20
August, 2026

A News 365Times Venture

20
Thursday
August, 2026

A News 365Times Venture

స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్‌లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

Date:

Google Fitbit Air: గూగుల్‌కు నుండి కొత్త ఫిట్‌నెస్ ట్రాకర్ ఫిట్‌బిట్ ఎయిర్ (Fitbit Air) త్వరలో భారత మార్కెట్‌లో లాంచ్ కాబోతుంది. అమెరికాలో ఇప్పటికే విడుదలైన ఈ స్క్రీన్‌లెస్ వేరబుల్ తాజాగా అమెజాన్ (Amazon India)లో కనిపించడంతో త్వరలోనే అధికారికంగా లాంచ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గూగుల్ ఇప్పటివరకు భారత్ లో విడుదల తేదీని ప్రకటించకపోయినా.. అమెజాన్ లిస్టింగ్ ద్వారా ఈ డివైస్ ఫీచర్లు, ప్రత్యేక ఆఫర్లపై కీలక వివరాలు వెల్లడయ్యాయి.

స్క్రీన్ లేకుండా పనిచేసే ట్రాకర్:

సాధారణ స్మార్ట్‌వాచ్‌లకు భిన్నంగా Fitbit Airలో ఎలాంటి డిస్‌ప్లే ఉండదు. నోటిఫికేషన్లు లేదా సమాచారం స్క్రీన్‌పై చూపించే బదులు, వినియోగదారుడి ఆరోగ్యానికి సంబంధించిన డేటాను నిశ్శబ్దంగా సేకరించి గూగుల్ హెల్త్ యాప్ (Google Health App) ద్వారా స్మార్ట్‌ఫోన్‌లో చూపిస్తుంది. స్మార్ట్‌వాచ్‌లలో ఉండే అనవసర డిస్ట్రాక్షన్స్ లేకుండా కేవలం ఆరోగ్యంపై దృష్టి పెట్టాలనుకునే వారి కోసం ఈ డివైస్‌ను రూపొందించినట్లు గూగుల్ పేర్కొంది. రోజంతా (24/7) నిరంతరంగా ఆరోగ్య సమాచారాన్ని ట్రాక్ చేసేలా దీనిని డిజైన్ చేశారు.

లిస్టింగ్‌లో వెల్లడైన వివరాలు:

అమెజాన్ లో కనిపించిన వివరాల ప్రకారం Fitbit Air లావెండర్ రంగులో అందుబాటులోకి రానుంది. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్ 2 ప్లాట్‌ఫారమ్‌లకు మద్దతు ఇస్తుంది. ఈ డివైస్ కొనుగోలు చేసే వారికి గూగుల్ హెల్త్ ప్రీమియం (Google Health Premium) మూడు నెలల ఉచిత సబ్‌స్క్రిప్షన్ కూడా అందించనున్నట్లు లిస్టింగ్‌లో పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం కొనుగోలుకు అందుబాటులో లేకపోవడంతో పాటు భారత ధర, విడుదల తేదీని కూడా ఇంకా వెల్లడించలేదు.

AI ఆధారిత హెల్త్ కోచ్:

ఇందులో ప్రధాన ఆకర్షణ గూగుల్ హెల్త్ కోచ్ (Google Health Coach). గూగుల్ Gemini AI ఆధారంగా పనిచేసే ఈ ఫీచర్ వినియోగదారుడి ఆరోగ్య డేటా, వర్కౌట్ హిస్టరీ, రోజువారీ కార్యకలాపాలను విశ్లేషించి వ్యక్తిగత ఆరోగ్య సూచనలు అందిస్తుంది. ఫిట్‌నెస్ లక్ష్యాలను చేరుకోవడంలో ఇది వ్యక్తిగత ట్రైనర్‌లా సహాయపడుతుంది.

