19
August, 2026

A News 365Times Venture

19
Wednesday
August, 2026

A News 365Times Venture

Trisha: విజయ్ చిత్రం “జన నాయగన్”పై త్రిష రివ్యూ.. బాధగా ఉందన్న తల్లి..

Date:

Trisha: దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆయన నటించిన చివరి చిత్రం “జన నాయగన్” ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చింది. విజయ్ చివరి సినిమా కావడంతో అభిమానుల ఉత్సాహానికి హద్దులు లేకుండా పోయాయి. మొదటి రోజు నుంచే థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో విజయ్ సరసన పలు హిట్ చిత్రాల్లో నటించిన ప్రముఖ నటి త్రిష కృష్ణన్ కూడా ఈ సినిమాను చూసి తన రివ్యూని పంచుకుంది.

త్రిష తన స్నేహితులతో కలిసి ‘జన నాయగన్’ ఫస్ట్ డే ఫస్ట్ షోను వీక్షించింది. సినిమా చూసిన అనంతరం కార్లో తీసుకున్న ఒక సెల్ఫీని త్రిష స్నేహితురాలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. “చివరిగా ఇంకొక్కసారి.. విజయ్ మ్యాడ్ నెస్ అంటే ఏంటో ‘జన నాయగన్’ నిరూపించింది” అని రాసుకొచ్చింది. ఈ ఫొటోలో త్రిష చాలా సింపుల్‌గా జీన్స్, వైట్ టీ-షర్ట్ ధరించి సన్ గ్లాసెస్‌తో కనిపించింది. మరోవైపు త్రిష తల్లి ఉమా కృష్ణన్ సైతం ఈ సినిమాను చూశారు. ఏఎన్‌ఐ (ANI) తో మాట్లాడిన ఆమె.. “మాకు సినిమా చాలా బాగా నచ్చింది. చాలా ఎంజాయ్ చేశాం. అయితే, నటుడిగా ఇది విజయ్‌కి చివరి సినిమా కావడం కొంత బాధగా ఉంది. వెండితెరపై ఆయనను చాలా మిస్ అవుతాం” అని వ్యాఖ్యానించారు. వీరిద్దరి స్పందనలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

‘సెంసార్/సర్టిఫికెట్’ వివాదాల కారణంగా దాదాపు ఆరు నెలల ఆలస్యంగా విడుదలైనప్పటికీ, “జన నాయగన్” కలెక్షన్లలో దుమ్మురేపుతోంది. శాక్నిల్క్ (Sacnilk) నివేదిక ప్రకారం, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే రూ.78.27 కోట్లు గ్రాస్ సాధించగా, భారత్‌లోనే రూ.41 కోట్లు నెట్ కలెక్షన్లను రాబట్టింది. సినిమా రంగానికి స్వస్తి చెప్పి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన దళపతి విజయ్, నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయన చివరి సినిమా ‘జన నాయగన్’ కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుండటంతో, వెండితెరపై ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

സെൻസസിനൊപ്പം എൻ.പി.ആർ നടപ്പാക്കാൻ കേന്ദ്രനീക്കം; പൗരത്വത്തെ മതവുമായി ബന്ധിപ്പിക്കാനുള്ള ശ്രമം അംഗീകരിക്കാനാകില്ലെന്ന് പിണറായി വിജയൻ

തിരുവനന്തപുരം: വരാനിരിക്കുന്ന സെൻസസ് ചോദ്യാവലിയിൽ മാതാപിതാക്കളുടെ ജനനസ്ഥലം, മതം തുടങ്ങിയ വിവരങ്ങൾ...

மாணவர்கள் போராட்டம் குறித்த சுற்றறிக்கை: "பாசிச அரசியலைத் தொடங்க ஆழம் பார்த்ததா தவெக அரசு?"- கனிமொழி

காக்ரோச் ஜனதா கட்சி மற்றும் இடதுசாரி போராட்டங்களில் மாணவர்கள் பங்கேற்பதைத் தடுக்க...

Pakistan: ఇమ్రాన్ ఖాన్‌కు ఊరట.. 9 నెలల తర్వాత భార్య, సోదరిని కలిసిన మాజీ ప్రధాని..

Pakistan: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి మరియు పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పిటిఐ) వ్యవస్థాపకుడు...

KPSC ಮಾಜಿ ಅಧ್ಯಕ್ಷ ಶಿವಶಂಕರಪ್ಪ ಮತ್ತೆ ಅಮಾನತಿಗೆ ರಾಜ್ಯಪಾಲರಿಗೆ ಶಿಫಾರಸು ಮಾಡಲು ಸರ್ಕಾರ ತೀರ್ಮಾನ

ಬೆಂಗಳೂರು,ಆಗಸ್ಟ್,19,2026 (www.justkannada.in): ಪಶುವೈದ್ಯಾಧಿಕಾರಿಗಳ ನೇಮಕಾತಿಯಲ್ಲಿ ಅಕ್ರಮ ಆರೋಪ ಪ್ರಕರಣಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿದಂತೆ...