24
August, 2026

A News 365Times Venture

24
Monday
August, 2026

A News 365Times Venture

Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!

Date:

Home Remedies: వర్షాకాలం వస్తే చాలు వర్షపు చినుకులతో పాటు రకరకాల పురుగులు, కీటకాల బెడద కూడా మొదలవుతుంది. ఇళ్లలో తేమ పెరగడం వల్ల జెర్రులు, దోమలు, చీమలు, నల్లులు విపరీతంగా పెరిగిపోయి ఆరోగ్యానికి, ప్రశాంతమైన నిద్రకు భంగం కలిగిస్తాయి. రసాయనాలు కలిసిన విషపూరిత మందులు వాడకుండా, మన ఇంట్లో దొరికే సహజసిద్ధమైన వస్తువులతో ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మీ ఇంటిని క్రిమిరహితంగా, సురక్షితంగా ఉంచుకోవడానికి ఉపయోగపడే కొన్ని అద్భుతమైన చిట్కాలను ఇప్పుడు చూద్దాం..

1. జెర్రులు (Centipedes) రాకుండా ఉండాలంటే..

తేమ లేకుండా పొడిగా ఉంచండి: వంటగది సింక్, బాత్రూమ్ నేలను రాత్రి పూట నీరు లేకుండా తుడిచి ఆరబెట్టాలి. పైపులు, నల్లాల లీకేజీలను వెంటనే రిపేర్ చేయించాలి.
రంధ్రాలు మూసివేయండి: గోడల బిరుకులు, టైల్స్ మధ్య సందులు, తలుపుల కింద ఉండే గ్యాప్‌లను ‘సిలికాన్ సీలెంట్’ లేదా డోర్ స్వీప్స్‌తో మూసివేయాలి.
ఉప్పు, కర్పూరం స్ప్రే: కల్లుప్పు వేసిన నీటితో ఇల్లు తుడవాలి. కర్పూరం పొడి, కొద్దిగా వెనిగర్, డెటాల్‌లను నీటిలో కలిపి సింక్ కింద, మూలల్లో స్ప్రే చేస్తే కర్పూరం ఘాటుకు జెర్రులు పారిపోతాయి.
పుదీనా నూనె (Peppermint Oil): స్ప్రే బాటిల్ నీటిలో 10-15 చుక్కల పుదీనా లేదా టీ ట్రీ ఆయిల్ కలిపి మూలల్లో పిచికారీ చేయాలి. డ్రైనేజీ పైపుల్లో ఒక కప్పు వైట్ వెనిగర్ పోయడం వల్ల కూడా అవి పైకి రాకుండా ఉంటాయి.

2. దోమల దండయాత్రకు చెక్ పెట్టండి

వెల్లుల్లి స్ప్రే: వెల్లుల్లిని పేస్ట్ చేసి నీటిలో కలిపి గోడలపై స్ప్రే చేయాలి. వెల్లుల్లి ఘాటైన వాసనకు దోమలు ఇంట్లోకి రావు.
లావెండర్, వెనీలా మిశ్రమం: ఒక కప్పు నీటిలో 10 చుక్కల లావెండర్ ఆయిల్, 4 చుక్కల వెనీలా ఎసెన్స్, నిమ్మరసం కలిపి చేతులు, కాళ్లకు రాసుకుంటే దోమలు కుట్టవు.
వేప నూనె మిశ్రమం: 10-12 చుక్కల వేపనూనె లేదా టీ ట్రీ ఆయిల్ ను 30 ml కొబ్బరినూనెలో కలిపి శరీరానికి అప్లై చేయడం వల్ల దోమల నుంచి రక్షణ లభిస్తుంది.
కర్పూరం దీపం: ఇంట్లో తలుపులు, కిటికీలు మూసివేసి, పచ్చ కర్పూరం వేసిన దీపం వెలిగించి అరగంట తర్వాత తలుపులు తెరిస్తే దోమలన్నీ బయటకు పారిపోతాయి.

3. చీమల బెడద నుంచి ముక్తి

నిమ్మరసం & వెనిగర్: చీమలు వచ్చే మార్గాల్లో నిమ్మరసం చల్లినా, లేదా సగం నీటిలో రెండు చెంచాల వైట్ వెనిగర్ కలిపి స్ప్రే చేసినా చీమలు రావు.
మసాలా దినుసులు: దాల్చిన చెక్క పొడి, మిరియాల పొడి లేదా పసుపును చీమలు ఉండే మూలల్లో చల్లితే వెంటనే వెళ్ళిపోతాయి.
పుదీనా & కర్పూరం: పుదీనా ఆకులు లేదా కర్పూరం బిళ్లలను గది మూలల్లో ఉంచితే వాటి ఘాటుకు చీమలు దూరంగా ఉంటాయి.
మొక్కల వద్ద సంరక్షణ: ఇండోర్ ప్లాంట్స్ కుండీలలో వాడేసిన నిమ్మ తొక్కలు లేదా కొద్దిగా కాఫీ పొడి ఉంచితే చీమలు చేరకుండా ఉంటాయి.

4. నల్లులను (Bed Bugs) వదిలించుకోవడానికి..

వేడి నీటితో ఉతకడం: వారానికి ఒకసారి బెడ్ షీట్లు, పిల్లో కవర్లను 50-60 డిగ్రీల వేడి నీటిలో ఉతికి ఎండలో ఆరేస్తే నల్లులు, వాటి గుడ్లు నాశనం అవుతాయి.
ఎండలో ఉంచడం: నల్లులు చీకటిని ఇష్టపడతాయి. కాబట్టి వారానికి రెండుసార్లు మంచం పరుపులను, దుప్పట్లను మంచి ఎండలో ఉంచాలి.
వేపాకుల పొగ: ఎండిన వేపాకులను కాల్చి గదిలో పొగ వేస్తే నల్లులు, ఇతర క్రిములు పారిపోతాయి.
ఎసెన్షియల్ ఆయిల్స్ & బేకింగ్ సోడా: లావెండర్ లేదా పిప్పరమెంట్ ఆయిల్‌ను దూదిపై వేసి బెడ్ మూలల్లో ఉంచాలి. అలాగే పరుపుల సందుల్లో బేకింగ్ సోడా చల్లడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.

 

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Udhayanidhi: “தஞ்சாவூர் மாவட்டத்தில் பேசும்போது மிகவும் ஜாக்கிரதையாகப் பேச வேண்டும்" – உதயநிதி

எதிர்க்கட்சித் தலைவர் உதயநிதி ஸ்டாலின் தஞ்சாவூரில் நடந்த திருமண நிகழ்ச்சி ஒன்றில்...

മദ്യപിക്കാനുള്ള ക്ഷണം നിരസിച്ചു; ട്രെയിനില്‍ മുസ്‌ലിം വിദ്യാര്‍ത്ഥിക്ക് ക്രൂര മര്‍ദനം

ലഖ്‌നൗ: മദ്യം കഴിക്കാന്‍ വിസമ്മതിച്ചതിനെ തുടര്‍ന്ന് മദ്യപ സംഘം മുസ്‌ലിം യുവാവിനെ...

Canada Vs US: “தாக்கப்படும் போதுதான் போர்; நாங்கள் தாக்கப்பட்டிருக்கிறோம்" – கனடப் பிரதமர் காட்டம்

அமெரிக்கப் பொருட்களுக்கு கூடுதல் வரிகளை விதிக்கவுள்ளதாக கனடா பிரதமர் மார்க் கார்னி...