8
August, 2026

A News 365Times Venture

8
Saturday
August, 2026

A News 365Times Venture

KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..

Date:

KCR: ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన బీఆర్ఎస్ నాయకుడు, స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి భారత రాష్ట్ర సమితి (BRS) అధినేత కేసీఆర్ అండగా నిలిచారు. పార్టీ సీనియర్లు, వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం, పార్టీ తరఫున పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి మొత్తంగా రూ. 2 కోట్ల 25 లక్షల భారీ ఆర్థిక సహాయాన్ని అందజేయాలని అధినేత నిర్ణయించారు. ఈ ఆర్థిక సాయంలో భాగంగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు వారి భవిష్యత్తు కోసం చెరో కోటి రూపాయల చొప్పున రూ. 2 కోట్లు కేటాయించారు. అలాగే, వృద్ధాప్యంలో ఉన్న ఆయన తల్లి అమృతమ్మ బాగోగుల నిమిత్తం మరో రూ. 25 లక్షలను ఆమె పేరిట బ్యాంకులో జమ చేయాలని ఆదేశించారు. కేవలం ఆర్థిక సహాయంతోనే సరిపెట్టకుండా, పిల్లల చదువులు, కుటుంబ సంక్షేమాన్ని పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తూ బాధ్యత తీసుకుంటుందని కేసీఆర్ హామీ ఇచ్చారు. దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి దశదినకర్మ పూర్తయిన తర్వాత జిల్లా పార్టీ ముఖ్య నేతలు సమావేశమై, ఆ కుటుంబానికి సంబంధించిన మరిన్ని సంక్షేమ కార్యక్రమాలపై నిర్ణయం తీసుకుంటారని కేసీఆర్ ఓ ప్రకటనలో తెలిపారు. పెద్ది కుటుంబానికి ఎల్లవేళలా పార్టీ అండగా ఉంటుందని కేసీఆర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

പോത്തുണ്ടി ഇരട്ടക്കൊലപാതകം: സുധാകരന്റെയും സജിതയുടെയും മക്കള്‍ക്ക് സര്‍ക്കാര്‍ ജോലി ഉറപ്പാക്കുമെന്ന് ആഭ്യന്തര മന്ത്രി

  പാലക്കാട്: പോത്തുണ്ടിയില്‍ ക്രൂരമായി കൊല്ലപ്പെട്ട സുധാകരന്റെയും സജിതയുടെയും മക്കളായ അഖില,...

திருவாரூர்: மன்னார்குடியில் தனியார் மருத்துவக் கல்லூரி? – முயற்சியில் பெண் பேராசிரியர்!

இந்தியாவில் மருத்துவக் கல்வியை விரிவுபடுத்தும் நோக்கத்தில் நாடு முழுவதும் புதிய அரசு...

ಬೆಂಗಳೂರು-ಮೈಸೂರು ಹೈವೇಯಲ್ಲಿ ಭೀಕರ ಅಪಘಾತ: ಇಬ್ಬರು ಸ್ಥಳದಲ್ಲೇ ಸಾವು

ರಾಮನಗರ, ಆಗಸ್ಟ್, 8,2026 (www.justkannada.in):  ಬೆಂಗಳೂರು-ಮೈಸೂರು ದಶಪಥ ಎಕ್ಸ್‌ ಪ್ರೆಸ್‌...