18
August, 2026

A News 365Times Venture

18
Tuesday
August, 2026

A News 365Times Venture

Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్‌కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!

Date:

Kandula Jessie: ఆంధ్రప్రదేశ్‌లోని ఓ సాధారణ ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న పదో తరగతి విద్యార్థిని.. ఈ రోజు ప్రపంచ స్థాయి అంతరిక్ష పరిశోధన వైపు ముందడుగు వేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. తూర్పు గోదావరి జిల్లా దవళేశ్వరం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల (ZPGHS)లో చదువుతున్న 14 ఏళ్ల కందుల జెస్సీ, ప్రపంచంలోనే మొట్టమొదటి ఆల్-గర్ల్స్ గ్లోబల్ లూనార్ క్యూబ్‌శాట్ మిషన్ అయిన ‘మిషన్ శక్తిశాట్’ (Mission ShakthiSAT)కు ఎంపికై వార్తల్లో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 108 దేశాల నుంచి దాదాపు 12,000 మంది బాలికలు పోటీ పడగా, భారత్ నుంచి ఎంపికైన కేవలం 20 మంది విద్యార్థినుల్లో జెస్సీ ఒకరిగా నిలవడమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైన ఏకైక విద్యార్థినిగా రికార్డు సృష్టించింది.

పాఠశాల ప్రయోగశాలలో చిగురించిన ఈ అసాధారణ ప్రయాణం వెనుక ఆమె ఫిజికల్ సైన్స్ టీచర్, అటల్ టింకరింగ్ ల్యాబ్ ఇన్‌చార్జ్ మణిమాల కృషి ఎంతగానో ఉంది. సైన్స్ పట్ల జెస్సీకున్న తీవ్ర ఆసక్తిని, జిజ్ఞాసను గమనించిన మణిమాల, గతేడాది ఆమెను ఈ ప్రోగ్రామ్‌లో నమోదు చేయించారు. పదో తరగతి సాధారణ సిలబస్‌కు ఎంతగానో భిన్నంగా ఉన్న ఈ కోర్సువర్క్ ఏమాత్రం సులభంగా సాగలేదు. ఇందులో శాటిలైట్ సిస్టమ్స్, ప్రొపల్షన్, థర్మోడైనమిక్స్, స్పేస్ టెక్నాలజీ వంటి సంక్లిష్టమైన అంశాలపై 21 మోడ్యూళ్ల ద్వారా దాదాపు 550 ఆన్‌లైన్ సెషన్లు ఉన్నాయి. స్కూల్ పాఠాల కంటే ఇవి చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉండటంతో ప్రారంభంలో ఎన్నో విషయాలు అర్థం చేసుకోవడం కష్టంగా అనిపించినప్పటికీ, జెస్సీ ప్రతిరోజూ స్కూల్ పూర్తయిన తర్వాత క్రమం తప్పకుండా తరగతులకు హాజరవుతూ తన పట్టుదలను నిలుపుకుంది.

ఈ సుదీర్ఘ అభ్యాసం తర్వాత జరిగిన ఆఖరి ఎంపిక ప్రక్రియ జెస్సీ జీవితాన్నే మలుపు తిప్పింది. శాస్త్రవేత్తలు, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లతో జరిగిన గంటసేపటి ఆన్‌లైన్ ఇంటర్వ్యూతో పాటు, మిషన్ శక్తిశాట్ ప్రాముఖ్యత, STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) విద్య ఆవశ్యకతను వివరిస్తూ ఒక నిమిషం నిడివిగల వీడియోను రూపొందించాల్సి వచ్చింది. వీటిన్నింటిలోనూ తన ప్రతిభను, ఆత్మవిశ్వాసాన్ని చాటుకున్న జెస్సీ, అంతర్జాతీయ వేదికపై భారత్ ప్రతిష్టను పెంచడమే కాకుండా, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వేలాది మంది గ్రామీణ విద్యార్థినులకు ఆదర్శంగా నిలిచింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

മുഖ്യമന്ത്രിയുടെ അന്തസ് കാറ്റില്‍ പറത്തി; വോട്ട് ചെയ്തവര്‍ക്ക് പോലും ദഹിക്കാത്ത കാഴ്ച: നടി തൃഷയ്ക്ക് മുന്‍ നിരയില്‍ സീറ്റ് നല്‍കിയതില്‍ ഡി.എം.കെ

ചെന്നൈ: തമിഴ്‌നാട് സ്വാതന്ത്ര്യ ദിനാഘോഷത്തില്‍ നടി തൃഷ കൃഷ്ണന്‍ പങ്കെടുത്തതില്‍ മുഖ്യമന്ത്രി...

'கைவிட்ட காவல்துறை; கட்டுக்கடங்காத கூட்டம்… உயிர்பிழைத்து வந்ததே..!'- விசிக மாநாட்டில் நடந்ததென்ன?

வி.சி.க-வின் தமிழ்த் தேசிய எழுச்சி மாநாடு கட்டுக்கடங்காத கூட்டத்தால் பாதியிலேயே கைவிடப்பட்டதும்,...

ವಿಧಾನಸಭೆ ಡೆಪ್ಯೂಟಿ ಸ್ಪೀಕರ್ ಆಗಿ ಮಂಕಾಳ ವೈದ್ಯ, ಪರಿಷತ್ ಉಪಸಭಾಪತಿಯಾಗಿ ಉಮಾಶ್ರೀ ಆಯ್ಕೆ

ಬೆಂಗಳೂರು,ಆಗಸ್ಟ್,18,2026 (www.justkannada.in):  ಕರ್ನಾಟಕ ವಿಧಾನಸಭೆಯ ಉಪಸಭಾದ್ಯಕ್ಷರಾಗಿ ಭಟ್ಕಳ ಶಾಸಕ ಮಂಕಾಳ...