3
September, 2026

A News 365Times Venture

3
Thursday
September, 2026

A News 365Times Venture

7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్‌ లాంచ్‌!

Date:

VIVO T5: భారత మార్కెట్లో వివో (Vivo) T సిరీస్‌లో భాగంగా vivo T5ను విడుదల చేసింది. పనితీరు, ఆన్-డివైస్‌ ఏఐ సామర్థ్యాలు, భారీ బ్యాటరీ, అధిక రిఫ్రెష్‌ రేట్‌ డిస్‌ప్లే వంటి ఫీచర్లపై కంపెనీ ప్రధానంగా దృష్టి పెట్టింది. కేవలం 7.99 మిల్లీమీటర్ల మందంతో 199 గ్రాముల బరువుతో ఈ ఫోన్‌ స్లిమ్‌ డిజైన్‌తో లాంచ్ అయ్యింది.

AMOLED డిస్‌ప్లే:

వివో T5లో 6.83 అంగుళాల 1.5K 3D కర్వ్డ్‌ AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 144Hz రిఫ్రెష్‌ రేట్‌, 2800 × 1260 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌, 449 PPI పిక్సెల్‌ డెన్సిటీతో వస్తుంది. గరిష్ఠంగా 2,000 నిట్స్‌ HBM బ్రైట్‌నెస్‌, HDR10+ సపోర్ట్‌ ఉన్నాయి. కళ్లపై ఒత్తిడిని తగ్గించేందుకు లో బ్లూ లైట్, లో ఫ్లికర్ వంటి SGS సర్టిఫికేషన్లతో పాటు ఐ ప్రొటెక్షన్ మోడ్, స్లీప్ కంఫర్ట్ మోడ్, యాంటీ -ఫటిగు బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్ వంటి ఫీచర్లు అందించారు. ఆడియో కోసం సిమెట్రికల్‌ డ్యూయల్‌ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి.

50MP సోనీ కెమెరా:

ఫోన్‌ వెనుక భాగంలో 50MP సోనీ IMX882 ప్రధాన కెమెరా ఉంది. f/1.8 అపెర్చర్‌, 4-axis OIS, Sony Aura Light సపోర్ట్‌ ఉన్నాయి. దీనికి తోడు 115-డిగ్రీల ఫీల్డ్‌ ఆఫ్‌ వ్యూతో 8MP అల్ట్రా-వైడ్‌ కెమెరా ఇచ్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ముందు భాగంలో 32MP కెమెరా ఉంది. ముందు, వెనుక కెమెరాలతో 4K వీడియో రికార్డింగ్‌ చేయవచ్చు. OISతో పాటు EIS స్టెబిలైజేషన్‌ కూడా అందించారు. 1x, 1.5x, 2x మల్టీఫోకల్‌ పోర్ట్రెయిట్‌, బొకే ఫ్లేర్, AI Erase 2.0 వంటి కెమెరా ఫీచర్లు ఉన్నాయి.

పవర్‌ఫుల్‌ ప్రాసెసర్‌:

ఈ కొత్త మొబైల్ లో 4nm మీడియాటెక్ డిమెంసిటీ 7500 టర్బో ప్రాసెసర్‌ను అందించారు. 2.6GHz వరకు క్లాక్‌ స్పీడ్‌తో పనిచేసే ఆక్టాకోర్‌ చిప్‌కు Mali-G615 MC2 GPU, 8వ తరం GenAI-ready NPU ఉన్నాయి. క్లౌడ్‌పై ఎక్కువగా ఆధారపడకుండా ఫోన్‌లోనే ఏఐ టాస్క్‌లను నిర్వహించేలా ఈ NPU రూపొందించారు. కంపెనీ అంతర్గత పరీక్షల్లో ఈ ఫోన్‌ AnTuTuలో 12 లక్షలకు పైగా స్కోర్‌ సాధించినట్లు వివో తెలిపింది. ఎక్కువసేపు గేమింగ్‌, ఇతర హెవీ టాస్క్‌లు చేసినప్పుడు వేడిని నియంత్రించేందుకు 3,800 చదరపు మిల్లీమీటర్ల వేపర్‌ ఛాంబర్‌, 23,062 చదరపు మిల్లీమీటర్ల హీట్‌ డిసిపేషన్‌ ఏరియా, 10 టెంపరేచర్‌ సెన్సార్లను అందించారు.

