5
September, 2026

A News 365Times Venture

5
Saturday
September, 2026

A News 365Times Venture

Whatsapp Update: ఇకపై వాట్సాప్‌ నుంచే కరెంట్‌, వాటర్‌ బిల్లులు.. 22 వేలకుపైగా బిల్లర్లతో సరికొత్త సేవలు.!

Date:

Whatsapp Update: భారత్‌లో వాట్సాప్‌ వినియోగదారులకు మరో ఉపయోగకరమైన ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. ఇకపై కరెంట్‌, నీటి బిల్లులు, గ్యాస్‌, ఫాస్ట్‌ట్యాగ్‌ రీఛార్జ్‌, ఇన్సూరెన్స్‌ ప్రీమియం, క్రెడిట్‌ కార్డ్‌ బిల్లులు, లోన్‌ చెల్లింపులు వంటి వాటిని వాట్సాప్‌ నుంచే నేరుగా చెల్లించుకోవచ్చు. ఇందుకోసం వాట్సాప్‌ యాప్‌లోనే బిల్‌ పేమెంట్‌ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.

ఈ సేవను భారత్‌ కనెక్ట్‌ నెట్‌వర్క్‌తో అనుసంధానించారు. గతంలో దీనిని బీబీపీఎస్‌ (BBPS)గా పిలిచేవారు. ఈ నెట్‌వర్క్‌ ద్వారా దేశవ్యాప్తంగా 30 కేటగిరీలకు చెందిన 22,722 బిల్లర్లను యాక్సెస్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో వివిధ బిల్లుల చెల్లింపుల కోసం ప్రత్యేక యాప్‌లు లేదా వెబ్‌సైట్లను ఆశ్రయించాల్సిన అవసరం తగ్గనుంది.

ఒక్క క్లిక్‌తో బిల్‌ పేమెంట్స్‌..

వాట్సాప్‌ హోమ్‌ స్క్రీన్‌ పైభాగంలో కనిపించే ‘₹’ గుర్తుపై ట్యాప్‌ చేయడం ద్వారా పేమెంట్స్‌ విభాగంలోకి వెళ్లొచ్చు. అక్కడ విద్యుత్‌, నీరు, పైప్డ్‌ గ్యాస్‌, ఫాస్ట్‌ట్యాగ్‌, ఇన్సూరెన్స్‌, క్రెడిట్‌ కార్డ్‌, లోన్‌ వంటి వివిధ బిల్‌ కేటగిరీలు కనిపిస్తాయి. ఇప్పటికే చెల్లింపులు చేసిన బిల్లర్ల వివరాలను వాట్సాప్‌ సేవ్‌ చేసుకుంటుంది. దీంతో భవిష్యత్‌లో అదే బిల్లర్‌కు సంబంధించిన చెల్లింపులను సులభంగా యాక్సెస్‌ చేసుకోవచ్చు. లింక్‌ చేసిన ఖాతాలకు సంబంధించిన రాబోయే బిల్లులను కూడా ప్లాట్‌ఫామ్‌ ఆటోమేటిక్‌గా పొందుపరుస్తుంది.

ఒకే బిల్లర్‌కు అనేక ఖాతాలు..

ఒకే యుటిలిటీ ప్రొవైడర్‌ కింద ఉన్న బహుళ కన్స్యూమర్‌ ఖాతాలను కూడా వాట్సాప్‌లో లింక్‌ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఇంటికి, కార్యాలయానికి లేదా కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న వేర్వేరు కనెక్షన్లను ఒకే చోట నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తరచుగా ఉపయోగించే బిల్‌ కేటగిరీలను పేమెంట్స్‌ స్క్రీన్‌పైనే సులభంగా యాక్సెస్‌ చేసుకునేలా ఏర్పాటు చేశారు. మిగిలిన కేటగిరీలను డైరెక్టరీ ద్వారా ఎంచుకోవచ్చు.

యూపీఐ, డెబిట్‌, క్రెడిట్‌ కార్డులతో చెల్లింపు..

బిల్లుల చెల్లింపుల కోసం వినియోగదారులు యూపీఐ, డెబిట్‌ కార్డ్‌, క్రెడిట్‌ కార్డ్‌ వంటి పేమెంట్‌ ఆప్షన్లను ఉపయోగించుకోవచ్చు. ముందుగా బిల్లర్‌ను ఎంచుకుని, సంబంధిత కన్స్యూమర్‌ నంబర్‌ లేదా అకౌంట్‌ వివరాలను నమోదు చేయాలి. ఆ తర్వాత వాట్సాప్‌ బిల్‌ వివరాలను, చెల్లించాల్సిన మొత్తాన్ని ఆటోమేటిక్‌గా చూపిస్తుంది. వివరాలను పరిశీలించిన తర్వాత నచ్చిన పేమెంట్‌ విధానాన్ని ఎంచుకుని లావాదేవీని పూర్తి చేయవచ్చు.

వాట్సాప్‌లో మరిన్ని సేవలు

భారత్‌లో ఇప్పటికే మొబైల్‌ రీఛార్జ్‌లు, మెట్రో టికెట్‌ బుకింగ్‌, ఆటోమేటెడ్‌ చాట్‌బాట్ల ద్వారా పలు ప్రభుత్వ పౌర సేవలను వాట్సాప్‌ అందిస్తోంది. తాజాగా బిల్‌ పేమెంట్స్‌ను కూడా ఇందులోకి తీసుకురావడంతో రోజువారీ ఆర్థిక లావాదేవీలను వాట్సాప్‌ నుంచే నిర్వహించుకునే అవకాశం మరింత పెరిగింది. ఈ కొత్త బిల్‌ పేమెంట్‌ ఫీచర్‌ ప్రస్తుతం భారత్‌లో దశలవారీగా అందుబాటులోకి వస్తోంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಬಸವರಾಜ ಕನ್ನಾಳೆ ಬಾಲ್ಕಿಯ ಬಿಜೆಪಿ ಕಾರ್ಯಕರ್ತ: ನನ್ನ ವಿರುದ್ದ ಸ್ಪರ್ಧೆಗೆ ಸಿದ್ದತೆ ನಡೆಸಿದ್ದ- ಸಚಿವ ಈಶ್ವರ್ ಖಂಡ್ರೆ

ಬೆಂಗಳೂರು,ಸೆಪ್ಟಂಬರ್,4,2026 (www.justkannada.in):  ಕೆಪಿಎಸ್ ಸಿ ಹಗರಣದಲ್ಲಿ ಬಂಧಿತನಾಗಿರುವ ಬಸವರಾಜ ಕನ್ನಾಳೆ...

"இஸ்ரேல் இருந்திருக்காது; மத்திய கிழக்கே அழிந்திருக்கும்" – ஈரான் போருக்கு ட்ரம்ப் சொல்லும் காரணம்

பிப்ரவரி மாதக் கடைசியில் தொடங்கிய ஈரான் போர் இன்னும் தொடர்ந்துகொண்டிருக்கிறது.ஆனால், அமெரிக்க...

Baswaraju Saraiah: దమ్ముంటే రాజీనామా చేసి ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలి.. కొండా సురేఖకు ఎమ్మెల్సీ సారయ్య సవాల్‌!

తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య...