11
September, 2026

A News 365Times Venture

11
Friday
September, 2026

A News 365Times Venture

Maharashtra: నాందేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-టాటా మ్యాజిక్‌ ఢీ.. 9 మంది మృతి

Date:

మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ట్రక్కు.. టాటా మ్యాజిక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఛిద్రమైన శరీరాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

నివేదికల ప్రకారం.. నాందేడ్-భోకర్ హైవేపై వాకడ్ గ్రామం సమీపంలోని సీతాఖండి ప్రాంతంలో సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. భోకర్ నుంచి నాందేడ్ వైపు అతివేగంతో ప్రయాణిస్తున్న ట్రక్కు.. ఎదురుగా వస్తున్న టాటా మ్యాజిక్ ప్యాసింజర్ వ్యాన్‌ను ఢీకొంది. ఢీకొన్న ధాటికి టాటా మ్యాజిక్ వ్యాన్ పూర్తిగా నుజ్జునుజ్జు అయి రోడ్డు పక్కకు పడిపోయింది. వ్యాన్‌లో 12 మంది ప్రయాణికులు ఉన్నారు. 9 మంది ఘటనాస్థలిలోనే చనిపోయారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో రెండు వాహనాలు అతివేగంతో ప్రయాణిస్తున్నాయి. గాయపడిన వారిని చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

పెద్ద శబ్దం విన్న గ్రామస్తులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు, అంబులెన్స్‌కు సమాచారం అందించారు. గాయపడిన మరో ముగ్గురిని భోకర్, నాందేడ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. వ్యాన్‌ను ఢీకొన్న తర్వాత ట్రక్కు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో డ్రైవర్ క్యాబిన్‌లోనే చిక్కుకుపోయాడు. అతడిని బయటకు తీయడానికి పోలీసులు, సహాయక బృందాలు తీవ్రంగా శ్రమించాయి. వ్యాన్‌లోని ప్రయాణీకులందరూ స్థానికులేనని భావిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

‘ചായ കുടിക്കാന്‍ പോയതല്ലല്ലോ’; ഇ.ഡി നടപടികള്‍ക്കിടെ പിണറായിയെ പരിഹസിച്ച് അലന്‍ ഷുഹൈബ്

കോഴിക്കോട്: സി.എം.ആര്‍.എല്‍ മാസപ്പടി കേസില്‍ പ്രതിപക്ഷ നേതാവ് പിണറായി വിജയന്‍, മകള്‍...

’வீட்டுக்கு அருகிலேயே தலைமைச் செயலகம் கட்டுவேன் என்ற பிடிவாதம் ஆபத்தில் முடியும்’–வானதி சீனிவாசன்!

பா.ஜ.க முன்னாள் தேசிய மகளிரணித் தலைவர் வானதி சீனிவாசன் வெளியிட்டுள்ள அறிக்கையில்,...

സത്യ നികേതന്‍ ഹോസ്റ്റല്‍ അപകടം; നടത്തിപ്പുകാര്‍ക്ക് അപകട മുന്നറിയിപ്പ് നല്‍കിയിരുന്നതായി തൊഴിലാളി

ന്യൂദല്‍ഹി: ദല്‍ഹി സത്യ നികേതനില്‍ ഹോസ്റ്റല്‍ കെട്ടിടം തകരുന്നതിന് മണിക്കൂറുകള്‍ക്ക് മുമ്പ്...

பாளையங்கோட்டை: குப்பைக் கிடங்காக மாறி வரும் பிரதான சாலை… அலட்சியம் தவிர்ப்பார்களா அதிகாரிகள்?

தென்னகத்தின் ஆக்ஸ்போர்ட் என அழைக்கப்படும் பாளையங்கோட்டையில், சுமார் 2 கி.மீ பரப்பளவிற்குள்...