1
November, 2026

A News 365Times Venture

1
Sunday
November, 2026

A News 365Times Venture

IISc Study: ఆవు ఎంజైమ్‌తో ప్రమాదకర బ్యాక్టీరియాకు చెక్.. IISc సంచలన పరిశోధన

Date:

IISc Study:  ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) శాస్త్రవేత్తలు పరిశోధన సంచలనంగా మారింది. యాంటీబయాటిక్‌ నిరోధక ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడంలో బెంగళూర్ IISc సైంటిస్టులు కీలక విషయాన్ని కనుగొన్నారు. ‘‘ఆవు’’ జీర్ణాశయంలో సూక్ష్మజీవుల నుంచి గుర్తించిన ఒక ఎంజైమ్ ప్రపంచంలోనే ప్రమాదకరమైన హాస్పిటల్ సూపర్‌బగ్‌గా ఉన్న అసినెటోబాక్టర్ బౌమానీ (Acinetobacter baumannii) రక్షణ కవచాన్ని బలహీనపరుస్తుందని పరిశోధనల్లో తేలింది. అయితే, ఈ పరిశోధన ప్రస్తుతం ప్రాథమిక శాస్త్రీయ దశలోనే ఉంది. ఇది చికిత్సకు అందుబాటులోకి రావడానికి ఇంకా చాలా ఏళ్ల పరిశోధనలు అవసరం. ఈ పరిశోధన మందులకు లొంగని ప్రమాదకర బ్యాక్టీరియాపై పోరాటంలో కొత్త మార్గాన్ని చూపించింది. సినెటోబాక్టర్ బౌమానీ అనేది ప్రపంచవ్యాప్తంగా ఆస్పత్రుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్న బ్యాక్టీరియా ఇరాక్ యుద్ధ సమయంలో గాయపడిన సైనికుల్లో ఇన్ఫెక్షన్లకు కారణమైంది. దీంతో దీనికి ‘‘ఇరాకీబాక్టర్’’ అనే పేరు కూడా వచ్చింది.

ఎందుకు ప్రమాదకరం..

అమెరికాకు చెందిన సెంటర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(CDC) ప్రకారం.. ఈ బ్యాక్టీరియా సాధారణంగా నేల, నీటిలో కనిపిస్తుంది. అయితే మనుషుల్లో తీవ్రమైన ఇన్ఫెక్షన్లు ప్రధానంగా ఆస్పత్రి వాతావరణంలో ఏర్పడుతాయి. ఇది లంగ్స్, గాయాలు, రక్తప్రవాహం, మూత్ర నాళాల్లో తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది.

ఈ బ్యాక్టీరియా యాంటీబయాటిక్స్‌కు తట్టుకునే సామర్థ్యం ఉంది. యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దీనిని క్రిటికల్ ప్రైయారిటీ పాథోజెన్గా గుర్తించింది. ఐఐఎస్‌సీ సైంటిస్టులు, బ్యాక్టీరియా నేరుగా చంపే ప్రయత్నం చేయకుండా దానికి రక్షణగా ఉండే బయోఫిల్మ్‌ను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తుందని చెబుతున్నారు. కొన్ని బ్యాక్టీరియా తమ చుట్టూ చక్కెరలు, ప్రొటీన్లు, కొవ్వులు, DNAతో కూడిన అంటుకునే రక్షణ పొరను ఏర్పరుచుకుంటాయి. దీనినే బయోఫిల్మ్ అంటారు. ఇది బ్యాక్టీరియాకు ఒక రకమైన కవచంలా పనిచేస్తుంది. దీంతో యాంటీబయాటిక్స్, శరీరంలోని రోగనిరోధక కణాలు లోపల ఉన్న బ్యాక్టీరియాను సులభంగా చేరుకోలేవు. పాలిసాకరైడ్లు అనే సంక్లిష్ట చక్కెరలు బ్యాక్టీరియా బయోఫిల్మ్ లో ప్రధాన భాగంగా ఉంటాయి.

ఆవు జీర్ణాశయ ఎంజైమ్‌తో పరిష్కారం..

