా చూస్తే.. +91 అనేది కొన్ని అంకెలు మాత్రమే కాకుండా, ప్రపంచ టెలికాం పటంలో భారతదేశ గుర్తింపును, అంతర్జాతీయ కమ్యూనికేషన్ వ్యవస్థలో మన దేశ స్థానాన్ని తెలిపే ఒక విశిష్ట సంకేతం.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ആഫ്രിക്കയില്‍ ‘തുറമുഖ സാമ്രാജ്യത്വ’ത്തിന് യു.എ.ഇ ശ്രമിക്കുന്നു; യു.എ.ഇ – ഇസ്രഈല്‍ ബന്ധം നിരീക്ഷിക്കുകയാണെന്ന് എറിത്രിയന്‍ മന്ത്രി

അസ്മാര: ആഫ്രിക്കയില്‍ യു.എ.ഇ ‘തുറമുഖ സാമ്രാജ്യത്വം’ നടപ്പാക്കാന്‍ ശ്രമിക്കുകയാണെന്ന് എറിത്രിയന്‍ വിദേശകാര്യ...

தொடரும் மின்வெட்டு: "'ப்யூஸ் போன' தவெக அரசு மக்கள் பிரச்னைகளில் கவனம் செலுத்த வேண்டும்" – உதயநிதி

தமிழ்நாடு முழுவதும் கடந்த இரண்டு நாட்களாக மின்வெட்டு புகார்கள் அதிகரித்துள்ள நிலையில்...

ಖಾಸಗಿ ಶಾಲಾ ಶಿಕ್ಷಕರಿಗೂ ರಾಜ್ಯ ಮಟ್ಟದ ಶಿಕ್ಷಕ ಪ್ರಶಸ್ತಿ ನೀಡುವ ಚಿಂತನೆಯಿದೆ : ಶಿಕ್ಷಣ ಸಚಿವ ಮಧು ಬಂಗಾರಪ್ಪ

ಬೆಂಗಳೂರು, ಸೆಪ್ಟಂಬರ್,12,2026 (www.justkannada.in):  ಖಾಸಗಿ ಶಾಲೆಗಳಲ್ಲಿ ಉತ್ತಮವಾಗಿ ಸೇವೆ ಸಲ್ಲಿಸುತ್ತಿರುವ...

യൂറോപ്യന്‍ സൈനികര്‍ ഉക്രൈനില്‍ എത്തിയാല്‍ നേരിട്ടുള്ള യുദ്ധം; കടുത്ത മുന്നറിയിപ്പുമായി പുടിന്‍

മോസ്‌കോ: ഉക്രൈനില്‍ യൂറോപ്യന്‍ രാജ്യങ്ങള്‍ സൈനികരെ വിന്യസിപ്പിച്ചാല്‍ അത് റഷ്യക്കെതിരായ നേരിട്ടുള്ള...