భారీ బ్యాటరీ:

vivo T5లో 7,050mAh బ్యాటరీ అందించారు. 44W ఫ్లాష్ ఛార్జ్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ ఉంది. పూర్తిగా ఖాళీ అయిన బ్యాటరీని కేవలం 30 నిమిషాల్లో 44% వరకు ఛార్జ్‌ చేయగలదని కంపెనీ చెబుతోంది. బ్యాటరీ 1,600 ఛార్జ్‌-డిశ్చార్జ్‌ సైకిళ్ల తర్వాత కూడా కనీసం 80 శాతం కెపాసిటీని కొనసాగించేలా రూపొందించారు. గ్లోబల్ బైపాస్ ఛార్జింగ్ ఫీచర్‌ ద్వారా 20 శాతానికి పైగా ఛార్జ్‌ ఉన్నప్పుడు పవర్‌ను నేరుగా సిస్టమ్‌ కాంపోనెంట్లకు అందించి వేడిని తగ్గిస్తుంది.

IP69 రేటింగ్‌:

ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6తో పనిచేస్తుంది. మూడు ఆండ్రాయిడ్ వెర్షన్‌ అప్‌గ్రేడ్లు, ఐదేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్లను అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. సర్కిల్ టు సెర్చ్ 2.0, AI ట్రాన్స్క్రిప్టు అసిస్ట్, వివో ఆఫీస్ కిట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. భద్రత, మన్నిక పరంగా IP68 + IP69 రేటింగ్స్‌తో పాటు MIL-STD-810H డ్యూరబిలిటీ సర్టిఫికేషన్‌ ఉంది. తడి చేతులతో కూడా స్క్రీన్‌ను ఆపరేట్‌ చేయడానికి సపోర్ట్‌ అందించారు.

ధరలు..

లాంచ్‌ ఆఫర్‌లో భాగంగా బ్యాంక్‌ కార్డు డిస్కౌంట్లతో బేస్‌ వేరియంట్‌ నెట్‌ ఎఫెక్టివ్‌ ధర రూ.31,499 నుంచి ప్రారంభమవుతుంది. ఇతర వేరియంట్లపై కూడా రూ.4,000 వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. HDFC, SBI, Axis బ్యాంకు కార్డులతో ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. vivo T5 సేల్‌ సెప్టెంబర్‌ 9 నుంచి ఫ్లిప్కార్ట్, వివో ఇండియా e-స్టోర్, ఎంపిక చేసిన ఆఫ్‌లైన్‌ రిటైల్‌ స్టోర్లలో ప్రారంభం కానుంది. vivo T5 మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తుంది..

* 6GB + 128GB: రూ.34,999.
* 8GB + 128GB: రూ.39,999.
* 8GB + 256GB: రూ.44,999.
* 12GB + 256GB: రూ.49,999.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ചാറ്റ് ജി.പി.ടിക്കും യൂറോപ്യന്‍ യൂണിയന്റെ പൂട്ട്; ഡിജിറ്റല്‍ സര്‍വീസ് ആക്ടിന്റെ പരിധിയില്‍ ഉള്‍പ്പെടുത്തി

ബ്രസല്‍സ്: യൂറോപ്യന്‍ യൂണിയന്റെ കര്‍ശന ഡിജിറ്റല്‍ നിയന്ത്രണങ്ങളുടെ പരിധിയിലേക്ക് ചാറ്റ് ജി.പി.ടിയും....

Iran: "நீங்கள் தோண்டிய குழியில் இருந்து உங்களால் தப்ப முடியாது" – அமெரிக்காவுக்கு ஈரான் எச்சரிக்கை

அமெரிக்காவும், ஈரானும் மீண்டும் ‘தாக்குதல்’ மோடுக்குள் சென்றிருக்கின்றன.ஈரான் போரின் போக்கு ஈரான் போர்...

‘ഗസയിലെ ഫലസ്തീന്‍ ജനതയെ പുറത്താക്കാന്‍ പദ്ധതി’; യു.എസ് അംഗീകാരത്തിനായി കാത്തിരിക്കുകയാണെന്ന് ഇസ്രഈല്‍ മന്ത്രി

ജറുസലേം: ഗസയില്‍ നിന്ന് ഫലസ്തീന്‍ ജനതയെ പുറത്താക്കാനുള്ള പദ്ധതി തയ്യാറാക്കിയിട്ടുണ്ടെന്നും ഇക്കാര്യത്തില്‍...