20
August, 2026

A News 365Times Venture

20
Thursday
August, 2026

A News 365Times Venture

Pakistan: ఇమ్రాన్ ఖాన్‌కు ఊరట.. 9 నెలల తర్వాత భార్య, సోదరిని కలిసిన మాజీ ప్రధాని..

Date:

Pakistan: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి మరియు పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పిటిఐ) వ్యవస్థాపకుడు అయిన ఇమ్రాన్ ఖాన్‌ దాదాపుగా 9 నెలల జైలు జీవితం తర్వాత ఆయన కుటుంబ సభ్యుల్ని కలుసుకునేందుకు అనుమతి లభించింది. ఆయన భార్య బుష్రా బీబీ, సోదరి నూరిన్ నియాజీలు రావల్పిండిలోని అడియాలా జైలులో ఆయనను పరామర్శించారు. పాక్ ప్రభుత్వం గత కొన్ని నెలలుగా ఇమ్రాన్ ఖాన్‌ను కలుసుకునేందుకు ఆయన కుటుంబీకులు, పీటీఐ నేతల్ని అనుమతించడం లేదు. జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ప్రతి వారం తన కుటుంబ సభ్యులను కలుసుకోవడానికి అనుమతిస్తూ సుప్రీం కోర్టు ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల నేపథ్యంలో ఈ భేటీ జరిగింది.

ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, జైలు నుంచి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించాల్సిందిగా పాక్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పాక్ మీడియా నివేదిక ప్రకారం.. నూరిన్ నియాజీ ఈ ఏడాది మొదటిసారిగా ఇమ్రాన్ ఖాన్‌ను కలిశారు. ఈ సమావేశం తర్వాత ఆమె తన సోదరుడి ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. వైద్య పరీక్షల కోసం షిఫా ఇంటర్నేషనల్ ఆస్పత్రికి తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే, కుటుంబీలకుల్ని కలుసుకునే క్రమంలో రాజకీయాల ప్రస్తావన తేస్తే తమ ఆదేశాల్ని రద్దు చేసుకుంటామని సుప్రీంకోర్టు షరతు విధించింది. రెండు రోజుల్లోగా ఇమ్రాన్ ఖాన్‌ను షిఫా అంతర్జాతీయ ఆసుపత్రికి తరలించాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. సెప్టెంబర్ 16వ తేదీ వరకు ఆయనను ఆసుపత్రిలోనే ఉంచాలని కోర్టు ఆదేశించింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഗവർണർ ആർലേക്കറെ ലോക് ഭവനിൽ സന്ദർശിച്ച് പൊന്നാടയണിയിച്ച് ബഷീറലി ശിഹാബ് തങ്ങൾ

തിരുവനന്തപുരം: കേരള ഗവർണർ രാജേന്ദ്ര വിശ്വനാഥ് ആർലേക്കറെ സന്ദർശിച്ച് പാണക്കാട് സയ്യിദ്...

"சட்டமன்றத்தில் முதல் பேச்சை கன்னிப் பேச்சு என்று குறிப்பிடாதீர்கள்" – வானதி சீனிவாசனின் விளக்கம்

நாடாளுமன்றத்திலும், சட்டமன்றத்திலும் முதன்முதலாகப் பேசப்படும் பேச்சை ‘கன்னிப் பேச்சு’ என்று குறிப்பிடுவார்கள்.ஆனால்,...

ನಿಶಾನೆ ಆನೆಯಾಗಿ ಅಭಿಮನ್ಯು ಬಳಸಿಕೊಂಡು ಗೌರವಯುತ ಬೀಳ್ಕೊಡುಗೆ ನೀಡಿ- ಕೆ.ವಿ. ಮಲ್ಲೇಶ್ ಆಗ್ರಹ

ಮೈಸೂರು,ಆಗಸ್ಟ್,20,2026 (www.justkannada.in):  ವಯಸ್ಸಿನ ನೆಪವೊಡ್ಡಿ ಏಕಾಏಕಿ ಅಭಿಮನ್ಯು ಆನೆಯನ್ನು ದಸರಾ...