Fitbit Airలో అనేక హెల్త్ మానిటరింగ్ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 24 గంటల హార్ట్‌రేట్ మానిటరింగ్, రెస్టింగ్ హార్ట్‌రేట్ ట్రాకింగ్, Heart Rate Variability (HRV), Blood Oxygen (SpO2) మానిటరింగ్, నిద్ర దశల విశ్లేషణ, స్లీప్ డ్యూరేషన్ ట్రాకింగ్, AFib అలర్ట్‌లతో హార్ట్ రిథమ్ మానిటరింగ్, ఆటోమేటిక్ వర్కౌట్ డిటెక్షన్, రోజువారీ యాక్టివిటీ ట్రాకింగ్, మాన్యువల్ ఎక్సర్‌సైజ్ లాగింగ్, AI ఆధారిత గైడెడ్ వర్కౌట్స్, ఒకసారి ఛార్జ్ చేస్తే వారం రోజుల బ్యాటరీ వంటి అనేక ఫీచర్స్ ఉన్నాయి.

Fitbit Airలో బ్యాటరీని ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 7 రోజుల వరకు పనిచేస్తుందని గూగుల్ తెలిపింది. అలాగే కేవలం 5 నిమిషాల ఛార్జింగ్‌తో ఒక రోజు ఉపయోగించుకునేంత బ్యాటరీ లభిస్తుంది. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా Fitbit Airలో బ్యాండ్‌లను మార్చుకునే సౌకర్యం కూడా ఉంది.పెర్ఫార్మెన్స్ లూప్ బ్యాండ్, స్వేట్ రెసిస్టెంట్ యాక్టీవ్ బ్యాండ్, ఎలివేటెడ్ మోడరన్ బ్యాండ్ వంటి మూడు రకాల బ్యాండ్ ఎంపికలు అందుబాటులో ఉంటాయి.

గూగుల్ ఇంకా వీటి అధికారిక ధరను ప్రకటించలేదు. అమెరికాలో Fitbit Air ధర 99.99 డాలర్లు. అదే ఆధారంగా చూస్తే భారత మార్కెట్‌లో దీని ధర సుమారు రూ.13,499 నుంచి మొదలయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

മഹാത്മാ ഗാന്ധിയുടെ കുടുംബം സി.ജെ.പിക്കൊപ്പം നിൽക്കുന്നു; അത് തങ്ങളുടെ രാജ്യസ്നേഹത്തിനുള്ള ഒരു സർട്ടിഫിക്കറ്റെന്ന് അഭിജീത് ദീപ്കെ

ഛത്രപതി സംഭാജി നഗർ: മഹാത്മാഗാന്ധിയുടെ കുടുംബം തങ്ങൾക്കൊപ്പം നിൽക്കുന്നുവെന്നത് തങ്ങളുടെ രാജ്യസ്നേഹത്തിനുള്ള...

'சீட் கேட்ட பிரபல சினிமா இயக்குநர்; உடனே மறுத்த முதல்வர் விஜய்!' – அமைச்சர் ஆனந்த் பகிரும் ரகசியம்

சட்டமன்றத்தில் இன்று நீர்வளத்துறையின் மானியக் கோரிக்கையின் மீதான விவாதம் நடந்தது. மானியக்...

Bihar: AK-47 ఘటనపై నిరసన.. పోలీసుల అదుపులో తేజస్వీ యాదవ్..

Bihar: బీహార్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాట్నాలో ఆర్జేడీ నిర్వహించిన రాజ్‌భవన్...

ಯೂಟ್ಯೂಬರ್‌ ಗಳಿಗೂ ಪೊಲೀಸ್‌ ನಿಗಾ?  ಸಾಮಾಜಿಕ ಮಾಧ್ಯಮಕ್ಕೆ ಕಮಿಷನರ್ ಸೀಮಾ ಲಾಟ್ಕರ್ ಖಡಕ್ ಎಚ್ಚರಿಕೆ

ಮೈಸೂರು,ಆಗಸ್ಟ್,19,2026 (www.justkannada.in):  ಸಾಮಾಜಿಕ ಮಾಧ್ಯಮದ ಮೂಲಕ ಕ್ಷಣಾರ್ಧದಲ್ಲಿ ಲಕ್ಷಾಂತರ ಜನರನ್ನು...