21
October, 2026

A News 365Times Venture

21
Wednesday
October, 2026

A News 365Times Venture

New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!

Date:

Airtel New Recharge Plans: భారత టెలికాం రంగంలో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే ఎయిర్టెల్ (Airtel) కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ అవసరాలున్న వినియోగదారుల కోసం 3 కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. మొబైల్ డేటా లేకుండా ప్రత్యేకంగా వాయిస్, ఎస్ఎంఎస్ సేవలను అందిస్తున్న తొలి టెలికాం సంస్థగా ఎయిర్‌టెల్ నిలవనుంది.

ఈ కొత్త ప్లాన్లలో అపరిమిత లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్‌తో పాటు మొత్తం 300 ఎస్ఎంఎస్‌లు, హెలోట్యూన్స్ ఉచితంగా లభిస్తాయి. అయితే ఈ మూడు ప్లాన్లలో మొబైల్ డేటా మాత్రం ఉండదు. ఇందులో రూ.185 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ లో అపరిమిత వాయిస్ కాలింగ్, 300 ఎస్ఎంఎస్‌లు అందుబాటులో ఉంటాయి. ఇక రూ.203 ప్లాన్లోనూ ఇదే ప్రయోజనాలు లభిస్తాయి. అయితే దీని వ్యాలిడిటీ 30 రోజులు.

వీటితోపాటు మరో రూ.206 ప్లాన్ క్యాలెండర్-మంత్ వ్యాలిడిటీని అందిస్తుంది. అంటే రీఛార్జ్ చేసిన తేదీకి అనుగుణంగా తర్వాతి నెలలో అదే తేదీ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఈ మూడు ప్లాన్లలోనూ కాల్స్, ఎస్ఎంఎస్‌లకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చారు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) మార్గదర్శకాల నేపథ్యంలో ఎయిర్‌టెల్ ఈ ప్లాన్లను తీసుకొచ్చింది. అక్టోబర్ 21లోపు టెలికాం కంపెనీలు డేటా అవసరం లేని వినియోగదారుల కోసం ప్రత్యేక వాయిస్, ఎస్ఎంఎస్ టారిఫ్ వోచర్లను అందుబాటులోకి తీసుకురావాలని ట్రాయ్ సూచించింది.

ఈ ప్లాన్లు ప్రధానంగా ఫీచర్ ఫోన్ వినియోగదారులు, సెకండరీ సిమ్ ఉపయోగించే వారు, ఇంటర్నెట్ కోసం ఎక్కువగా వై-ఫైపై ఆధారపడే వారికి ఉపయోగపడనున్నాయి. ఇప్పటివరకు వీరు డేటా ఉపయోగించకపోయినా కాల్స్, ఎస్ఎంఎస్‌లతో పాటు డేటా కలిగిన ప్యాక్‌లకు చెల్లించాల్సి వచ్చేది. ఎయిర్‌టెల్ తర్వాత రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ కూడా ట్రాయ్ ఆదేశాలకు అనుగుణంగా ఇలాంటి ప్రత్యేక వాయిస్, ఎస్ఎంఎస్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഫ്രാന്‍സിലെ പ്രക്ഷോഭം; പ്രതിഷേധക്കാരെ നേരിടാന്‍ സൈനിക വിഭാഗങ്ങളെ വിന്യസിക്കുമെന്ന് ആഭ്യന്തര മന്ത്രാലയം

പാരീസ്: ഫ്രാന്‍സില്‍ ഈ വാരാന്ത്യത്തില്‍ നടക്കാനിരിക്കുന്ന പ്രതിഷേധങ്ങളെ നേരിടാന്‍ സൈനിക വിഭാഗങ്ങളെ...

Only On DoolNews: ദി പയനീര്‍ കേരള എഡിഷന്‍ തുടങ്ങിയിട്ട് നാല് മാസം: ലഭിച്ചത് ഒരു മാസത്തെ ശമ്പളം മാത്രം

തിരുവനന്തപുരം: ദി പയനീര്‍ പത്രത്തിന്റെ കേരള എഡിഷനില്‍ ശമ്പളമില്ലാതെ ജീവനക്കാര്‍ ജോലി...

செஞ்சி சிறுமி மாயம்: “பெண்களுக்கு அண்ணனாக இருப்பேன் என்றவரின் பதில் என்ன?”- விஜய்க்கு கனிமொழி கேள்வி

பெருந்துறை செவிலியர் மற்றும் செஞ்சி சிறுமி சம்பவங்களைக் குறிப்பிட்டு திமுக நாடாளுமன்ற...