ఈ ప్రమాదకరమైన బ్యాక్టీరియాను దెబ్బతీసేలా ఆవు జీర్ణాశయంలోని రూమెన్ అనే పదార్థం. పీచు అధికంగా ఉండే మొక్కలను జీర్ణం చేసుకోవడానికి సహాయడపే అనేక సూక్ష్మజీవులు ఇందులో ఉంటాయి. ఈ సూక్ష్మజీవుల జన్యు సమాచారాన్ని ఉపయోగించి, సంక్లిష్ట పాలిసాకరైడ్లను విచ్ఛిన్నం చేయగల ఎంజైమ్‌ల కోసం పరిశోధకులు అన్వేషించారు. ఇందులో CRhAB అనే ఎంజైమ్ బ్యాక్టీరియా బయో ఫిల్మ్‌ను ఏర్పరచడాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటు అప్పటికే ఉన్న బయోఫిల్మ్‌ను విచ్ఛిన్నం చేయగలదని తేలింది. బ్యాక్టీరియాలను నేరుగా ఎటాక్ చేయకుండా దాని రక్షణ కవచాన్ని దెబ్బతీయడం వల్ల ఇప్పటికే ఉన్న యాంటీబయాటిక్స్ కవచాన్ని దాటి బ్యాక్టీరియాను నిర్వీర్యం చేసే శక్తిని కల్పిస్తుంది.

CRhAB మరో ప్రమాదకరమైన బ్యాక్టీరియాపై కూడా పనిచేస్తుందని పరిశోధకులు గుర్తించారు. క్లెబ్సియెల్లా న్యుమోనియా(Klebsiella pneumoniae ) అనే మల్టీడ్రగ్-రెసిస్టెంట్ బ్యాక్టీరియాపై కూడా ఈ ఎంజైమ్ ప్రభావం చూపింది.IISc ప్రొఫెసర్ దీపశిఖా చక్రవర్తి మాట్లాడుతూ.. రెండు ప్రధాన సూపర్‌బగ్‌లు తయారు చేసే బయోఫిల్మ్‌లపై ఒకే ఎంజైమ్ పనిచేయడం ఈ పరిశోధన ప్రాముఖ్యతను మరింత పెంచుతుందని పేర్కొన్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

നെതന്യാഹുവിനെ പുറത്താക്കാന്‍ അറബ് പാര്‍ട്ടികളുമായി പ്രതിപക്ഷം സഖ്യമുണ്ടാക്കണം; നൂറുകണക്കിന് ഇസ്രഈലികള്‍ തെരുവിലിറങ്ങി

ടെല്‍അവീവ്: ഇസ്രഈല്‍ പ്രധാനമന്ത്രി ബെഞ്ചമിന്‍ നെതന്യാഹുവിനെ പുറത്താക്കാന്‍ അറബ് പാര്‍ട്ടികളുമായി പ്രതിപക്ഷം...

இந்தியா கூட்டணி: பழைய கம்பீரம்; மாறாத பாணி- மாதிரி நடாளுமன்றத்தில் மீண்டும் ஒலித்த மீரா குமார் குரல்

இந்திய தலைமைத் தேர்தல் ஆணையர் ஞானேஷ் குமாரைப் பதவி நீக்கம் செய்யக்...

SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..

దక్షిణాఫ్రికా మూడో టెస్టులో ఆస్ట్రేలియాపై 176 పరుగుల భారీ తేడాతో అద్భుత...

അങ്ങ് പറഞ്ഞത് പോലെ കടക്ക് പുറത്തെന്നോ വീട്ടില്‍ പോയി ചോദിക്കാനോ പറഞ്ഞില്ല: പിണറായിയെ പരിഹസിച്ച് റോജി എം.ജോണ്‍

തിരുവനന്തപുരം: മഹാരാജാസ് കോളേജിലെ ബിരുദദാനച്ചടങ്ങിനിടെ നടന്ന സംഭവത്തില്‍ എസ്.എഫ്.ഐ പ്രവര്‍ത്തകയ്‌ക്കെതിരെ കോണ്‍ഗ്രസ്-...